అన్వేషించండి

Sankranthiki Vasthunam: తెలుగులోనూ తమిళ రూల్స్ తప్పవన్న దిల్ రాజు, జస్ట్ మిస్! ప్రాణాలు పోయేవన్న అనిల్ రావిపూడి!

Cinema News | కేరళ, తమిళనాడులో సినిమా రివ్యూల విషయంలో తీసుకున్న నిర్ణయాల సక్సెస్ అవుతాయని దిల్ రాజు ఆశాభావం వ్యక్తం చేశారు. అక్కడి మాదిరిగానే తెలుగులోనూ ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉందన్నారు.

Sankranthiki Vasthunam Release Date Press Meet: సంక్రాంతికి తెలుగు సినిమా పరిశ్రమలో బాక్సాఫీస్ దగ్గర పెద్ద సినిమాల పోటీ గట్టిగా ఉంటుంది. ఈసారి కూడా పలు పెద్ద చిత్రాలు పొంగల్ బరిలో దిగుతున్నాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, నటసింహం నందమూరి బాలకృష్ణ ‘డాకు మహారాజ్’, విక్టరీ వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే రామ్ చరణ్, బాలయ్య సినిమాల రిలీజ్ డేట్స్ ఫిక్స్ కాగా, తాజాగా వెంకీ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 14న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. రిలీజ్ డేట్ అనౌన్స్ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో చిత్రబృందం పాల్గొన్నది.

తెలుగు రాష్ట్రాల్లో తమిళనాడు తరహా రూల్స్

ఇక ఈ ప్రెస్ మీట్ లో మాట్లాడిని నిర్మాత దిల్ రాజు సినిమా రివ్యూల గురించి కీలక విషయాలు వెల్లడించారు. కేరళ, తమిళనాడులో తీసుకున్న నిర్ణయాలను తెలుగులోనూ ఇంప్లిమెంట్ అవుతాయన్నారు. “సినిమా రివ్యూల విషయంలో కేరళలో ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ తమిళనాడులోనూ కొత్త రూల్స్ అమల్లోకి తీసుకొచ్చారు. నాక్కూడా ఈ రూల్స్ పంపించారు. అక్కడ తప్పకుండా సక్సెస్ అవుతాయి. ఆటోమేటిక్ గా మన రాష్ట్రంలోనూ ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంది. అయితే, ఈ నిర్ణయం నేను ఒక్కడిని తీసుకునేది కాదు. ఫిల్మ్ ఛాంబర్ ద్వారా జరుగుతుంది. ఎగ్జిబిటర్స్ కూడా దానికి ప్రిపేర్ అయినట్లు తెలుస్తున్నది. త్వరలోనే ఛాంబర్ ద్వారా రివ్యూల విషయంలో కీలక నిర్ణయం వస్తుంది” అని దిల్ రాజు వెల్లడించారు.    

జస్ట్ మిస్.. ప్రాణాలు పోయేవన్న అనిల్ రావిపూడి

ఇక ఈ ప్రెస్ మీట్ లో దర్శకుడు అనిల్ రావిపూడి షూటింగ్ స్పాట్ లో జరిగిన రియల్ ఇన్సిడెంట్ గురించి చెప్పారు.  షూటింగ్ సమయంలో కాస్త లేట్ అయి ఉంటే నటుడు వీటివీ గణేష్ ప్రాణాలు పోయేవని చెప్పారు. “షూటింగ్ స్పాట్ లో గణేష్ గారు “ఇది రియల్ గన్ తెలుసా?” అని అడిగారు. నరేష్ గారి దగ్గర రియల్ గన్ ఉందని మాకు తెలీదు. ఈయన ఆ గన్ తీసుకొచ్చి నాకు ఇచ్చారు. అది చాలా చిన్నగా ఉంది. నేను మాములు గన్ అనుకోని గణేష్ గారి వైపు  పాయింట్ చేసి పెట్టా. నరేష్ గారు అరుస్తూ వచ్చి గన్ లాక్కున్నారు. ఓపెన్ చేసి రియల్ బులెట్స్ చూపించారు. అది ఫెదర్ టచ్ అంట.. టచ్ చేస్తే బుల్లెట్ వెళ్తుందట. కాస్త లేట్ అయితే గణేష్ గారి ప్రాణాలు పోయేవి” అని చెప్పుకొచ్చారు. 

