Pathaan: దీపికా పడుకోనే సీన్లకు సెన్సార్ - ‘పఠాన్’లో ఏమేం ఎగిరిపోయాయ్?
పఠాన్ సినిమా సెన్సార్ రిపోర్ట్ బయటకు వచ్చిందని వార్తలు వస్తున్నాయి.
బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ నటించిన ‘పఠాన్’ సినిమాలోని బేషరమ్ రంగ్ పాటలో దీపికా పడుకొనే వైరల్ “సైడ్ పోజ్” సెన్సార్ అయిందని సమాచారం.ఈ పాట విడుదలైన తర్వాత పెద్ద వివాదానికి దారితీసింది. మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా, రాష్ట్ర శాసనసభ స్పీకర్ గిరీష్ గౌతమ్‌తో సహా పలువురు రాజకీయ నాయకులు దీపికా పడుకోనే "Saffron" బికినీ, SRK "ఆకుపచ్చ" షర్ట్‌ను పాటలో వ్యతిరేకించారు. దాన్ని మార్చి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు.
బాలీవుడ్‌లో వినిపిస్తున్న కథనాల ప్రకారం దీపిక “సైడ్ పోజ్ (పాక్షిక నగ్నత్వం)”తో పాటు 'బహుత్ తాంగ్ కియా' లిరిక్స్‌లో కొన్ని షాట్లను కూడా తొలగించినట్లు తెలుస్తోంది. అయితే ఆరెంజ్ బికినీ షాట్‌లు అలాగే ఉన్నాయా లేదా అనేది ఇంకా తెలియరాలేదు.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) గతంలో షారుఖ్ ఖాన్, దీపికా పడుకోనే నటించిన 'పఠాన్' చిత్రానికి కొన్ని మార్పులను అమలు చేయాలని సూచించింది. మీడియాకు పంపిన అధికారిక ప్రకటనలో CBFC చైర్‌పర్సన్ ప్రసూన్ జోషి, “CBFC మార్గదర్శకాల ప్రకారం పఠాన్ ఎగ్జామినింగ్ ప్రాసెస్ పూర్తయింది. సూచించిన మార్పులను అమలు చేయాలని, థియేట్రికల్ రిలీజ్‌కు ముందు రివైజ్డ్ కాపీని సమర్పించాలని కమిటీ మేకర్స్‌కు మార్గనిర్దేశం చేసింది. సృజనాత్మక వ్యక్తీకరణ, ప్రేక్షకుల సెన్సిబిలిటీ మధ్య సరైన సమతుల్యతను కనుగొనడానికి CBFC ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది." అని తెలిపారు.
బేషరమ్ రంగ్‌లో దీపికా, షారూఖ్ ధరించిన కాస్ట్యూమ్‌ల రంగుల గురించిన వివాదాన్ని ప్రస్తావిస్తూ జోషి మాట్లాడుతూ, “కాస్ట్యూమ్ కలర్స్ విషయానికొస్తే, కమిటీ నిష్పక్షపాతంగా ఉంది. సినిమా వచ్చినప్పుడు ఈ బ్యాలెన్స్‌డ్ అప్రోచ్ అందరికీ అర్థమవుతుంది." అన్నారు.
View this post on Instagram
View this post on Instagram