News
News
X

Dhamaka Box Office : రవితేజ 'ధమాకా' - ఆరు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

Dhamaka Collection day 6 :రవితేజ, శ్రీలీల జంటగా నటించిన 'ధమాకా' సినిమా మంచి వసూళ్ళు రాబడుతోంది. ఆరు రోజుల్లో ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

FOLLOW US: 
Share:

మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా 'ధమాకా' (Dhamaka Collections) నిలిచింది. రవితేజకు సూపర్ డూపర్ కమర్షియల్ సక్సెస్ అందించింది. వీకెండ్ తర్వాత కూడా బాక్సాఫీస్ బరిలో సినిమా దూకుడు తగ్గలేదు. 

రవితేజ సరసన శ్రీలీల (Sreeleela) కథానాయికగా నటించిన 'ధమాకా' (Dhamaka Movie) డిసెంబర్ 23న థియేటర్లలో విడుదలైంది. మాస్ మహారాజా నుంచి సగటు అభిమాని, తెలుగు ప్రేక్షకులు ఏం కోరుకుంటారో? ఆ అంశాలన్నీ ఉన్న సినిమా అని పేరు తెచ్చుకుంది. అయితే, తొలి రోజు విమర్శకులతో పాటు కొంత మంది ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. కానీ, థియేటర్లలో మాత్రం సూపర్ డూపర్ రెస్పాన్స్ లభించింది. వసూళ్ళ పరంగా దుమ్ము రేపుతోంది.

'ధమాకా' @ 56 కోర్స్!
'ధమాకా' 50 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరింది. ఐదు రోజుల్లో 49 కోట్ల రూపాయలకు పైగా కలెక్ట్ చేసిందని చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రకటించింది.  ఆరు రోజు ఆ 50 కోట్ల మార్క్ క్రాస్ చేసింది. ఇప్పటివరకు ఈ సినిమా 56 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిందని చిత్ర బృందం పేర్కొంది.
 
'ధమాకా' తొలి రోజు పది కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. ఫస్ట్ వీకెండ్ ప్రపంచవ్యాప్తంగా 32 కోట్లు కలెక్ట్ చేసింది. సాధారణంగా వీకెండ్ తర్వాత సినిమా కలెక్షన్స్ డల్ అవుతాయి. ఆదివారం రాబట్టిన వసూళ్ళలో సోమవారం సగం వస్తే గొప్ప అని ట్రేడ్ వర్గాలు చెబుతుంటాయి. కానీ, 'ధమాకా' అలా కాదు... నాలుగో రోజు కూడా దుమ్ము లేపింది. మొదటి మూడు రోజుల్లో 32 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన 'ధమాకా'... నాలుగో రోజు 42 ప్లస్ కోర్స్ కలెక్ట్ చేసింది. 

ఐదో రోజు 'ధమాకా'కు ఏడు కోట్లు!
'ధమాకా' సినిమా వసూళ్ళలో ఐదో రోజు, ఆరో రోజు కూడా పెద్దగా డ్రాప్ లేదు. ఏడు కోట్ల రూపాయలు వసూలు చేసింది. మౌత్ టాక్ బాగుండటంతో ఇంకా థియేటర్లకు ప్రేక్షకులు వస్తున్నారు. 'ధమాకా'కు ముందు ఈ ఏడాది రవితేజ నటించిన రెండు సినిమాలు విడుదల అయ్యాయి. ఆ రెండూ ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. బాక్సాఫీస్ బరిలో డిజాస్టర్లుగా నిలిచాయి. దాంతో ఈ ఏడాది రవితేజకు విజయం వస్తుందా? లేదా? 'ధమాకా' వసూళ్ళు రవితేజ పరీక్ష పెడతాయి? వంటి మాటలు విడుదలకు ముందు వినిపించాయి. ఆ అనుమానాలు అన్నిటినీ మాస్ మహారాజా పటాపంచలు చేశారు.

Also Read : 'బటర్ ఫ్లై' రివ్యూ : గొంగళి పురుగు సీతాకోక చిలుకలా మారినట్టు - అనుపమా పరమేశ్వరన్ ఎలా ఉందంటే?

త్రినాథ రావు నక్కిన దర్శకత్వం వహించిన 'ధమాకా'కు బెజవాడ ప్రసన్న కుమార్ కథ అందించారు. ఈ సినిమాకు 'డబుల్ ఇంపాక్ట్'... అనేది ఉపశీర్షిక. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు టీజీ విశ్వప్రసాద్ నిర్మాత. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ఆయన పాటలు, నేపథ్య సంగీతానికి కూడా మంచి పేరు వచ్చింది.

