News
News
X

Swathimuthyam Release Date : దసరా సీజన్ టార్గెట్ చేసిన బెల్లంకొండ 

నిర్మాత బెల్లంకొండ సురేష్ రెండో కుమారుడు గణేష్ హీరోగా పరిచయమవుతున్న 'స్వాతి ముత్యం' సినిమా కొత్త విడుదల తేదీ ఖరారు అయ్యింది.

FOLLOW US: 

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ రెండో కుమారుడు, హీరో సాయి శ్రీనివాస్ తమ్ముడు గణేష్ (Bellamkonda Ganesh Babu) ను హీరోగా పరిచయం చేస్తూ... సుప్రసిద్ధ నిర్మాత సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అనుబంధ సంస్థ సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌లో రూపొందిన సినిమా 'స్వాతి ముత్యం' (Swati Mutyam Movie).
 
దసరా సీజన్ టార్గెట్ చేసిన బెల్లంకొండ
Swathimuthyam New Release Date : విజయ దశమి సందర్భంగా అక్టోబర్ 5న 'స్వాతి ముత్యం' చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ఈ రోజు సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ అనౌన్స్ చేసింది. నిజం చెప్పాలంటే... ఈ శనివారం (ఆగస్టు 13న) విడుదల చేయాలని అనుకున్నారు. అయితే... ఈ వారం మూడు సినిమాలు ఉండటంతో స్వచ్ఛందంగా వెనక్కి తగ్గింది.
  
''విడుదల తేదీని ముందుగా ప్రకటించి... రెడీగా ఉన్నప్పటికీ పరిశ్రమ గురించి ఆలోచించి మేం వెనక్కి తగ్గుతున్నాం. కరోనా తర్వాత సినిమా ఇండస్ట్రీ పరిస్థితి అంత గొప్పగా లేదు. మునుపటిలా ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు. ఇతర సినిమాల నిర్మాతల పరిస్థితి చూసి మా చిత్రాన్ని వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాం'' అని సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పేర్కొంది. ఇప్పుడు దసరా సీజన్ టార్గెట్ చేస్తూ బెల్లంకొండ గణేష్ థియేటర్లలోకి వస్తున్నారు. 

Also Read : 'ఖైదీ' సీక్వెల్ కన్ఫర్మ్ చేసిన కార్తీ - విజయ్ సినిమాతో ముడి పడిన మేటర్ మరి

లక్ష్మణ్ కె కృష్ణ దర్శకుడిగా పరిచయం చేస్తూ... పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi) నిర్మిస్తోన్న చిత్రమిది. బాలమురళి పాత్రలో బెల్లంకొండ గణేష్, ఆయన సరసన కథానాయికగా భాగ్యలక్ష్మి పాత్రలో వర్ష బొల్లమ్మ (Varsha Bollamma) నటించారు. సీనియర్ నటుడు నరేష్ వీకే, రావు రమేష్, సుబ్బరాజు, 'వెన్నెల' కిషోర్ (Vennela Kishore), సునయన, దివ్య శ్రీపాద (Divya Sripada) తదితరులు నటించిన ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు.

హీరోగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పరిచయమైన 'అల్లుడు శీను' సినిమాను ఆయన తండ్రి బెల్లంకొండ సురేష్ నిర్మించారు. రెండో కుమారుడు గణేష్ బాబును ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) చేతుల్లో పెట్టారు. సాయి శ్రీనివాస్ కమర్షియల్ సినిమాతో ఇంట్రడ్యూస్ అయితే... గణేష్ క్యూట్ లవ్ అండ్ ఫ్యామిలీ సబ్జెక్ట్ ఎంపిక చేసుకున్నారు. అన్నాదమ్ముల మధ్య కథల ఎంపిక, సినిమాలు చేసే విధానంలో వ్యత్యాసం కనబడుతోంది. బహుశా... ఇద్దరి టెస్టులు వేరు వేరు ఏమో!?

