అన్వేషించండి

Daavudi Video Song: దావూదీ... దావూదీ... ఎన్టీఆర్ 'దేవర'లో దుమ్ము రేపే వీడియో సాంగ్ వచ్చిందోచ్

Devara Third Single: మ్యాన్ ఆఫ్ మాస్ ఎన్టీఆర్ అభిమానులతో పాటు ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించే 'దేవర' సినిమాలో 'దావూదీ...' వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. అది ఎలా ఉందో చూడండి.

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR) అభిమానులకు పూనకాలే. ఆయన ఫ్యాన్స్ మాత్రమే కాదు.... ఆడియన్స్ అందరూ స్టెప్పులు వేసే సాంగ్ వచ్చింది. ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా ఫిల్మ్ 'దేవర' (Devara Part 1). ఇందులో మూడో పాట నేడు విడుదలైంది.

దావూదీ... దావూదీ... 'దేవర'లో పాట!
ఎన్టీఆర్ అంటే మాస్. ఎన్టీఆర్ అంటే డ్యాన్స్. ఎన్టీఆర్ అంటే హీరోయిజం. ఆయన వెర్సటైల్ స్టార్. ఎటువంటి పాట అయినా, ఎటువంటి స్టెప్ అయినా సరే వేయగల సమర్థుడు. ఇప్పటి వరకు 'దేవర' సినిమాలో పాటలు రెండు విడుదల అయ్యాయి. ఫస్ట్ సాంగ్ 'ఫియర్'లో లిరిక్స్ గూస్ బంప్స్ ఇచ్చేలా ఉన్నాయి. హీరోయిజం బాగా ఎలివేట్ చేసేలా ఉన్నాయి. అయితే, ఆ సాంగ్ డ్యాన్స్ నంబర్ కాదు. 'చుట్టమల్లే' సాంగ్ వింటే మెలోడీ అని అర్థం అవుతుంది. పక్కా డ్యాన్స్ నంబర్ కోసం వెయిట్ చేస్తున్న అభిమానుల కోసం అన్నట్టు 'దావూదీ... దావూదీ...' ఉంది.

Also Read: బాసూ.... మీది మెగా మనసు - చిరు, పవన్ తర్వాత గ్లోబల్ స్టార్ భారీ సాయం, ఎంత విరాళం ఇచ్చారంటే?

'దేవర'కు తమిళ సంచలనం అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. పాన్ ఇండియా ఆడియన్స్, అభిమానులను ఆకట్టుకునేలా ఆయన 'దావూదీ...' పాటకు బాణీ అందించారు.


సెప్టెంబర్ 27న థియేటర్లలో 'దేవర'
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న రెండో సినిమా 'దేవర'. దీనికి ముందు వీళ్లిద్దరి కలయికలో 'జనతా గ్యారేజ్' సినిమా వచ్చింది. అంతకు ముందు 'బృందావనం' చిత్రానికి రచయితగానూ కొరటాల శివ పని చేశారు. అయితే, అప్పటి పరిస్థితులు వేరు. ఇప్పటి పరిస్థితులు వేరు. 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' తర్వాత ఎన్టీఆర్ ఇమేజ్ మారింది. అందుకు తగ్గట్టు సినిమా తీశారట.

'దేవర' సినిమాకు ఎన్టీఆర్ సోదరుడు, హీరో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ సమర్పకులు. ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ‌సుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాక‌ర్‌, హ‌రికృష్ణ‌ కె సంయుక్తంగా సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు. తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ‌, మ‌లయాళ భాష‌ల్లో సెప్టెంబ‌ర్ 27న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున ఈ చిత్రాన్ని విడుదల చేయ‌నున్నారు.

రెండు పాత్రల్లో ఎన్టీఆర్ సందడి!
'దేవర'లో ఎన్టీఆర్ రెండు రోల్స్ చేశారు. తండ్రీ కొడుకులుగా సందడి చేస్తారు. ఆ మాట చిత్ర బృందం అధికారికంగా చెప్పలేదు కానీ కొన్ని రోజుల క్రితం 'భయానికి ప్రతి రూపాలు' అంటూ ఇద్దరు ఎన్టీఆర్‌లు ఉన్న స్టిల్ విడుదల చేశారు. దాంతో ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నారని కన్ఫర్మ్ అయ్యింది.

Also Read: దళపతి విజయ్‌కు షాక్ ఇచ్చిన మల్టీప్లెక్స్‌లు - అక్కడ 'గోట్'ను ఎందుకు రిలీజ్ చెయ్యట్లేదంటే?


ఈ సినిమాలో ఎన్టీఆర్ జోడీగా అతిలోక సుందరి  శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్నారు. ఆమెకు తొలి తెలుగు చిత్రమిది. ఇంకా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇంకా విలక్షణ నటుడు ప్ర‌కాష్ రాజ్‌, శతాధిక చిత్ర కథానాయకుడు శ్రీకాంత్‌, మలయాళ స్టార్ షైన్ టామ్ చాకో, న‌రైన్ ఇత‌ర ప్రధాన పాత్రధారులు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Embed widget