Deep Sidhu Death: పంజాబీ నటుడు దీప్ సిద్ధూ కారు ప్రమాదంలో మృతి
పంజాబీ నటుడు దీప్ సిద్ధూ కారు ప్రమాదంలో మరణించాడు. మంగళవారం రాత్రి హర్యానాలో సోనిపట్ సమీపంలో ఆగి ఉన్న లారీని దీప్ సిద్ధూ కారు ఢీకొట్టింది.
పంజాబీ నటుడు దీప్ సిద్ధూ(Deep Sidhu) మంగళవారం రాత్రి జరిగిన కారు ప్రమాదంలో మరణించారు. 'రమ్తా జోగి', 'దేశీ', 'సాదే ఆలే' వంటి చిత్రాలలో నటనకు దీప్ సిద్ధూ మంచి పేరు సంపాదించారు. అతని వయసు 37 సంవత్సరాలు. 2021లో రిపబ్లిక్ డే(Republic Day) రోజున ఎర్రకోట వద్ద జరిగిన ఆందోళనలో దీప్ సిద్ధూ పాల్గొన్నారు. ఇక్కడ జరిగిన ఘటనతో ఈ నటుడు వెలుగులోకి వచ్చాడు. హర్యానా(Haryana)లోని సోనిపట్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. నటుడు దీప్ సిద్ధూ మరణాన్ని సోనిపట్ పోలీసులు ధ్రువీకరించారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన పంజాబీ నటుడు దీప్ సిద్ధూ మృతిపై హర్యానా పోలీసులు ఏఎన్‌ఐతో మాట్లాడుతూ, దీప్ సిద్ధూ కుండ్లీ-మనేసర్-పల్వాల్ (కెఎంపి) ఎక్స్‌ప్రెస్‌వే వద్ద పిప్లీ టోల్ సమీపంలో ఆగి ఉన్న ట్రక్కును కారును ఢీకొట్టాడు. సిద్ధూ తన సినీ జీవితాన్ని 2015లో పంజాబీ చిత్రం 'రమ్తా జోగి'తో ప్రారంభించాడు. ఇందులో అతను ప్రధాన పాత్రలో నటించాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నటుడు ధర్మేంద్ర నిర్మాణ సంస్థ విజయతా ఫిల్మ్స్ నిర్మించింది. అతను తన కేరీర్ ను మోడల్(Model)గా ప్రారంభించాడు.
Punjabi actor Deep Sidhu dies in a road accident near Sonipat in Haryana, confirms Sonipat Police. Details awaited.
— ANI (@ANI) February 15, 2022
He was also earlier named as an accused in the 2021 Red Fort violence case. pic.twitter.com/CoLh8ObkJJ
హరియాణాలోని సోనిపట్ వద్ద జరిగిన కారు ప్రమాదంలో దీప్ సిద్ధూ కన్నుమూశారు. దీప్ సిద్ధూ మృతిని హర్యానా సోనిపట్ పోలీసులు ధ్రువీకరించారు. దిల్లీ నుంచి భటిండా వైపు కారులో వెళ్తుండగా సోనిపట్ వద్ద ఆగివున్న ట్రక్‌ను ఢీకొట్టింది. పంజాబ్‌లోని ముక్త్‌సర్ జిల్లాకు చెందిన దీప్ సిద్ధూ లా చదివారు. గతంలో మోడల్‌గా పనిచేసి ఆయన తర్వాత పలు పంజాబీ చిత్రాల్లో నటించాడు. గతంలో కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులతో కలిసి ఉద్యమంలో పాల్గొన్నారు. గతేడాది రైతులు చేపట్టిన రిపబ్లిక్ డే పరేడ్(Republic Day Parade) లో ఎర్రకోట(RedFort) వద్ద చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలో కీలక నిందితుడిగా ఉన్నారు. రైతుల ట్రాక్టర్ ర్యాలీ(Farmers Tractors Rally)తో సిద్ధూ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఆందోళనకారులను మళ్లించి ఎర్రకోట వైపు తీసుకెళ్లారనే ఆరోపణలు సిద్ధూపై ఉన్నాయి. రైతు ఉద్యమం దారి తప్పటానికి అతడే కారణమన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ కేసులో నిందితుడిగా సిద్ధూ ప్రస్తుతం బెయిల్ పై బయటకు వచ్చాయి.