అన్వేషించండి

Saripodhaa Sanivaaram: ‘సరిపోదా శనివారం’ తెలుగు రాష్ట్రాల హక్కులు వారికే - అధికారికంగా ప్రకటించిన నిర్మాతలు!

Saripodhaa Sanivaaram: నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సరిపోదా శనివారం’. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ ను దిల్ రాజు నిర్మాణ సంస్థ దక్కించుకుంది.

Saripodhaa Sanivaaram Theatrical Rights: ‘హాయ్ నాన్న’ సినిమాతో రీసెంట్ గా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు నేచురల్ స్టార్ నాని. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. కూతురు సెంటిమెంట్ తో నూతన దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కిన ఈ సినిమాకు విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి. ఈ మూవీ హిట్ జోష్ లో ఉన్న నాని, ప్రస్తుతం ‘అంటే సుందరానికి’ మూవీ దర్శకుడు వివేక్ ఆత్రేయతో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఎస్ జే సూర్య కీలక పాత్రలో నటిస్తున్నారు.

హిట్ ఇవ్వకపోయినా వివేక్ ఆత్రేయకు మరో ఛాన్స్

వాస్తవానికి నాని, వివేక్ ఆత్రేయ కాంబోలో వచ్చిన ‘అంటే సుందరానికి’ సినిమా అనుకున్న స్థాయిలో హిట్ దక్కించుకోలేకపోయింది. అయినప్పటికీ వివేక్ ఆత్రేయని,సినిమా కథను నమ్మి మరో అవకాశం ఇచ్చారు. ఈ సినిమాకు ‘సరిపోదా శనివారం’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. మూవీ అనౌన్స్‌ మెంట్ వీడియోతోనే అందరి దృష్టిని ఆకట్టుకుంది. ‘సరిపోదా శనివారం’ షూటింగ్ కూడా కొన్నాళ్ల క్రితమే ప్రారంభం అయింది. రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  

దిల్ రాజు చేతికి ‘సరిపోదా శనివారం’ థియేట్రికల్ రైట్స్

తాజాగా ‘సరిపోదా శనివారం’ సినిమాకు సంబంధించి కీలక విషయం బయటకు వచ్చింది. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాని, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దిల్ రాజు థియేట్రికల్ రైట్స్ దక్కించుకున్నారు. ఈ విషయాన్ని దిల్ రాజు నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర్ క్రియేషన్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది.  దిల్ రాజు ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాడు అని తెలియడంతో నాని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాతో నానికి మంచి సక్సెస్ అందడంతో పాటు దిల్ రాజుకు బాగానే డబ్బులు వచ్చే అవకాశం ఉందని చర్చించుకుంటున్నారు.  

‘సరిపోదా శనివారం’తో హ్యాట్రిక్ హిట్ కొట్టేనా?

ఇక ‘సరిపోదా శనివారం’ సినిమాకు మలయాళ సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్ మ్యూజిక్ అందిస్తున్నారు.  ఈ సినిమాను ఆగస్టులో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ విషయాన్ని నాని ఇటీవలే స్వయంగా వెల్లడించారు. ‘దసరా’, ‘హాయ్ నాన్న’ చిత్రాలతో సక్సెస్ అందుకున్న నాని ‘సరిపోదా శనివారం’తో  హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అని ఆయన అభిమానులు చెప్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ  విడుదల కానుంది. ఈ సినిమా అనౌన్స్‌ మెంట్ వీడియో కూడా ఐదు భాషల్లో విడుదల చేశారు మేకర్స్. 

