News
News
X

ఏ దేశానికి చెందని గూఢచారి - ప్రియాంక యాక్షన్ సిరీస్ ‘సిటడెల్’ ట్రైలర్ చూశారా?

ప్రియాంక చోప్రా ‘సిటడెల్’ ట్రైలర్ విడుదల అయింది.

FOLLOW US: 
Share:

Citadel New Series Trailer Released Starring Richard Madden Priyanka Chopra: ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ ఫేం రిచర్డ్ మాడెన్, ప్రియాంక చోప్రా జంటగా నటిస్తున్న యాక్షన్ సిరీస్ ‘సిటడెల్’. ఏప్రిల్ 28వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ సిరీస్ స్ట్రీమ్ కానుంది. ‘అవెంజర్స్: ఇన్‌ఫినిటీ వార్’, ‘అవెంజర్స్: ఎండ్ గేమ్’ సినిమాల దర్శకులు రుసో బ్రదర్స్ ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. ‘సిటడెల్’ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

గతం మర్చిపోయిన ఇద్దరు ఏజెంట్లు ఒకరినొకరు కలవడంతో ఈ ట్రైలర్ ప్రారంభం అవుతుంది. సడెన్‌గా వారిద్దరి మీద కొందరు అటాక్ చేయడం, వారు ఒకరికి ఒకరు గుర్తుకు రావడం ఇలా ఆసక్తికరంగా ఈ ట్రైలర్ సాగుతుంది. వీరిద్దరూ ఏ దేశానికి చెందని ‘సిటడెల్’ అనే ప్రైవేటు గూఢచారి సంస్థకు పని చేసే వారని తర్వాత రివీల్ అవుతుంది.

ఈ ట్రైలర్‌‌లో సిరీస్ కథను ఏ మాత్రం రివీల్ చేయలేదు. మంచులో, ట్రైన్‌లో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌లతో ట్రైలర్‌ను నింపేశారు. మిషన్ ఇంపాజిబుల్, జేమ్స్ బాండ్ తరహా స్పై చిత్రాలను తలపించేలా ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి. ఏప్రిల్ 28వ తేదీన ‘సిటడెల్’ మొదటి రెండు ఎపిసోడ్లు స్ట్రీమ్ కానున్నాయి. తర్వాత వారానికో ఎపిసోడ్ చొప్పున మే 26వ తేదీ వరకు స్ట్రీమ్ చేయనున్నారు.

ఈ సిరీస్‌రకు వివిధ దేశాల్లో స్పిన్ ఆఫ్‌లను కూడా రూపొందిస్తున్నారు. ఇండియన్ వెర్షన్ ‘సిటడెల్’కు రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో వరుణ్ ధావన్, సమంత నటించనున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ కూడా ఇటీవలే ప్రారంభం అయింది. 2024లో ‘సిటడెల్’ ఇండియన్ వెర్షన్ విడుదల అయ్యే అవకాశం ఉంది. ఇటలీ, స్పెయిన్, మెక్సికోల్లో కూడా ‘సిటడెల్’ వెర్షన్లపై వర్క్ జరుగుతోంది.

రాజ్ అండ్ డీకే ఇటీవలే అమెజాన్ ప్రైమ్‌కు ‘ఫర్జీ’ రూపంలో బ్లాక్‌బస్టర్ వెబ్ సిరీస్‌ను అందించారు. క్రిటిక్స్, ఆడియన్స్ దగ్గర నుంచి ఫర్జీకి బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్ లభించింది. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ యూనివర్స్‌తో కూడా దీన్ని క్రాస్ ఓవర్ చేశారు.

Published at : 06 Mar 2023 11:59 PM (IST) Tags: Richard Madden Priyanka Chopra Jonas Citadel Trailer

సంబంధిత కథనాలు

Janaki Kalaganaledu March 23rd: జానకి, రామ హనీమూన్- మనవడిని చూసి మురిసిపోతున్న జ్ఞానంబ

Janaki Kalaganaledu March 23rd: జానకి, రామ హనీమూన్- మనవడిని చూసి మురిసిపోతున్న జ్ఞానంబ

Aditi Rao Hydari-Siddharth: సిద్దార్థ్‌తో రిలేషన్‌పై అదితి రావు ఘాటు స్పందన - అదేంటీ, అలా అనేసింది?

Aditi Rao Hydari-Siddharth: సిద్దార్థ్‌తో రిలేషన్‌పై అదితి రావు ఘాటు స్పందన - అదేంటీ, అలా అనేసింది?

Rashmika Mandanna: ఇంట్లో పని మనుషుల పాదాలకు నమస్కరిస్తా - రష్మిక

Rashmika Mandanna: ఇంట్లో పని మనుషుల పాదాలకు నమస్కరిస్తా - రష్మిక

NTR 30 Muhurtham : మృగాలను భయపెట్టే మగాడిగా ఎన్టీఆర్ - స్టోరీలైన్ చెప్పేసిన కొరటాల

NTR 30 Muhurtham : మృగాలను భయపెట్టే మగాడిగా ఎన్టీఆర్ - స్టోరీలైన్ చెప్పేసిన కొరటాల

Gruhalakshmi March 23rd: తులసి తన భార్య కాదని వాసుదేవ్‌కి చెప్పేసిన నందు- హీరోలాగా ఫైట్ చేసి దివ్యని కాపాడిన విక్రమ్

Gruhalakshmi March 23rd: తులసి తన భార్య కాదని వాసుదేవ్‌కి చెప్పేసిన నందు- హీరోలాగా ఫైట్ చేసి దివ్యని కాపాడిన విక్రమ్

టాప్ స్టోరీస్

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన గంటా, టీడీపీ గెలుస్తుందంటూ ధీమా

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన గంటా, టీడీపీ గెలుస్తుందంటూ ధీమా

KCR Tour: నేడు 4 జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన - పూర్తి షెడ్యూల్ ఇదీ

KCR Tour: నేడు 4 జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన - పూర్తి షెడ్యూల్ ఇదీ

New Contraceptive Tool: గర్భనిరోధకానికి కొత్త సాధనం - తెలుగు రాష్ట్రాల్లో అమలుకు ప్రయత్నాలు

New Contraceptive Tool: గర్భనిరోధకానికి కొత్త సాధనం - తెలుగు రాష్ట్రాల్లో అమలుకు ప్రయత్నాలు

‘సూర్య’కుమార్ కాదు, ‘శూణ్య’కుమార్- 3 డకౌట్లతో మిస్టర్ 360ని ఆటాడుకుంటున్న నెటిజన్లు

‘సూర్య’కుమార్ కాదు, ‘శూణ్య’కుమార్- 3 డకౌట్లతో మిస్టర్ 360ని ఆటాడుకుంటున్న  నెటిజన్లు