Also Read: Mufasa The Lion King Telugu: అప్పుడు చిరుకి విలన్, ఇప్పుడు మహేష్‌కి విలన్... సూపర్ స్టార్ వన్ లైనర్స్‌పై సత్యదేవ్ కామెంట్స్

‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా గురించి..

‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో వెంకటేష్ హీరోగా నటిస్తుండగా, అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు.   మీనాక్షి చౌదరి,  ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. క్రైమ్, కామెడీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్  పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే  అనిల్ రావిపూడి వెంకటేష్ కాంబినేషన్ లో ‘ఎఫ్2’, ‘ఎఫ్3’ సినిమాలు వచ్చి మంచి హిట్ అందుకున్నాయి.  ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు.  

Read Also: వేణు ఉడుగుల నిర్మాణంలో మట్టి పరిమళాల కురిపించే ప్రేమ కథ... తండేల్ వచ్చిన వెంటనే థియేటర్లలోకి 

టాప్ హెడ్ లైన్స్

Agadha Release Date : గెట్ రెడీ ఫర్ సూపర్ థ్రిల్... అగధ వచ్చేస్తోంది - వరల్డ్ వైడ్ రిలీజ్ డేట్ ఫిక్స్
గెట్ రెడీ ఫర్ సూపర్ థ్రిల్... అగధ వచ్చేస్తోంది - వరల్డ్ వైడ్ రిలీజ్ డేట్ ఫిక్స్
Lenin: అఖిల్ అక్కినేని ఒక్కడికే కాదు... భాగ్యశ్రీ బోర్సేకీ 'లెనిన్' సక్సెస్ ఇంపార్టెంటే
అఖిల్ అక్కినేని ఒక్కడికే కాదు... భాగ్యశ్రీ బోర్సేకీ 'లెనిన్' సక్సెస్ ఇంపార్టెంటే
Trikala OTT : ఆ ఊరిలో అమ్మవారికి ముడుపు కడితే? - ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ త్రికాల
ఆ ఊరిలో అమ్మవారికి ముడుపు కడితే? - ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ త్రికాల
Nindu Manasulu Serial Today July 9th: నిండు మనసులు: రాజశేఖరం కఠిన నిర్ణయం..! ఇందిరను కాల్చేసింది ఎవరు?
నిండు మనసులు: రాజశేఖరం కఠిన నిర్ణయం..! ఇందిరను కాల్చేసింది ఎవరు?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YouTuber Joseph Ravan: యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
Tirupati Crime News: తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
Hindu Tradition: పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
US Iran War: చెప్పినట్టుగానే ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా! పేల్చేసిన రైల్వే వంతెనలు వీడియో షేర్‌ చేసిన ట్రంప్! 
చెప్పినట్టుగానే ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా! పేల్చేసిన రైల్వే వంతెనలు వీడియో షేర్‌ చేసిన ట్రంప్! 
Truck Slogan: ట్రక్కుల వెనుక రాత్రిపూట డిప్పర్ వాడండి అని ఎందుకు రాస్తారు? దానికి కండోమ్‌తో సంబంధం ఏంటి?
ట్రక్కుల వెనుక రాత్రిపూట డిప్పర్ వాడండి అని ఎందుకు రాస్తారు? దానికి కండోమ్‌తో సంబంధం ఏంటి?
Nagadurga: ఇడుపు కాయితానికి ముందు...  తెలుగమ్మాయి రాతను తమిళ్ సినిమా మారుస్తుందా?
ఇడుపు కాయితానికి ముందు...  తెలుగమ్మాయి రాతను తమిళ్ సినిమా మారుస్తుందా?
TDP BJP Silence On Ravan Issue: రావణ్ ఇష్యూ.. కూటమిదా, జనసేనదా? ఉపా చట్టం ప్రయోగంపై చంద్రబాబు, బీజేపీ సైలెన్స్ వెనుక మర్మమేంటి!?
రావణ్ ఇష్యూ.. కూటమిదా, జనసేనదా? ఉపా చట్టం ప్రయోగంపై చంద్రబాబు, బీజేపీ సైలెన్స్ వెనుక మర్మమేంటి!?
Nitin Gadkari on E20 Fuel: E20 పెట్రోల్‌తో ఒక్క వాహనం పాడైనా తీసుకురండి! నితిన్ గడ్కరీ ఓపెన్ ఛాలెంజ్‌!
E20 పెట్రోల్‌తో ఒక్క వాహనం పాడైనా తీసుకురండి! నితిన్ గడ్కరీ ఓపెన్ ఛాలెంజ్‌!
Embed widget