News
News
వీడియోలు ఆటలు
X

New Music Directors in Tollywood: సరికొత్త ట్యూన్స్‌తో అదరగొడుతున్న చిన్న సంగీత దర్శకులు - ఒక్క ఛాన్స్ ఇవ్వండి గురూ!

ఇటీవల కాలంలో అనేక మంది యువ సంగీత దర్శకులు తమ మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తున్నారు. పాటలతోనే కాకుండా బ్యాగ్రౌండ్ స్కోర్ తోనూ అదరగొడుతున్నారు.

FOLLOW US: 
Share:
క సినిమా సక్సెస్ కు సాంగ్స్ ఎంతో దోహదం చేస్తాయనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ చిత్రానికైనా రిలీజ్ కు ముందు పాటల ద్వారానే బజ్ ఏర్పడుతుంది. పాటలే ఆ సినిమాను మొదట జనాల్లోకి తీసుకెళ్తుంది. కేవలం సాంగ్స్ వల్లనే హిట్ అయిన సినిమాలను మనం ఎన్నో చూశాం. అంతెందుకు వందేళ్ల ఇండియన్ సినిమాకు కలగా మిగిలిపోయిని ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు సాధించింది కూడా ఒక సినిమా పాటే.
 
పాటలకు అంత ప్రాధాన్యత ఉంటుంది కాబట్టే, ఇటీవల కాలంలో ఆడియో రైట్స్ కు కూడా భారీ డిమాండ్ పెరిగింది. మ్యూజిక్ కంపెనీలు పోటీ పడి మరీ కోట్ల రూపాయలతో ఆడియో హక్కులు కొనుగోలు చేస్తున్నారు. లిరికల్ సాంగ్స్.. వీడియో సాంగ్స్ అంటూ శ్రోతలను అలరిస్తూ వస్తున్నారు. ఇవి మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకొని రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. 
 
ప్రస్తుతం ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరక్టర్స్ అనగానే ఇళయరాజా, ఎంఎం కీరవాణి, మణిశర్మ, ఏఆర్ రెహమాన్, కోటి, ఎస్ థమన్, దేవిశ్రీ ప్రసాద్, అనిరుధ్ రవిచంద్రన్, యువన్ శంకర్ రాజా, హరీశ్ జైరాజ్, అనూప్ రూబెన్స్, జీవీ ప్రకాశ్, మిక్కీ జె మేయర్, సంతోష్ నారాయణన్, గోపీ సుందర్, జస్టిన్ ప్రభాకర్ వంటి వారు గుర్తుకు వస్తారు. మన సినిమాల పోస్టర్స్ మీద వీళ్ళ పేర్లే ఎక్కువగా కనిపిస్తుంటాయి కాబట్టి, జనాలకు వారే గుర్తుంటారు. 
 
కానీ ఇటీవల కాలంలో కొందరు కొత్త తరం యువ సంగీత దర్శకులు కూడా మంచి మ్యూజిక్ అందిస్తూ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. పాటకు ప్రాణం పోయడమే కాదు.. అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేస్తూ అదరగొడుతున్నారు.. సినిమాలకు ఫ్రెష్ నెస్ ను జోడిస్తున్నారు. ఇంకా థమన్, డీఎస్పీల హవా నడుస్తున్నా, తనదైన సంగీతంతో సత్తా చాటుతున్నారు. 
 
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన 'దాస్ కా ధమ్కీ' సినిమాలోని పాటలు మ్యూజిక్ లవర్స్ ని ఆకట్టుకుంటున్నాయి. వీటికి సంగీతం సమకూర్చింది సంగీత దర్శకుడు లియోన్ జేమ్స్. ఇంతకముందు ‘నెక్స్ట్ ఏంటి?’, ‘పాగల్’, ‘ఓరి దేవుడా’ వంటి తెలుగు చిత్రాలకి లియోన్ మ్యాజిక్ కంపోజ్ చేశాడు. 
 
రీసెంట్ గా మాస్ మహారాజ్ రవితేజ నటించిన ‘రావణాసుర’ సినిమా నుంచి సాంగ్ రిలీజ్ అయ్యింది. మాస్ రాజా ఇమేజ్ కు భిన్నంగా ఇండోవెస్ట్రన్ ఫాస్ట్ బీట్ తో వచ్చిన ఈ పాట అందరినీ సర్ప్రైజ్ చేసింది. దీనికి ట్యూన్ కంపోజ్ చేసింది సంగీత దర్శకుడు హర్షవర్దన్ రామేశ్వర్. ఇంతకముందు ‘అర్జున్ రెడ్డి’ చిత్రానికి బ్యాగ్రౌండ్ స్కోర్ అందించిన హర్ష.. విజేత, జార్జ్ రెడ్డి, కనులు కనులను దొచాయంటే, అల్లూరి.. వంటి సినిమాలకు సంగీతం సమకూర్చారు. ప్రస్తుతం అతను హిందీలో యానిమల్ మూవీకి వర్క్ చేస్తున్నాడు.
 