Read Also: బాక్సాఫీస్ దగ్గర ‘నా సామిరంగ’ దూకుడు, 6 రోజుల్లో ఎంత వసూళు చేసిందంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chevella MLA: బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్! కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యే కాలె యాదయ్య
బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్! కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యే కాలె యాదయ్య
Harish Rao Meets Kavitha : తీహార్ జైల్లో కవితతో  హరీష్ రావు ములాఖత్ - లిక్కర్ కేసు తాజా పరిణామాలపై చర్చ
తీహార్ జైల్లో కవితతో హరీష్ రావు ములాఖత్ - లిక్కర్ కేసు తాజా పరిణామాలపై చర్చ
AP Government: ఉద్యోగులపై ఏపీ ప్రభుత్వం వరాల జల్లు - ఆ ఉద్యోగులకు నెల అదనపు జీతం, వారికి 5 రోజుల పనిదినాలు ఏడాది పొడిగింపు
ఉద్యోగులపై ఏపీ ప్రభుత్వం వరాల జల్లు - ఆ ఉద్యోగులకు నెల అదనపు జీతం, వారికి 5 రోజుల పనిదినాలు ఏడాది పొడిగింపు
Telangana Highcourt :  విద్యుత్ కమిషన్ రద్దుపై కేసీఆర్ పిటిషన్ - తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు
విద్యుత్ కమిషన్ రద్దుపై కేసీఆర్ పిటిషన్ - తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

India vs south Africa T20 World Cup Final | టీ20 వరల్డ్ కప్ ఫైనల్ లో ప్రత్యర్థులుగా పోటా పోటీ జట్లుRohit Sharma on Virat Kohli | T20 World Cup 2024 సెమీఫైనల్ లోనూ ఫెయిల్ అయిన కింగ్ విరాట్ కొహ్లీ |ABPAxar Patel MoM Award Ind vs Eng Semi Final | T20 World Cup 2024లో భారత్ ను ఫైనల్ కి చేర్చిన బాపు|ABPIndia vs England T20 World Cup 2024 Semis 2 | రెండేళ్ల గ్యాప్ లో ఇంగ్లండ్ కు ఇవ్వాల్సింది ఇచ్చేశాం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chevella MLA: బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్! కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యే కాలె యాదయ్య
బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్! కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యే కాలె యాదయ్య
Harish Rao Meets Kavitha : తీహార్ జైల్లో కవితతో  హరీష్ రావు ములాఖత్ - లిక్కర్ కేసు తాజా పరిణామాలపై చర్చ
తీహార్ జైల్లో కవితతో హరీష్ రావు ములాఖత్ - లిక్కర్ కేసు తాజా పరిణామాలపై చర్చ
AP Government: ఉద్యోగులపై ఏపీ ప్రభుత్వం వరాల జల్లు - ఆ ఉద్యోగులకు నెల అదనపు జీతం, వారికి 5 రోజుల పనిదినాలు ఏడాది పొడిగింపు
ఉద్యోగులపై ఏపీ ప్రభుత్వం వరాల జల్లు - ఆ ఉద్యోగులకు నెల అదనపు జీతం, వారికి 5 రోజుల పనిదినాలు ఏడాది పొడిగింపు
Telangana Highcourt :  విద్యుత్ కమిషన్ రద్దుపై కేసీఆర్ పిటిషన్ - తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు
విద్యుత్ కమిషన్ రద్దుపై కేసీఆర్ పిటిషన్ - తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు
Kalki Actress: కల్కిలో విలన్స్‌తో పోరాడి చనిపోయిన 'కైరా' ఎవరు.. - ఆమె గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?
కల్కిలో విలన్స్‌తో పోరాడి చనిపోయిన 'కైరా' ఎవరు.. - ఆమె గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?
Delhi AIrport: ఢిల్లీ ఎయిర్ పోర్టు ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ - మృతుడి కుటుంబానికి పరిహారం
ఢిల్లీ ఎయిర్ పోర్టు ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ - మృతుడి కుటుంబానికి పరిహారం
NEET Issue: పార్లమెంట్‌లో నీట్ వివాదంపై రగడ, చర్చకు విపక్షాల డిమాండ్ - సోమవారానికి వాయిదా పడ్డ లోక్‌సభ
పార్లమెంట్‌లో నీట్ వివాదంపై రగడ, చర్చకు విపక్షాల డిమాండ్ - సోమవారానికి వాయిదా పడ్డ లోక్‌సభ
RBI Warning: ప్రజలారా జాగ్రత్త - ఆర్బీఐ సంచలన నివేదిక.. ప్రమాదంలో దేశ ఆర్థిక స్థిరత్వం
ప్రజలారా జాగ్రత్త - ఆర్బీఐ సంచలన నివేదిక.. ప్రమాదంలో దేశ ఆర్థిక స్థిరత్వం
Embed widget