Atlee: నెక్ట్స్ మూవీ టార్గెట్ రూ. 3 వేల కోట్లు- అట్లీ సంచలన స్టేట్మెంట్, ఆటాడుకుంటున్న నెటిజన్లు
స్టార్ డైరెక్టర్ అట్లీ సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు. తన తర్వాతి చిత్రం ఏకంగా రూ. 3000 కోట్లు వసూళు చేయబోతుందన్నారు. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు ఓ రేంజిలో ట్రోల్ చేస్తున్నారు.
అట్లీ కుమార్. తక్కువ సినిమాలే చేసినా, స్టార్ డైరెక్టర్ లిస్టులోకి అడుగు పెట్టారు. ‘జవాన్‘ చిత్రంతో ఓ రేంజిలో ఎదిగిపోయారు. అట్లీని నమ్మి రూ. 400 కోట్లకు పైగా బడ్జెట్ ‘జవాన్‘ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు షారుఖ్. ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకుని సత్తా చాటారు అట్లీ. బాలీవుడ్ లో అడుగు పెడుతూనే రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించారు. ఈ సినిమా విడుదలై నెల రోజులు అవుతున్నా, ఇంకా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సినిమాకు పోటీగా మరో చిత్రం లేకపోవడం కూడా ‘జవాన్‘ కు బాగా కలిసి వచ్చింది. మొత్తంగా ‘జవాన్‘ బ్లాక్ బస్టర్ హిట్ తో అట్లీ రేంజి అమాంతం పెరిగిపోయింది.
అట్లీ కామెంట్స్- నెటిజన్ల ట్రోల్స్
ఇక ‘జవాన్‘ సంచలన విజయంతో అట్లీ తదుపరి చిత్రాలపై భారీగా అంచనాలు పెట్టుకుంటున్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇందుకు ఎగ్జాంఫుల్ గా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ‘జవాన్‘ చిత్రాన్ని ఆస్కార్ నామినేషన్ కు పంపించాలని భావిస్తున్నట్లు చెప్పారు. అయితే, నెటిజన్లను అట్లీ కామెంట్స్ ను ట్రోల్ చేశారు. ప్రేక్షకులను బాగానే ఎంటర్ టైన్ చేసినా, ఆస్కార్ బరిలో నిలిచే సత్తా ఈ సినిమాకు లేదని విమర్శించారు. మరోవైపు ‘జవాన్’ మూవీ తర్వాత తనకు హాలీవుడ్ నుంచి చాలా అవకాశాలు వస్తున్నట్లు చెప్పారు. త్వరలో స్పానిష్ లో సినిమా చేయబోతున్నట్లు తెలిపారు. ఈ కామెంట్స్ పైగా పలువురు విమర్శలు చేశారు.
నా నెక్ట్స్ మూవీ టార్గెట్ రూ. 3 వేల కోట్లు- అట్లీ
తాజాగా అట్లీ చేసిన కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోల్ అవుతున్నాయి. ‘జవాన్’ మూవీ రూ. 1100 కోట్లు వసూళు చేసిందని చెప్పిన ఆయన, తన నెక్ట్స్ మూవీ ఏకంగా రూ. 3000 కోట్లు వసూళు చేయబోతుందన్నారు. బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్, తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తో మల్టీ స్టారర్ సినిమా చేయబోతున్నట్లు చెప్పారు. వారిద్దరితో సినిమా చేస్తే రూ. 3000 కోట్లు ఈజీగా క్రాస్ అవుతుందన్నారు. అట్లీ లేటెస్ట్ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఓ రేంజిలో ఆటాడేసుకుంటున్నారు. చేసిన ఒక్క రూ. 1000 కోట్ల సినిమాకే ఇంత ఓవరాక్షన్ అవసరమా? అని మండిపడుతున్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు ‘జవాన్‘కు బాబు లాంటి సినిమాలు తెరకెక్కించారనే విషయాన్ని అట్లీ మర్చిపోవద్దని చెప్తున్నారు. ‘బాహుబలి-2‘, ‘RRR’ లాంటి కనీ వినీ ఎరుగని సినిమాలను తీసినా, ఆయన ఏనాడు అతి చేయలేదంటున్నారు. ఎంత అద్భుతమైన విజయాన్ని సాధించినా, ఒదిగి ఉండాలనే విషయాన్న జక్కన్నను చూసి నేర్చుకుంటే మంచిదని సలహా ఇస్తున్నారు.
ఇంతకీ అట్లీ నెక్ట్స్ మూవీ ఎవరితో?
గత కొద్ది రోజులుగా అట్లీ అల్లు అర్జున్ తో ఓ సినిమా చేయబోతున్నట్లు టాక్ నడుస్తోంది. ఇప్పటికే అట్లీ చెప్పిన కథ బన్నీకి నచ్చడంతో ఆయన ఓకే చెప్పిట్లు సమాచారం. ఇప్పుడు షారుఖ్, విజయ్ తో మల్టీ స్టారర్ అని చెప్తున్నారు. మరోవైపు స్పానిష్ సినిమా అన్నారు. ఇంతకీ అట్లీ నెక్ట్స్ సినిమా ఎవరితో చేయబోతున్నారు? అని ఆడియెన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు.
Read Also: షాకింగ్ డెసిషన్ తీసుకున్న జగపతి బాబు - ఇక వాటికి నాకు సంబంధం లేదంటూ స్టేట్‌మెంట్!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial