News
News
X

Unstoppable 2 Bahubali Episode : బాలకృష్ణతో బాహుబలి - ఇయర్ ఎండ్ ముందు ఒకటి, తర్వాత మరొకటి!

నట సింహం నందమూరి బాలకృష్ణ 'అన్‌స్టాపబుల్ 2'కి మన 'బాహుబలి' ప్రభాస్, అతనితో పాటు స్నేహితుడు గోపీచంద్ వచ్చారు. ఆ ఎపిసోడ్ రెండు పార్టులుగా స్ట్రీమింగ్ కానుంది.

FOLLOW US: 
Share:

'బాహుబలి' సినిమా గుర్తు ఉందిగా! మొదట దర్శక ధీరుడు రాజమౌళి ఒక్క సినిమా అని స్టార్ట్ చేశారు. తర్వాత రెండు పార్టులుగా విడుదల చేశారు. మన 'బాహుబలి' ప్రభాస్ ఉన్నారు కదా! నట సింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న 'ఆహా' ఓటీటీ ఎక్స్‌క్లూజివ్‌ టాక్ షో 'అన్‌స్టాపబుల్ 2'కి వచ్చారు కదా! తొలుత ఒక్క ఎపిసోడ్ అనుకున్నారేమో! కానీ, ఇప్పుడు రెండు ఎపిసోడ్స్ కింద విడుదల చేస్తున్నారు. 

డిసెంబర్ 30న ఫస్ట్ పార్ట్
Unstoppable 2 with NBK - The Beginning on 30th December : ప్రభాస్, గోపీచంద్ అతిథులుగా వచ్చిన ఎపిసోడ్ మొత్తం 100 నిమిషాలు వచ్చిందని 'ఆహా' వర్గాలు పేర్కొన్నాయి. రెండు గంటలకు 20 నిమిషాలు తక్కువ అన్నమాట. దీనిని రెండు భాగాలుగా డివైడ్ చేశారు. మొదటి పార్టుకు 'అన్‌స్టాపబుల్ 2 విత్ ఎన్‌బీకే - ది బిగినింగ్' అని పేరు పెట్టారు. ఇందులో ప్రభాస్ ఒక్కరే ఉంటారట. దానిని న్యూ ఇయర్ కానుకగా డిసెంబర్ 30న విడుదల చేయనున్నారు. మరి, రెండో ఎపిసోడ్ అంటే? అది న్యూ ఇయర్ తర్వాతే!

జనవరి 6న రెండో పార్ట్
Unstoppable 2 with NBK - The Conclusion on 6th January : రెండో పార్టుకు  'అన్‌స్టాపబుల్ 2 విత్ ఎన్‌బీకే - ది కన్‌క్లూజన్‌' అని పేరు పెట్టారు. ఇందులో ప్రభాస్ సహా గోపీచంద్ కూడా సందడి చేయనున్నారు. ఈ పార్ట్ జనవరి 6న విడుదల చేయనున్నారు.

మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్టు తీస్తే... అందులో ప్రభాస్ (Prabhas) పేరు ముందు వరుసలో ఉంటుంది. ఆయన ఓ ఇంటివాడు అయితే? అమ్మాయితో ఏడు అడుగులు వేస్తే? చూడాలని చాలా మంది ఆశ పడుతున్నారు. 'అన్‌స్టాపబుల్ 2'లో ఆ పెళ్లి ప్రస్తావన తీసుకు వచ్చారని ఆల్రెడీ విడుదలైన ప్రోమో చూస్తే అర్థం అవుతుంది. 

ప్రభాస్ మరో రెండు నెలల్లో పెళ్లి చేసుకోనున్నారని బాలకృష్ణతో 'అన్‌స్టాపబుల్ 2'లో రామ్ చరణ్ చెప్పినట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది తప్పకుండా ప్రభాస్ పెళ్లి ఉంటుందని గోపీచంద్ కూడా చెప్పారట. ఆ విషయాలు అన్నీ రెండో పార్టులో ఉంటాయట.  

Also Read : అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు - టాప్‌లో బాలకృష్ణ, నెక్స్ట్ ఎవరంటే?

