By: ABP Desam | Updated at : 23 Feb 2023 07:00 PM (IST)
మార్టిన్ సినిమాలో ధృవ సర్జా (Image Credits: DhruvaSarja Twitter)
Martin Teaser: కేజీయఫ్ తర్వాత కన్నడ ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. ఇటీవలే ‘పొగరు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించిన ధృవ సర్జా మరో పాన్ ఇండియా సినిమాతో రానున్నాడు. అదే ‘మార్టిన్’. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
‘కేజీయఫ్’ టీజర్ తరహాలోనే ఇందులో కూడా హిందీ, ఇంగ్లిష్ డైలాగ్స్ ఉంచి అన్ని భాషలకు ఒకే టీజర్‌ను విడుదల చేశారు. టీజర్ ఎడిటింగ్ ప్యాటర్న్ కూడా కేజీయఫ్ తరహాలోనే ఉంది. కథలో ఎక్కువ భాగం పాకిస్తాన్‌లోని ఒక జైల్లో జరుగుతున్నట్లు చూపించారు. ఆ జైల్లో అనేక మంది పాకిస్తానీ ఖైదీల మధ్య ఉండే భారతీయ ఖైదీగా ధృవ సర్జా కనిపించనున్నారు. ‘మీరంతా బలవంతులం అని అనుకుంటున్నారు. కానీ నేను బలవంతుడినని నాకు తెలుసు.’ వంటి మాస్ డైలాగ్స్ కూడా టీజర్‌లో ఉన్నాయి.
దీనికి తోడు స్పోర్ట్స్ కార్లు, బైక్‌లతో ఛేజింగ్‌లు, కళ్లు చెదిరే యాక్షన్ సీన్లతో టీజర్‌ను నింపేశారు. ఈ సినిమాకు కథను యాక్షన్ కింగ్ అర్జున్ అందించారు. ప్రముఖ కన్నడ దర్శకుడు ఏపీ అర్జున్ ‘మార్టిన్’కు దర్శకత్వం వహించారు.
వైష్ణవి శాండిల్య హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో మాళవిక అవినాష్, చిక్కన్న, నికితిన్ ధీర్, సాధు కోకిల, అచ్యుత్ కుమార్, గిరిజ లోకేష్, రోహిత్ పాఠక్, శ్రీరామ్ రెడ్డి పోలసాని కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఉదయ్ కె. మెహతా ఈ సినిమాను నిర్మించారు. మణి శర్మ పాటలను స్వరపరచగా, రవి బస్రూర్ నేపథ్య సంగీతం అందించారు. సినిమాటోగ్రఫీ బాధ్యతలు అమీ అర్నాల్డ్ నిర్వహించారు. డాక్టర్ రవివర్మ, రామ్ లక్ష్మణ్, గణేష్ మాస్ మడ యాక్షన్ సన్నివేశాలు డిజైన్ చేశారు.
ధ్రువ సర్జా ఇటీవలే మరో కొత్త సినిమాను కూడా ప్రారంభించారు. అదే ‘కేడీ - ది డెవిల్’. దర్శకుడు ప్రేమ్ ఓ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ టీజర్ ను కూడా ఇటీవలే విడుదల చేశారు. ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ గా టీజర్ ను కట్ చేశారు. 'రామాయణ యుద్ధం స్త్రీ కోసం.. మహాభారత యుద్ధం రాజ్యం కోసం.. ఈ కలియుగ యుద్ధం కేవలం రక్తం కోసం' అనే డైలాగ్ తో టీజర్ మొదలైంది.
ఆ తరువాత కాళీ అనే వ్యక్తి రిలీజ్ అవుతున్నాడని.. పోలీసులు సిటీ మొత్తాన్ని అలెర్ట్ చేయడం, సిటీ లోపలకి అతడు రాకుండా చేయడానికి జాగ్రత్తలు తీసుకోవడం వంటి సన్నివేశాలను చూపించారు. అతడిని చంపడానికి వేల మంది జనాలు రెడీగా ఉన్నారని పోలీసులు అనుకుంటారు.
కానీ ఆ వ్యక్తిని ఊరేగించడానికి వేల మంది జనాలు జైలు దగ్గరకు తరలివస్తారు. మెల్లగా నిప్పుల మధ్య హీరోను రివీల్ చేస్తూ.. 'ఫీల్డ్ లోకి దిగాక యుద్ధం చేయాల్సిందే.. చస్తే వీరమరణం.. గెలిస్తే సింహాసనం.. యుద్ధం మొదలెడదామా అన్నయ్యా' అంటూ హీరోతో డైలాగ్ చెప్పించారు. అదే సమయంలో 'కేడి' అనే టైటిల్ ను రివీల్ చేశారు. టీజర్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది.
ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దానికి తగ్గట్లే సినిమాలో క్యాస్టింగ్ కూడా ఉంది. అయితే నటీనటులను మాత్రం ఇంకా రివీల్ చేయలేదు. అర్జున్ జన్య ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. విలియం డేవిడ్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు.
Janaki Kalaganaledu March 29th: తండ్రిని నోటికొచ్చినట్టు తిట్టిన అఖిల్- సర్దుకుపొమ్మని చెప్పిన జ్ఞానంబ
Keerthy Suresh: నాలుగు పళ్లతో నవ్వమన్నాడు - కీర్తి సురేష్‌కు షాకిచ్చిన ‘దసరా’ దర్శకుడు
Gruhalakshmi March 29th: రాజ్యలక్ష్మి అసలు స్వరూపం తెలుసుకున్న ప్రియ- లాస్య ట్రాప్ లో పడిపోయిన దివ్య
Guppedanta Manasu March 29th: కొత్త గేమ్ స్టార్ట్ చేసిన రిషిధార, క్షమించమని జగతిని అడిగిన ఈగో మాస్టర్!
Brahmamudi March 29th: అందరి ముందు అడ్డంగా బుక్కైన రాజ్- అన్నని ఇరికించేసిన కళ్యాణ్
KCR Decisions: పోడు భూములకు పట్టాలు రెడీ, పంపిణీపై త్వరలో తేదీ ప్రకటిస్తాం: సీఎం కేసీఆర్
AP 10th Exams: 'పది'లో ఆరుపేపర్లు, బిట్ పేపర్ లేకుండానే ప్రశ్నపత్రం! విద్యార్థులకు 'సిలబస్' కష్టాలు!
పది రోజుల్లో 50 వేల బుకింగ్స్, TSRTC కొత్త ప్లాన్‌కు అపూర్వ స్పందన, ఇకపై ఎనీటైమ్!
నా ఇంటికి రా రాహుల్ భయ్యా- రేవంత్ ఎమోషనల్ ట్విట్