టాలీవుడ్ లో ఈ మధ్య బాగా వినిపిస్తున్న పేరు రామ్ మిర్యాల. సోలో సాంగ్స్, ప్రైవేట్ ఆల్బమ్స్ తో ఆకట్టుకున్న చౌరస్తా రామ్.. సింగర్ గా ఫుల్ బిజీగా ఉన్నాడు. మధ్య మధ్యలో ఒకటీ రెండు తన మార్క్ ట్యూన్స్ ని అందిస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. సిలకా, పుట్టెనే ప్రేమ, డీజే టిల్లు టైటిల్ సాంగ్, మావా బ్రో.. వంటి సాంగ్స్ మిరియాలకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ‘టిల్లు స్క్వేర్’ సినిమాకి రామ్ మిర్యాల మ్యాజిక్ అందిస్తున్నారు. 
 
భారీ అంచనాల నడుమ విడుదలై బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిన చిత్రాల్లో 'మైఖేల్' ఒకటి. ఈ పాన్ ఇండియా మూవీ ఫ్లాప్ అయినప్పటికీ, మ్యాజిక్ మాత్రం అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా రీ రికార్డింగ్ కు విశ్లేషకుల ప్రశంసలు దక్కాయి. దీనికి సంగీతం సమకూర్చింది శ్యామ్ సీఎస్. రామారావు ఆన్ డ్యూటీ, మోసగాళ్ళు, అర్జున్ సురవరం, అభినేత్రి, నోటా వంటి తెలుగు సినిమాలు ఆయన ఫిల్మోగ్రఫీలో వున్నాయి.
 
మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ కూడా ఇటీవల కాలంలో క్రేజీ కంపోజర్ గా మారిపోయాడు. ఛలో, భీష్మ, మాస్ట్రో సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న మహతి.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘భోళా శంకర్’ చిత్రంతో టాప్ లీగ్ లో చేరడానికి కృషి చేస్తున్నాడు. వీరే కాకుండా సన్నీ ఎంఆర్, రధన్, వివేక్ సాగర్, చేతన్ భరద్వాజ్ వంటి పలువురు సంగీత దర్శకులు స్టార్ మ్యాజిక్ కంపోజర్స్ కు పోటీగా సంగీతం అందిస్తున్నారు. చిన్న మీడియం రేంజ్ సినిమాలకు మంచి పాటలు సమకురుస్తూ.. సినిమా రేంజ్ ను పెంచుతున్నారు. పెద్ద దర్శక నిర్మాతలు వీరికి కూడా ఒక్క ఛాన్స్ ఇస్తే.. టాలెంట్ చూపించేందుకు సిద్ధంగా ఉన్నారు.
Published at : 24 Mar 2023 07:34 PM (IST) Tags: music Tollywood Music Director Tollywood Music Telugu Music Directors Small Music Directors

సంబంధిత కథనాలు

Dimple Hayathi : డీసీపీ పార్కింగ్ ఇష్యూ తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన డింపుల్

Dimple Hayathi : డీసీపీ పార్కింగ్ ఇష్యూ తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన డింపుల్

Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?

Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?

Chiranjeevi Cancer : నేనూ క్యాన్సర్ బారిన పడ్డాను - మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు 

Chiranjeevi Cancer : నేనూ క్యాన్సర్ బారిన పడ్డాను - మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు 

ఒడిశా రైలు ప్రమాదంపై టాలీవుడ్ సినీ ప్రముఖుల దిగ్భ్రాంతి - రక్తదానం చేయాలని అభిమానులకు చిరు పిలుపు 

ఒడిశా రైలు ప్రమాదంపై టాలీవుడ్ సినీ ప్రముఖుల దిగ్భ్రాంతి - రక్తదానం చేయాలని అభిమానులకు చిరు పిలుపు 

Unstoppable Trailer : ఆవారాలా? పోలీసులా? 25 లక్షల కోసం వాడ్ని పట్టించారా? 'అన్‌స్టాపబుల్' ట్రైలర్ ఎలా ఉందంటే?

Unstoppable Trailer : ఆవారాలా? పోలీసులా? 25 లక్షల కోసం వాడ్ని పట్టించారా? 'అన్‌స్టాపబుల్' ట్రైలర్ ఎలా ఉందంటే?

టాప్ స్టోరీస్

Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!

Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!

ChatGPT: షాకిస్తున్న ఛాట్ జీపీటీ - గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరి తరహాలో!

ChatGPT: షాకిస్తున్న ఛాట్ జీపీటీ - గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరి తరహాలో!

PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ

PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ

Whatsapp: వాట్సాప్ ఛాటింగ్ ఇంతకు ముందులా ఉండదు - ఎందులో మార్పులు జరుగుతున్నాయో తెలుసా?

Whatsapp: వాట్సాప్ ఛాటింగ్ ఇంతకు ముందులా ఉండదు - ఎందులో మార్పులు జరుగుతున్నాయో తెలుసా?