'ధమాకా' విజయంతో 2022కి వీడ్కోలు పలుకుతున్న రవితేజ... సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య'తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు ఆయన ఆ సినిమాలో నటించారు. అది కాకుండా ప్రస్తుతం రవితేజ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. సుధీర్ వర్మ దర్శకత్వంలో 'రావణాసుర' సినిమా చేస్తున్నారు రవితేజ. అది కాకుండా 'ధమాకా' సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఆ సినిమాకు 'ఈగల్' టైటిల్ ఖరారు చేసినట్లు టాక్. 'టైగర్ నాగేశ్వరరావు' సినిమా ఉంది. అది పాన్ ఇండియా రిలీజ్ కానుంది. ఈ మూడు సినిమాలు వచ్చే ఏడాది విడుదల కానున్నాయి.

Also Read : బాలకృష్ణతో బాహుబలి - ఇయర్ ఎండ్ ముందు ఒకటి, తర్వాత మరొకటి!

Published at : 29 Dec 2022 10:55 AM (IST) Tags: Ravi Teja sreeleela Dhamaka Box Office Dhamaka Collections Dhamaka Records Collections

సంబంధిత కథనాలు

K Viswanath Songs: పాటంటే కేవలం పాట కాదు, అందులోనూ కథ చెప్పడం విశ్వనాథ్ స్టైల్ - అందుకే అవి క్లాసిక్స్‌

K Viswanath Songs: పాటంటే కేవలం పాట కాదు, అందులోనూ కథ చెప్పడం విశ్వనాథ్ స్టైల్ - అందుకే అవి క్లాసిక్స్‌

Thalapathy67: కత్తులు, చాక్లెట్లు, విజయ్, విలన్స్ - ప్రోమోతోనే సిక్సర్ కొట్టిన లోకేష్ కనగరాజ్ - టైటిల్ ఏంటో తెలుసా?

Thalapathy67: కత్తులు, చాక్లెట్లు, విజయ్, విలన్స్ - ప్రోమోతోనే సిక్సర్ కొట్టిన లోకేష్ కనగరాజ్ - టైటిల్ ఏంటో తెలుసా?

Amigos Trailer : ముగ్గురిలో ఒకడు రాక్షసుడు అయితే - కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ట్రైలర్ వచ్చేసిందోచ్

Amigos Trailer : ముగ్గురిలో ఒకడు రాక్షసుడు అయితే - కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ట్రైలర్ వచ్చేసిందోచ్

‘ఫరాజ్’ సినిమాకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ - స్టే నిరాకరణ, వివాదం ఏమిటీ?

‘ఫరాజ్’ సినిమాకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ - స్టే నిరాకరణ, వివాదం ఏమిటీ?

K Viswanath Oscars : ఆస్కార్ బరిలో నిలిచిన తొలి తెలుగు దర్శకుడు విశ్వనాథ్

K Viswanath Oscars : ఆస్కార్ బరిలో నిలిచిన తొలి తెలుగు దర్శకుడు విశ్వనాథ్

టాప్ స్టోరీస్

Kishan Reddy On Governer Speech : అన్నీ అబద్దాలే - తమిళిసై ప్రసంగంపై కిషన్ రెడ్డి విమర్శలు !

Kishan Reddy On Governer Speech : అన్నీ అబద్దాలే - తమిళిసై ప్రసంగంపై కిషన్ రెడ్డి విమర్శలు   !

Lokesh Padayatra Tension : లోకేశ్ పాదయాత్రలో మరోసారి ఉద్రిక్తత, బహిరంగ సభకు అనుమతి లేదని ప్రచార వాహనం సీజ్

Lokesh Padayatra Tension : లోకేశ్ పాదయాత్రలో మరోసారి ఉద్రిక్తత, బహిరంగ సభకు అనుమతి లేదని ప్రచార వాహనం సీజ్

Delhi YSRCP Mps : ప్రత్యేకహోదా కోసం ప్రైవేటు బిల్లు - ఢిల్లీలో వైఎస్ఆర్‌సీపీ ఎంపీల కీలక ప్రకటన !

Delhi YSRCP Mps : ప్రత్యేకహోదా కోసం ప్రైవేటు బిల్లు - ఢిల్లీలో వైఎస్ఆర్‌సీపీ ఎంపీల కీలక ప్రకటన !

నన్ను ఎన్ కౌంటర్ చేయించండి- కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు

నన్ను ఎన్ కౌంటర్ చేయించండి- కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు