అన్వేషించండి

Kangana Ranaut’s ‘Emergency’:కంగ‌నా ర‌నౌత్ 'ఎమర్జెన్సీ' మూవీకి ఊహించని షాక్.. తెలంగాణలోనూ బ్యాన్?

Emergency: కంగ‌నా ర‌నౌత్ డైరెక్ట్ చేసి, న‌టించిన సినిమా 'ఎమ‌ర్జెన్సీ'. ఎన్నో వాయిదాల త‌ర్వాత సినిమా రిలీజ్ కానుంది. అయితే, ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ ఆపేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు ఎందుకంటే?

What Is The Controversy Around Kangana Ranaut’s ‘Emergency’? : కంగ‌నా ర‌నౌత్ డైరెక్ష‌న్ లో, ఆమె లీడ్ రోల్ ప్లే చేసిన 'ఎమ‌ర్జెన్సీ'. దేశ మాజీ ప్ర‌ధాని ఇందిరా గాంధీ జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కించారు ఈ సినిమా. నిజానికి ఎప్పుడో రిలీజ్ అవ్వాలి ఈ సినిమా. కానీ, వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. ఇక ఇప్పుడు సెప్టెంబ‌ర్ 6న సినిమా రిలీజ్ చేసేందుకు మేక‌ర్స్ ప్లాన్ చేశారు. అయితే, ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ ని నిలిపివేయాల‌ని సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ ఫిలిమ్ స‌ర్టిఫికేష‌న్ ని విజ్ఞ‌ప్తి చేసింది శిరోమ‌ణి అకాలీద‌ళ్ పార్టీ. మ‌రి రిలీజ్ ని ఆప‌మ‌ని ఎందుకు అడిగారు?  కార‌ణం ఏంటి? ఒక‌సారి చూద్దాం. 

సిక్కుల‌ను అవ‌మాన‌ప‌రిచేలా ఉంద‌ని.. 

శిరోమ‌ణి అకాలీద‌ళ్ ఢిల్లీ యూనిట్ సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ ఫిలిమ్ స‌ర్టిఫికేష‌న్ కి నోటీసులు పంపింది. ఆ సినిమాని ఆపేయాల‌ని కోరింది. ఇటీవ‌ల రిలీజ్ అయిన ట్రైల‌ర్ లో సిక్కుల గురించి త‌ప్పుగా చూపించార‌ని అకాలీద‌ళ్ ఢిల్లీ యూనిట్ చీఫ్ ప‌ర‌మ్ జిత్ సింగ్ శ‌ర‌ణా అన్నారు. ఈ మేర‌కు సినిమాని నిలిపేయాలని డిమాండ్ చేశారు.

అల్ల‌ర్లు జ‌రిగే అవ‌కాశం ఉంది.. 

మ‌రోవైపు సిక్కులకు పెద్ద, ఎమ్మెల్యే స‌ర‌బ్ జిత్ సింగ్ క‌ల్ షా కూడా సినిమాపై అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ఈ సినిమాలో సిక్కుల‌ను త‌ప్పుగా చూపించార‌ని, సిక్కులు అల్ల‌ర్లు చేసే అవ‌కాశం ఉన్నందున సినిమాని నిలిపివేయాల‌ని అన్నారు. పంజాబ్ ప్ర‌భుత్వాన్ని కూడా ఈ సినిమా ఆడ‌కుండా బ్యాన్ చేయాల‌ని ఆయ‌న ఫేస్ బుక్ ద్వారా విజ్ఞ‌ప్తి చేశారు. 

ఇదే విష‌యంపై శిరోమ‌ణి గురుద్వార ప‌ర్బంద‌క్ క‌మిటీ అధికార ప్ర‌తినిధి గురుచ‌ర‌ణ్ సింగ్ గేర్వాల్ కూడా స్పందించారు. “కంగ‌నా ర‌నౌత్ అంటేనే కాంట్ర‌వ‌ర్సీ.. అందుకే ఆమెకు నోటీసులు పంపాం. ఈ సినిమా రిలీజ్ చేసేవాళ్ల‌కి కూడా నోటీసులు పంపాం. ఆ ట్రైల‌ర్ లో చూపించిన వాళ్ల‌ని తొల‌గించాలి, అన్ని సోష‌ల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో ట్రైల‌ర్ ని తీసేయాలి డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా సిక్కులంద‌రికీ ఆమె క్ష‌మాప‌ణ చెప్పాలి” అని అన్నారు ఆయ‌న‌. 

కంగ‌నా ఏమ‌న్నారంటే? 

