Deepika Padukone: రణవీర్ న్యూడ్ ఫొటోషూట్ పై దీపికా రియాక్షన్!
రణవీర్ న్యూడ్ ఫొటోషూట్ పై అతడి భార్య, బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోన్ ఎలా రియాక్ట్ అయిందో తెలుసా..?

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ఇటీవల న్యూడ్ ఫొటోషూట్ లో పాల్గొన్నారు. ఈ ఫొటోలు ఎంతగా వైరల్ అయ్యాయో తెలిసిందే. ఒంటిపై నూలు పోగు లేకుండా అతడు తీసుకున్న ఫొటోలు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. మీమర్స్ కూడా ఈ ఫొటోషూట్ పై వందల కొద్దీ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. సెలబ్రిటీలు కూడా ఈ ఫొటోషూట్ పై స్పందిస్తున్నారు. కొందరు నెటిజన్లు మాత్రం రణవీర్ ను ట్రోల్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. రణవీర్ న్యూడ్ ఫొటోషూట్ పై అతడి భార్య, బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోన్ ఎలా రియాక్ట్ అయిందో తెలుసా..? రణవీర్ సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం.. దీపికాకు ఈ ఫొటోషూట్ బాగా నచ్చిందట. ఇలాంటి ఫొటోషూట్ ను ప్లాన్ చేస్తున్నట్లు ఆమెకి మొదటినుంచి తెలుసట. ఈ కాన్సెప్ట్ గురించి చెప్పగానే ఆమె ఇష్టపడిందని తెలుస్తోంది.
దీపికా ప్రతి విషయంలో తన భర్తకు సపోర్ట్ గా ఉంటుంది. మిగిలిన తారలతో పోలిస్తే రణవీర్ కాస్త డిఫరెంట్ గా ఉండడానికి ఇష్టపడతాడు. ఈ విషయంలో దీపికా అతడికి ఎలాంటి లిమిట్స్ పెట్టదు. పేపర్ మ్యాగజైన్ కోసం రణవీర్ ఈ ఫొటోషూట్ లో పాల్గొన్నారు. ఈ మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినిమాలు, వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు రణవీర్.
ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం రణవీర్ 'సర్కస్', 'రాఖీ ఔర్ రాణికీ ప్రేమ్ కహానీ' అనే సినిమాల్లో నటిస్తున్నారు. మరోపక్క దీపికా పదుకోన్.. 'ప్రాజెక్ట్ K' సినిమాలో నటిస్తోంది. ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Also Read : 'కలర్ ఫోటో' ఎందుకంత స్పెషల్? నేషనల్ అవార్డు కంటెంట్ క్రియేటర్లకు ఎటువంటి కాన్ఫిడెన్స్ ఇస్తుంది?
Also Read : తొలి ఛాన్స్ నుంచి 'ఆకాశమే నీ హద్దురా' వరకూ - సూర్య నేషనల్ అవార్డ్ కుటుంబానికి అంకితం
View this post on Instagram
Before You Go
National Award for Committee Kurrollu | మెగా డాటర్ చిత్రానికి నేషనల్ అవార్డ్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















