అన్వేషించండి

Prasad Behara: మీవి కన్నీళ్లు... నావి *చ్ఛ కాదు - పాపం ప్రసాద్ బెహరా, ఎమోషనల్ స్పీచ్ వెనుక కారణం ఏమిటంటే?

Papam Prathap Pre Release Controversy: 'పాపం ప్రతాప్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో 'మీరు ఏడిస్తే కన్నీళ్లు.. నేను ఏడిస్తే చ్చ కారదు' అంటూ ప్రసాద్ బెహరా ఆవేదన వ్యక్తం చేశారు. వైరల్ స్పీచ్ వెనుక కారణం ఏమిటంటే?

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • యూట్యూబర్ ప్రసాద్ బెహరా 'పాపం ప్రతాప్' ఈవెంట్ లో ఎమోషనల్ అయ్యారు.
  • మీడియా తనపై, తన స్నేహితులపై తప్పుడు కథనాలు ప్రసారం చేస్తుందని ఆవేదన.
  • నిజానిజాలు తెలుసుకోకుండా ప్రచారం వల్ల చాలా బాధపడ్డానని ప్రసాద్ పేర్కొన్నారు.

యూట్యూబ్ వెబ్ సిరీస్‌లు చూసే వీక్షకులకు ప్రసాద్ బెహరా (Prasad Behara) తెలిసే ఉంటారు. వన్ లైన్ పంచ్ డైలాగులు వేయడంలో స్పెషలిస్ట్. ప్రసాద్ బెహరా కామెడీకి ఫ్యాన్స్ ఉన్నారు. 'కమిటీ కుర్రోళ్ళు'తో వెండితెరపై కూడా ప్రసాద్ బెహరా విజయం అందుకున్నారు. యూట్యూబ్ సిరీస్ అయినా, సినిమా అయినా, ఆఖరికి సినిమా వేడుక అయినా సరే నవ్వించే ఆయన... 'పాపం ప్రతాప్' ప్రీ రిలీజ్ ఈవెంట్ (Papam Prathap Pre Release Event)లో ఎమోషనల్ అయ్యారు. ఇప్పుడు ప్రసాద్ బెహరా స్పీచ్ వైరల్ అవుతోంది. అసలు ఏమైంది? ఆయన ఎందుకు అంత ఎమోషనల్ అయ్యారు? అనే వివరాల్లోకి వెళితే... 

మీరు ఏడిస్తే కన్నీళ్ళు... నేను ఏడిస్తే *చ్ఛ కారదు!
ప్రసాద్ బెహరా ఎమోషనల్ స్పీచ్ వెనుక ఉన్న కారణంలోకి వెళ్లే ముందు, 'పాపం ప్రతాప్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన ఏమన్నారు? అనే అంశంలోకి వెళితే... తన గురించి రాస్తే నాలుగు డబ్బులు వస్తాయని అనుకుంటే ఏమైనా చేసుకోమని, తన గురించి ఏమైనా రాసుకోమని ఘాటుగా స్పందించారు. ''మీరు ఏడిస్తే కన్నీళ్లు... నేను ఏడిస్తే *చ్చ కారదు'' అంటూ పరుషంగా మాట్లాడారు ప్రసాద్ బెహరా. తన గురించి రాస్తే కనీసం తల్లి కూడా ఏడవదు అని, అసలు తన తల్లికి వీడియో ఓపెన్ చేయడం కూడా రాదని ఎమోషనల్ అయిపోయారు. అయితే... కొన్ని మీడియా సంస్థల రాతలు తన స్నేహితులపై ప్రభావం చూపించడం బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. దీని వెనుక కారణం ఏమిటి? అంటే...

పాత కేసును తిరగతోడి... అమ్మాయి పేరు మార్చి!
యూట్యూబ్‌లో ప్రసాద్ బెహరా సిరీస్‌లు ఇన్‌స్టంట్ హిట్స్ అయ్యాయి. ఆయన నుంచి వచ్చిన ప్రతి సిరీస్ హిట్టే. విజయాలతో పాటు ఓ వివాదం కూడా ఆయన్ను చుట్టుముట్టింది. ప్రసాద్ బెహరాతో పాటు పని చేసిన ఆర్టిస్ట్, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్సన్ కంచన్ బమ్మే ఆయనపై కేసు పెట్టింది.

Also ReadPurple Halcyon: ఇన్‌స్టాలో సబ్‌స్క్రిప్షన్‌తో నెలకు కోటి సంపాదించిన కేరళ కుట్టి... ఇప్పుడు ఏమైందో తెలుసా?
 
ప్రసాద్ బెహరా తనను వేధించాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు కంచన్. ఆ విషయంలో ఆయన అరెస్ట్ అయ్యారు కూడా. కేసు నుంచి బయటపడి మళ్ళీ వెబ్ సిరీస్‌లు, సినిమాలు చేస్తున్నారు ప్రసాద్ బెహరా. అయితే ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ మళ్ళీ ఆ కేసును తిరగతోడింది. 'మగాడు కాదు... మృగాడు' పేరుతో ఓ వీడియో కథనాన్ని ప్రసారం చేసింది. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే... ప్రసాద్ బెహరా మీద కేసు పెట్టినది ఒక అమ్మాయి అయితే, ఆ కథనంలో చూపించిన ఫోటో మరొక అమ్మాయిది. ప్రస్తుతం ప్రసాద్ బెహరాతో కలిసి ఆయన రూపొందిస్తున్న యూట్యూబ్ సిరీస్‌లలో ఆమె కూడా నటిస్తున్నారు.