ఇక సినిమా రిలీజ్ పై కంగ‌నా ర‌నౌత్ స్పందించారు. “ అనుకున్న‌ట్లుగానే మా సినిమాకి సెన్సార్ నుంచి అనుమ‌తి వ‌చ్చింది. మేం స‌ర్టిఫికెట్ తీసుకుంటున్న రోజు కూడా చాలామంది చాలా డ్రామాలు వేశారు. సెన్సార్ లో కూడా చాలా స‌మ‌స్య‌లు వ‌చ్చాయి. ఇది ఇప్పుడు విడుదల అవుతుంద‌ని ఆశిస్తున్నాను. ఎందుకంటే వాళ్లు చెప్పిన‌ట్లుగా వెంట‌నే.. ఒక‌రి కాళ్ల కింద నుంచి కార్పెట్ లాగినంత ఈజీగా సినిమాలో మార్పులు చేయ‌లేం క‌దా. నాకు స‌ర్టిఫికెట్ వ‌చ్చింద‌ని చాలా న‌మ్మ‌కంగా ఉన్నాను. కాని ఇప్పుడు వాళ్లు నాకు సర్టిఫికెట్ ఇవ్వొద్దు అంటున్నారు. మనం చరిత్రను చూపించాలి. దాదాపు 70 ఏళ్ల వృద్ధురాలిని ఆమె ఇంట్లోనే 30-35 సార్లు కాల్చిచంపారు. ఆమెను ఎవరు చంపి ఉంటారు అనేది చ‌రిత్ర‌. దాన్ని నేను చూపించాలని అనుకుంటున్నాను. చ‌రిత్ర‌ను చూపించాలి అనుకుంటున్నాను. ఆమె ఎలా చ‌నిపోయిందో చూపించాలి అనుకుంటున్నాను” అని చెప్పారు కంగ‌నా ర‌నౌత్. 

బ్యాన్ దిశ‌గా రాష్ట్రాలు.. 

కాగా.. 'ఎమ‌ర్జెన్సీ' సినిమాని చాలా రాష్ట్రాలు బ్యాన్ చేస్తాయ‌నే వార్త‌లు కూడా వ‌స్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఈ సినిమాపై నిషేధం విధించే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇక ఇప్ప‌టికే తెలంగాణ సిక్ సొసైటీ డెలిగేష‌న్ ఈ సినిమాని నిషేధించాల‌ని కోరుతూ ప్ర‌భుత్వాన్ని విజ్ఞ‌ప్తి చేసింది. ఈ మేర‌కు మాజీ ఐపీఎస్ ఆఫీస‌ర్ తేజ్ దీప్ కౌర్ మీన‌న్ ఒక రిపోర్ట్ కూడా ప్ర‌భుత్వానికి ఇచ్చారు. దీంతో తెలంగాణలో కూడా ఈ మూవీ విడుదలయ్యే అవకాశాలు లేవు.

Aso Read: ‘భారతీయుడు 2’ నిర్మాతలకు లీగ‌ల్ నోటీసులు - అలా చేయడం తగదంటూ.. మండిపాటు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana BJP: తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
TECNO POP 9: 6 జీబీ ర్యామ్ ఫోన్ రూ.10 వేలలోపే - ఐఫోన్ తరహా డిజైన్‌తో టెక్నో పాప్ 9!
6 జీబీ ర్యామ్ ఫోన్ రూ.10 వేలలోపే - ఐఫోన్ తరహా డిజైన్‌తో టెక్నో పాప్ 9!
BRS And Congress On Lagacherla Issue: లగచర్లలో పొలిటికల్ రేస్‌- బాధితులకు న్యాయం చేసేది ఎవరు?
లగచర్లలో పొలిటికల్ రేస్‌- బాధితులకు న్యాయం చేసేది ఎవరు?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana BJP: తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
TECNO POP 9: 6 జీబీ ర్యామ్ ఫోన్ రూ.10 వేలలోపే - ఐఫోన్ తరహా డిజైన్‌తో టెక్నో పాప్ 9!
6 జీబీ ర్యామ్ ఫోన్ రూ.10 వేలలోపే - ఐఫోన్ తరహా డిజైన్‌తో టెక్నో పాప్ 9!
BRS And Congress On Lagacherla Issue: లగచర్లలో పొలిటికల్ రేస్‌- బాధితులకు న్యాయం చేసేది ఎవరు?
లగచర్లలో పొలిటికల్ రేస్‌- బాధితులకు న్యాయం చేసేది ఎవరు?
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Revanth Reddy: తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Jani Master: త్వరలో అసలు నిజాలు బయటకు వస్తాయి... జైలు నుంచి బయటకు వచ్చాక తొలిసారి కేసుపై మాట్లాడిన జానీ మాస్టర్
త్వరలో అసలు నిజాలు బయటకు వస్తాయి... జైలు నుంచి బయటకు వచ్చాక తొలిసారి కేసుపై మాట్లాడిన జానీ మాస్టర్
Embed widget