దసరా సీజన్ కోసం రెండు మూడు పెద్ద సినిమాలు వెయిట్ చేస్తున్నాయి. అయితే... భారీ సినిమాల మధ్య ఒక చిన్న సినిమాకు ఎప్పుడూ స్పేస్ ఉంటుంది. దాన్ని ఉపయోగించుకోవాలని 'స్వాతి ముత్యం' సినిమా యూనిట్ భావిస్తోన్నట్లు తెలుస్తోంది. పెద్ద నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న చిన్న సినిమా కావడంతో దీనిపై అటు ప్రేక్షకులు, ఇటు పరిశ్రమ ప్రముఖుల్లో మంచి బజ్ నెలకొంది. ఆల్రెడీ విడుదల అయిన ప్రచార చిత్రాలు ఆసక్తికరంగా ఉన్నాయి. 

Also Read : అన్నీ డిలీట్ చేసిన రానా - ఒక్కటంటే ఒక్క ఫోటో కూడా లేదు

Published at : 10 Aug 2022 10:23 AM (IST) Tags: Varsha Bollamma Bellamkonda Ganesh Swathimuthyam 2022 Movie Swathimuthyam New Release Date

సంబంధిత కథనాలు

RRR For Oscars : ఆస్కార్స్‌కు 'ఆర్ఆర్ఆర్' - తొలి అడుగు పడింది!

RRR For Oscars : ఆస్కార్స్‌కు 'ఆర్ఆర్ఆర్' - తొలి అడుగు పడింది!

Yash Movie In Telugu : తెలుగు ప్రేక్షకుల ముందుకు 'రారాజు'గా యష్ - విషయం ఏంటంటే?

Yash Movie In Telugu : తెలుగు ప్రేక్షకుల ముందుకు 'రారాజు'గా యష్ - విషయం ఏంటంటే?

Chiranjeevi Allu Aravind : చిరంజీవి ఫ్యామిలీతో కాంట్రవర్సీ - ఆలీకి అల్లు అరవింద్ క్లాస్?

Chiranjeevi Allu Aravind : చిరంజీవి ఫ్యామిలీతో కాంట్రవర్సీ - ఆలీకి అల్లు అరవింద్ క్లాస్?

రావణ దహనం చేసిన ఆదిపురుష్ - ఢిల్లీలో ప్రభాస్‌కు మాస్ క్రేజ్!

రావణ దహనం చేసిన ఆదిపురుష్ - ఢిల్లీలో ప్రభాస్‌కు మాస్ క్రేజ్!

Sridevi Sarees Auction: అతిలోక సుందరి చీరలు వేలం, ఆ డబ్బుతో ఏం చేస్తారంటే?

Sridevi Sarees Auction: అతిలోక సుందరి చీరలు వేలం, ఆ డబ్బుతో ఏం చేస్తారంటే?

టాప్ స్టోరీస్

ఉన్న ప్రతిపక్షాలకే ఆదరణ లేదు- వచ్చే బీఆర్‌ఎస్‌ ఏం చేస్తుంది: ఏపీ మంత్రులు

ఉన్న ప్రతిపక్షాలకే ఆదరణ లేదు- వచ్చే బీఆర్‌ఎస్‌ ఏం చేస్తుంది: ఏపీ మంత్రులు

Weather Latest Update: నేడు ఈ జిల్లాలకు వర్షం ఎలర్ట్! ఈ రెండ్రోజులు దంచికొట్టనున్న వానలు

Weather Latest Update: నేడు ఈ జిల్లాలకు వర్షం ఎలర్ట్! ఈ రెండ్రోజులు దంచికొట్టనున్న వానలు

Bigg Boss 6 Telugu Episode 32: సూర్య అంటే ఇష్టం, తన క్రష్ అని చెప్పేసిన ఇనయా, మరి సూర్యకు?

Bigg Boss 6 Telugu Episode 32: సూర్య అంటే ఇష్టం, తన క్రష్ అని చెప్పేసిన ఇనయా, మరి సూర్యకు?

66 మంది చిన్నారులు మృతి - భారత్‌ దగ్గుమందు తయారీ సంస్థకు డబ్ల్యూహెచ్‌వో వార్నింగ్

66 మంది చిన్నారులు మృతి - భారత్‌ దగ్గుమందు తయారీ సంస్థకు డబ్ల్యూహెచ్‌వో వార్నింగ్