Yash Toxic Look: 'టాక్సిక్' నుంచి క్రేజీ అప్డేట్... KGF స్టార్ యష్ బర్త్ డే గిఫ్ట్ రెడీ
Yash Birthday: 'టాక్సిక్' మూవీ నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. యష్ బర్త్ డే కానుకగా టీజర్ ను రిలీజ్ చేయబోతున్నట్టు తాజాగా పోస్టర్ ద్వారా వెల్లడించారు.
Date and time locked for Toxic first look release: కన్నడ స్టార్ యష్ (Yash) అభిమానులకు గుడ్ న్యూస్. 'కేజీఎఫ్' తర్వాత ఆయన నెక్స్ట్ మూవీ గురించి ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ పండగ చేసుకునే టైం వచ్చేసింది. యష్ నెక్స్ట్ మూవీ 'టాక్సిక్' (Toxic Movie) నుంచి టీజర్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
యష్ బర్త్ డే సర్ప్రైజ్ గా 'టాక్సిక్' టీజర్
'కేజీఎఫ్' సినిమాతో ఒక్కసారిగా అందరూ కన్నడ చిత్ర సినిమా వైపు చూసేలా చేసిన స్టార్ యష్. ఈ మూవీ రెండు భాగాలుగా రిలీజ్ అయ్యి, యష్ (Yash Birthday)ను పాన్ ఇండియా స్టార్ గా నిలబెట్టింది. దీంతో యష్ నుంచి నెక్స్ట్ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా? అని అన్నీ భాషల ప్రేక్షకులు చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నారు. అయితే 'టాక్సిక్' అనే మూవీని ప్రకటించి చాలా కాలమే అవుతున్నప్పటికీ, ఇప్పటిదాకా దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదు. మధ్య మధ్యలో కొన్ని వివాదాలు, రూమర్లు మాత్రం వినిపించాయి. ముఖ్యంగా ఈ సినిమా కాస్టింగ్ విషయంలో పలు రూమర్లు వైరల్ అయ్యాయి. తాజాగా యష్ నటిస్తున్న ఈ 'టాక్సిక్' మూవీ నుంచి స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఆ పోస్టర్లో యష్ పుట్టినరోజు సందర్భంగా సర్ప్రైజ్ ఉండబోతుందని వెల్లడించారు. జనవరి 8న ఉదయం 10 : 25 గంటలకు ఆ సర్ప్రైజ్ ను రివీల్ చేయబోతున్నామంటూ పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఇక పోస్టర్లో యష్ సిగరెట్ తాగుతూ, కారుకి ఆనుకుని, అటువైపుగా తిరిగి నిలబడి కనిపిస్తున్నాడు. మొత్తానికి చాలా రోజుల తర్వాత ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ రావడంతో అభిమానులు తెగ ఖుషి అవుతున్నారు.
Surprises don't knock .. they are unleashed.#TOXIC #TOXICTheMovie https://t.co/mLdUmmZl9z
— KVN Productions (@KvnProductions) January 6, 2025
చెట్లను నరికిన వివాదంలో...
'టాక్సిక్' మూవీకి సంబంధించి ఓ వివాదం నెలకొంది. ఈ సినిమా షూటింగ్ కోసం ఫారెస్ట్ భూమిలో భారీ సెట్లు వేశారు వేయడం వివాదానికి దారి తీసింది. బెంగళూరులోని హెచ్ఎంటి లాండ్స్ లో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలు కాగా, అక్కడ భారీ సెట్లు వేయడం కోసం చెట్లని నరికేసారని ఆరోపణలు రాగా, ప్రభుత్వ అధికారులు రంగంలోకి దిగారు. ఏకంగా గతంలోని శాటిలైట్ చిత్రాలను, అప్పుడున్న పరిస్థితిని సమీక్షించి... చెట్లు నరికేసారని నిర్ధారించుకున్నారు. ఆ టైంలో అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే 'టాక్సిక్' మూవీ షూటింగ్ జరిగే ప్రదేశాన్ని పరిశీలించి, ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ రెండు రోజులు షూటింగ్ జరగగానే, ఈ వివాదం మొదలైంది. ఇక దీనిపై కెనరా బ్యాంక్ జనరల్ మేనేజర్, హిందుస్థాన్ మెషిన్ టూల్స్ జనరల్ మేనేజర్ పై కూడా ఎఫ్ఐఆర్ నమోదయింది.
అప్డేట్స్ కంటే రూమర్లే ఎక్కువ
'టాక్సిక్' సినిమా నుంచి కరీనా కపూర్ తప్పుకుందనే రూమర్లు వినిపించాయి. ముందుగా ఈ సినిమాలో యష్ సిస్టర్ గా నటించడానికి ఆమె ఓకే చెప్పిందని, తెలియని కారణాల వల్ల ఆమె ఈ మూవీకి గుడ్ బై చెప్పిందని టాక్ నడిచింది. ఆ తర్వాత ఆమె ప్లేస్ లో నయనతారను తీసుకున్నారని అన్నారు. ఇక ఈ సినిమాను గ్లోబల్ వైడ్ గా రిలీజ్ చేసే ఆలోచనతో యష్ ట్వంటీయత్ సెంచరీ ఫాక్స్ స్టూడియోతో చర్చలు జరుపుతున్నట్టు రీసెంట్ గా ప్రచారం జరిగింది. మూవీ క్యాస్టింగ్ తో పాటు మిగిలిన వివరాలు తెలియాలంటే జనవరి 8న రాబోయే 'టాక్సిక్' గ్లిమ్స్ రిలీజ్ అయ్యేదాకా ఆగాల్సిందే. కాగా ఈ సినిమాకు గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తుండగా, కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.