View this post on Instagram
 
A post shared by ahavideoin (@ahavideoin)

'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే' షో చరిత్రలో ఓ ఎపిసోడ్‌ను రెండుగా వీక్షకుల ముందుకు తీసుకు వస్తుండటం ఇదే మొద‌టిసారి. ''మాకు అభిమానుల నుంచి లెక్కలేనన్ని మెసేజెస్ వచ్చాయి. ఎటువంటి ఎడిటింగ్ లేకుండా ప్రసారం చేయాల‌ని కోరారు. ప్ర‌భాస్ ఎపిసోడ్ ఫైన‌ల్ కట్ విష‌యంలో ఆహా టీమ్ చాలా సంతోషంగా ఉంది. ప్ర‌భాస్‌, నంద‌మూరి బాల‌కృష్ణ, ఆహా టీమ్ అంత‌ర్గ‌తంగా చ‌ర్చించుకున్న త‌ర్వాత రెండు భాగాలుగా ఈ ఎపిసోడ్‌ను విడుదల చేయాలని డిసైడ్ అయ్యాము'' అని 'ఆహా' వర్గాలు తెలిపాయి. 

ప్రభాస్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు గురూజీ వచ్చిన ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. సంక్రాంతి కానుకగా ఆ ఎపిసోడ్ విడుదల కానుందని సమాచారం. ఆహా వర్గాలు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

Also Read : మెగా, నందమూరి హీరోలు కలుస్తున్నారు - ఫ్యాన్స్ కలిసేది ఎప్పుడు? ఈ గొడవలేంట్రా బాబు?

Published at : 28 Dec 2022 05:26 PM (IST) Tags: gopichand Nandamuri Balakrishna Aha OTT Prabhas Unstoppable 2 Unstoppable Bahubali Episode

సంబంధిత కథనాలు

Salim Khan Marriage: పెళ్లి కోసం పేరు మార్చుకున్న సల్మాన్ తండ్రి, సలీం ఖాన్ శంకర్ గా ఎలా మారారో తెలుసా?

Salim Khan Marriage: పెళ్లి కోసం పేరు మార్చుకున్న సల్మాన్ తండ్రి, సలీం ఖాన్ శంకర్ గా ఎలా మారారో తెలుసా?

Satyadeep Misra Marriage: రహస్యం ఏమీ లేదు, అందరికీ చెప్పే మసాబాను పెళ్లి చేసుకున్నా- సత్యదీప్ మిశ్రా

Satyadeep Misra Marriage: రహస్యం ఏమీ లేదు, అందరికీ చెప్పే మసాబాను పెళ్లి చేసుకున్నా- సత్యదీప్ మిశ్రా

Sidharth Kiara Advani Wedding: సిద్ధార్థ్-కియారా పెళ్లికి వెళ్లే గెస్టులకు ఓ కండీషన్, దయచేసి ఆపని చెయ్యొద్దని కోరిన కొత్త జంట!

Sidharth Kiara Advani Wedding: సిద్ధార్థ్-కియారా పెళ్లికి వెళ్లే గెస్టులకు ఓ కండీషన్, దయచేసి ఆపని చెయ్యొద్దని కోరిన కొత్త జంట!

Vani Jayaram Death Mystery : రక్తపు మడుగులో వాణీ జయరామ్ - మిస్టరీగా లెజండరీ సింగర్ మృతి

Vani Jayaram Death Mystery : రక్తపు మడుగులో వాణీ జయరామ్ - మిస్టరీగా లెజండరీ సింగర్ మృతి

Singer Vani Jayaram Death : లెజండరీ సింగర్ వాణీ జయరామ్ మృతి - రెండు  నేషనల్ అవార్డులు విశ్వనాథ్ సినిమాల్లో పాటలకే

Singer Vani Jayaram Death : లెజండరీ సింగర్ వాణీ జయరామ్ మృతి - రెండు  నేషనల్ అవార్డులు విశ్వనాథ్ సినిమాల్లో పాటలకే

టాప్ స్టోరీస్

Peddagattu Jatara 2023 Effect: హైదరాబాద్‌ - విజయవాడ హైవేపై ఈ నెల 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపులు ఇలా

Peddagattu Jatara 2023 Effect: హైదరాబాద్‌ - విజయవాడ హైవేపై ఈ నెల 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపులు ఇలా

Buggana Rajendranath: మూడేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.1.34 లక్షల కోట్లు: మంత్రి బుగ్గన

Buggana Rajendranath: మూడేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.1.34 లక్షల కోట్లు: మంత్రి బుగ్గన

Hero Naveen Reddy : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ రెడ్డి అరెస్టు, చీటింగ్ చేసి జల్సాలు!

Hero Naveen Reddy : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ రెడ్డి అరెస్టు, చీటింగ్ చేసి జల్సాలు!

AOC Recruitment 2023: పదోతరగతి అర్హతతో 'ఇండియన్ ఆర్మీ'లో ఉద్యోగాలు, 1793 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!

AOC Recruitment 2023: పదోతరగతి అర్హతతో  'ఇండియన్ ఆర్మీ'లో ఉద్యోగాలు, 1793  పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!