Also ReadMrunal Thakur: మళ్ళీ బికినీలో మృణాల్... బాలీవుడ్‌లో అంతే అంతే!

ప్రముఖ ఛానల్ కథనం ప్రసారం అయ్యాక కంచన్ తర్వాత మరొక అమ్మాయిపై ప్రసాద్ బెహరా వేధింపులకు పాల్పడ్డాడా? అనే ప్రచారం మొదలైంది. ఛోటా మోటా యూట్యూబ్ ఛానల్స్, ప్రసాద్ బెహరా అంటే గిట్టని వాళ్ళు నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేశారు. వీడియో కథనంలో చూపించిన అమ్మాయి, ప్రసాద్ బెహరా మధ్య ఎటువంటి వివాదం లేదు సరికదా వాళ్ళిద్దరి మధ్య చక్కటి ప్రొఫెషనల్ బాండింగ్ ఉంది. దాంతో అటు వైపు అమ్మాయికి, ఇటు ప్రసాద్ బెహరాకు ఫోనులు మొదలు అయ్యాయి. దాంతో అసలు విషయం వివరించి, కొందరిని రిక్వెస్ట్ చేసి వీడియో డిలీట్ చేయించాల్సి వచ్చింది. అందుకని ప్రసాద్ బెహరా గట్టిగా ఎమోషనల్ అయ్యారు. నిజానిజాలు తెలుసుకోకుండా తన తల్లిదండ్రుల పేర్లు సైతం మార్చారని ఆవేదన చెందారు. అదీ సంగతి. ప్రసాద్ బెహరా స్పీచ్ మధ్యలో లైవ్‌లో ఆయన వాయిస్ రాకుండా మ్యూట్ చేశారు. బహుశా... 'పాపం ప్రతాప్' సినిమా బదులు, ఈ స్పీచ్ వైరల్ అవుతుందనేమో!

Also ReadVishnu Priya Bhimeneni: కేసుతో కలిసొచ్చిన పాపులారిటీ... సబ్‌స్క్రైబర్లు పెరిగారోచ్... విష్ణుప్రియకు డబ్బులే డబ్బులు

టాప్ హెడ్ లైన్స్

Anna Konidela Visits Thirumala: పవన్ త్వరగా కోలుకోవాలని తిరుమలకు భార్య... కాలినడకన కొండకు... వేంకటేశ్వరునికి అన్నా కొణిదెల ప్రత్యేక పూజలు
పవన్ త్వరగా కోలుకోవాలని తిరుమలకు భార్య... కాలినడకన కొండకు... వేంకటేశ్వరునికి అన్నా కొణిదెల ప్రత్యేక పూజలు
నోలన్ 'The Odyssey 'లో రామాయణ, మహాభారత పోలికలు: వైరల్ అవుతున్న 3 సారూప్యతలు!
నోలన్ 'The Odyssey 'లో రామాయణ, మహాభారత పోలికలు: వైరల్ అవుతున్న 3 సారూప్యతలు!
Oh Sukumari Box Office Collection Day 1: ఫ్లాప్ టాక్‌తో 'సుకుమారి'కి సూపర్ కలెక్షన్స్... తిరువీర్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్
ఫ్లాప్ టాక్‌తో 'సుకుమారి'కి సూపర్ కలెక్షన్స్... తిరువీర్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్
The Odyssey Box Office Collection Day 1: ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sonam Wangchuk:సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
US Iran War Updates 2026: ఏడో రోజూ ఇరాన్‌కు కాళరాత్రి! అమెరికా బాంబుల వర్షం! హోర్మూజ్‌ జలసంధిలో హైటెన్షన్!
ఏడో రోజూ ఇరాన్‌కు కాళరాత్రి! అమెరికా బాంబుల వర్షం! హోర్మూజ్‌ జలసంధిలో హైటెన్షన్!
The Odyssey Box Office Collection Day 1: ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Prashant Kadiyam: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు
కుప్పం vs మంగళగిరి: మా నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది - నారా లోకేష్
కుప్పం vs మంగళగిరి: మా నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది - నారా లోకేష్
What Is Stair Test For Heart Blockage: మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసమా? సాధారణ అలసట అనుకుంటే ప్రమాదమే!
మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసమా? సాధారణ అలసట అనుకుంటే ప్రమాదమే!
YS Jagan Digital Politics: డిజిటల్ లూప్‌లో వైఎస్సార్‌సీపీ - ఫీల్డ్ వదిలి యాప్స్‌ను నమ్ముకుంటే రాజకీయాల్లో రాత మారుతుందా?
డిజిటల్ లూప్‌లో వైఎస్సార్‌సీపీ - ఫీల్డ్ వదిలి యాప్స్‌ను నమ్ముకుంటే రాజకీయాల్లో రాత మారుతుందా?
సోనమ్‌ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం - ఆరోగ్యం క్షీణించంతో ఆసుపత్రికి తరలింపు 
సోనమ్‌ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం - ఆరోగ్యం క్షీణించంతో ఆసుపత్రికి తరలింపు 
Embed widget