By: ABP Desam | Updated at : 15 Feb 2023 01:52 PM (IST)
'ది ఫ్లాష్' ట్రైలర్ లో హనుమంతుడి ఫోటో కనిపించే దృశ్యం (Image Courtesy : DC official / Youtube)
హాలీవుడ్ నుంచి మరో సూపర్ హీరో సినిమా 'ది ఫ్లాష్' (The Flash Movie 2023) మన ముందుకు రానుంది. డీసీ & వార్నర్ బ్రదర్స్ నిర్మించిన ఈ సినిమా జూన్ 16న థియేటర్లలో విడుదల కానుంది. ఈ మధ్య ఫస్ట్ ట్రైలర్ విడుదల చేశారు. అసలు మ్యాటర్ ఆ సినిమా గురించి కాదు... అందులో ఉన్న ఓ ఫోటో గురించి! భారతీయుల్లో చాలా మంది, మరీ ముఖ్యంగా హిందువులు భక్తి శ్రద్ధలతో కొలిచే హనుమంతుడి గురించి!
'ది ఫ్లాష్'లో హనుమంతుడిని చూశారా?
'ది ఫ్లాష్' ట్రైలర్‌లో స్టోరీ & కాన్సెప్ట్ కొంత మందిని ఆకట్టుకుంది. యాక్షన్ సీన్స్ & విజువల్ ఫీస్ట్ మీద కొందరి దృష్టి ఉంది. భారతీయుల్లో కొందరు చూపు మాత్రం హనుమంతుడి చిత్రపటం మీద పడింది.
అవును... 'ది ఫ్లాష్' ట్రైలర్‌లో అంజనీ సుతుడు, వాయు పుత్రుడు హనుమంతుడి ఫోటో కనిపించింది. నిశితంగా పాజ్ చేసి చూస్తే గానీ గమనించడం కష్టం. 2.16 నిమిషాల దగ్గర హీరో వెనుక ఆ ఫోటో ఉంది. మరి... 'ది ఫ్లాష్' కథకు, వాయు పుత్రుడు హనుమంతునికి సంబంధం ఏమైనా ఉందా? లేదా? అనేది జూన్ 16న తెలుస్తుంది.
'బ్యాట్ మ్యాన్' రిటర్న్స్!
'ది ఫ్లాష్'లో ఎజ్రా మిల్లర్ టైటిల్ రోల్ పోషించారు. అయితే, ఇందులో బ్యాట్ మ్యాన్ కూడా ఉన్నారు. ఆ పాత్రలో హాలీవుడ్ స్టార్ బెన్ అఫ్లెక్ కనిపించనున్నారు. ఈసారి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే... బ్యాట్ మ్యాన్ సూట్ మారింది. సూపర్ గాళ్ గా సాషాను పరిచయం చేశారు. డీసీ అభిమానులకు ఈ ట్రైలర్ నచ్చింది. సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. భారతీయులలో ఈ సినిమా మీద ఎక్కువ క్యూరియాసిటీ క్రియేట్ కావడానికి హనుమంతుడు ఒక రీజన్ అని చెప్పుకోవచ్చు.
Also Read : ప్రేమికుల రోజున స్టార్ హీరోయిన్లు ఎక్కడ ఉన్నారు? ఎవరితో ఉన్నారంటే?
ఇంతకు ముందు 'బ్యాట్ మ్యాన్' సినిమాల్లో కొన్ని సన్నివేశాలకు, 'అవతార్'కు రామాయణం స్ఫూర్తి అని చెబుతుంటారు. హాలీవుడ్ సినిమాల్లో ఎక్కువగా గ్రీస్, రోమ్ సంస్కృతి కనబడుతూ ఉంటుంది. ఇప్పుడిప్పుడు భారతీయ దేవుళ్ళ మీద దృష్టి సారిస్తున్నట్టు ఉన్నారు.
Also Read : 'విమానం'లో మీరా జాస్మిన్ - పదేళ్ళ తర్వాత తెలుగులో రీ ఎంట్రీ
ఈ శుక్రవారం ఓ హాలీవుడ్ సూపర్ హీరో సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 'యాంట్ మ్యాన్', 'యాంట్ మ్యాన్ అండ్ ది వాస్ప్' తర్వాత ఆ సిరీస్‌లో వస్తున్న తాజా సినిమా 'యాంట్ మ్యాన్ అండ్ ది వాస్ప్ : క్వాన్టుమేనియా' (Ant-Man and the Wasp : Quantumania). ఫిబ్రవరి 17న ఇంగ్లీష్, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఇండియాలోని థియేటర్లలో సినిమా విడుదల కానుంది.
'యాంట్ మ్యాన్ అండ్ ది వాస్ప్ : క్వాన్టుమేనియా' సినిమా విషయానికి వస్తే... ఇందులో 'యాంట్ మ్యాన్' టైటిల్ పాత్రలో పాల్ రూడ్ నటించారు. స్కాట్ లాంగ్‌గానూ ఆయన కనిపించనున్నారు. హోప్ వాన్ డీన్, వాస్ప్ పాత్రలో ఎవాంజలీన్ లీ నటించారు. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న ఈ సినిమాపై ఇండియాలో కూడా చాలా అంచనాలు ఉన్నాయి. ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.
Ram Pothineni: దసరా రేసులో రామ్, బోయపాటి - పాన్ ఇండియా మాస్ మోతకు రెడీ!
BRS - Keerthi Suresh: నేనేమీ గుజరాత్ నుంచి రాలేదు కదా - కీర్తి సురేష్ కామెంట్స్‌ను వాడేసుకుంటున్న బీఆర్ఎస్
Bommarillu Bhaskar: అప్పుడు విమర్శలు, ఇప్పుడు విజిల్స్ - థియేటర్లో ‘ఆరెంజ్’ మూవీ చూసి బొమ్మరిల్లు భాస్కర్ భావోద్వేగం
G20 Summit 2023: సిగ్గు, శరంలేని జాతి - విశాఖ జీ20 సదస్సులో తమిళ బ్యానర్లపై నటి సంచలన వ్యాఖ్యలు
Ram Charan: అభిషేక్ బచ్చన్ చేయని సాహసాన్ని చరణ్ చేసి చూపించాడు, కానీ...
Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ఎత్తు, సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన
Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!
Vishwak Sen: ‘దాస్ కా ధమ్కీ’ కలెక్షన్స్ - విశ్వక్ సేన్ కెరీర్‌లో సరికొత్త రికార్డ్!
KKR New Captain: కేకేఆర్‌కు కెప్టెన్సీ కష్టాలు! గంభీర్ తర్వాత మూడో కెప్టెన్!