By: ABP Desam | Updated at : 23 Mar 2022 06:14 PM (IST)
ఎన్టీఆర్
All arrangements have been done for RRR Special Screening at Hyderabad AMB Mall: 'ఆర్ఆర్ఆర్' విడుదలయ్యేది ఎప్పుడు? మార్చి 25న! అందులో మరో సందేహానికి తావు లేదు. తెలుగు రాష్ట్రాల్లో, ఇండియాలో శుక్రవారం సినిమా విడుదల కానుంది. మన కంటే ముందు అమెరికాలో ప్రేక్షకులు సినిమాను చూడనున్నారు. శుక్రవారం తెల్లవారుజామున అమెరికా నుంచి రిపోర్ట్ వస్తుంది. అయితే... వాళ్ళ కంటే ముందుగా కుటుంబ సభ్యులు, అతి కొంత మంది స్నేహితులకు 'ఆర్ఆర్ఆర్' స్పెషల్ షో వేస్తున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ముందే సినిమాను చూపించడానికి ఏర్పాట్లు చేశారు.
మార్చి 24న... అనగా గురువారం హైదరాబాద్‌లో 'ఆర్ఆర్ఆర్' విడుదల అవుతోంది. ఆ రోజు రాత్రి తొమ్మిది గంటలకు సూపర్ స్టార్ మహేష్ బాబుకు చెందిన ఏఎంబీ మాల్‌లో సినిమా విడుదలకు సర్వం సిద్ధమైంది. ఏఎంబీలో 52 రిక్లయినర్ సీట్లు గల థియేటర్ ఒకటి ఉంది. అందులో షో వేస్తున్నారు. ఎన్టీఆర్ ఈ షో ఎరేంజ్ చేశారు. ఆయన కుటుంబ సభ్యులు సహా అతి కొద్ది మంది సన్నిహితులను 'ఆర్ఆర్ఆర్' స్పెషల్ స్క్రీనింగ్ కు ఆహ్వానించారని తెలుస్తోంది. దాంతో ఆ 52 మంది ఎవరు? ఎన్టీఆర్ నుంచి ఎవరెవరికి ఆహ్వానం అందిందనేది అటు ఇండస్ట్రీలో, ఇటు ఆడియన్స్‌లో డిస్కషన్ పాయింట్ అయ్యింది.
Also Read: ఎన్టీఆర్ భయపడింది పులిని చూసి కాదు! - రాజమౌళి
'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' సినిమాను రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించారు. మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఎన్టీఆర్ జోడిగా ఒలీవియా మోరిస్, రామ్ చరణ్ జంటగా ఆలియా భట్ నటించారు. అజయ్ దేవగణ్, శ్రియ, రాహుల్ రామకృష్ణ, సముద్రఖని కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు.
Also Read: రాజమౌళిని డిజప్పాయింట్ చేసిన హాలీవుడ్ స్టంట్ మాస్టర్
Son Of India in OTT: ఓటీటీలో ‘సన్ ఆఫ్ ఇండియా’, స్ట్రీమింగ్ మొదలైంది!
Pushpa 2 Release Date: బన్నీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్, ‘పుష్ప: ది రూల్’ వచ్చేది అప్పుడేనట, మరీ అంత లేటా?
F3 Telugu Movie Song: పూజా హెగ్డేతో వెంకీ, వరుణ్ చిందులు - ‘లైఫ్ అంటే ఇట్టా ఉండాల’ సాంగ్ రిలీజ్
O2 Movie Telugu Teaser: నయన తార ‘O2’ టీజర్, ఊపిరి బిగపెట్టుకుని చూడాల్సిందే!
Kamal Haasan: ‘ఎవరు అడ్డొచ్చినా ఎదుర్కొంటా’ - హిందీ భాషపై కమల్ హాసన్ వ్యాఖ్యలు
Covid 19 Vaccine Gap: కరోనా వ్యాక్సినేషన్‌పై కేంద్రం కీలక నిర్ణయం, వ్యాక్సిన్ డోసుల మధ్య గ్యాప్ తగ్గింపు - వారికి మాత్రమే !
Woman Police SHO: మరో మహిళా పోలీస్‌కు అరుదైన గౌరవం, ఎస్‌హెచ్‌వోగా నియమించిన నగర కమిషనర్
YSRCP Rajyasabha Equation : వైఎస్ఆర్సీపీలో అర్హులు లేరా ? రాజ్యసభ అభ్యర్థుల ఎంపికకు జగన్ చూసిన అర్హత ఏమిటి ?
Vaaradhi App: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా, అయితే మీకు గుడ్‌న్యూస్