By: ABP Desam | Updated at : 14 Feb 2023 03:25 PM (IST)
'తెలుసా మనసా' సినిమాలో జశ్విక, పార్వతీశం
'కేరింత' ఫేమ్ పార్వతీశం (Parvateesam) కథానాయకుడిగా శ్రీబాలాజీ పిక్చర్స్ సంస్థ రూపొందిస్తున్న సినిమా 'తెలుసా మనసా' (Telusa Manasa Movie). ఈ చిత్రంలో జశ్విక కథానాయిక. దీనికి వైభవ్ దర్శకుడు. వర్షా ముందాడ, మాధవి నిర్మాతలు. పల్లెటూరి నేపథ్యంలో సరికొత్త కథ, కథనాలతో న్యూ ఏజ్ ప్రేమ కథగా తెరకెక్కించారు. కొన్ని రోజుల క్రితం ప్రముఖ అగ్ర నిర్మాత 'దిల్' రాజు (Dil Raju) చేసినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ రోజు సినిమాలో తొలి పాట 'మనసు మనసుతో' విడుదల చేశారు.
మంచి విజయం సాధించాలి!
'తెలుసా మనసా' సినిమాలో 'మనసు మనసుతో...' అంటూ సాగే తొలి గీతానికి వనమాలి సాహిత్యం అందించారు. గోపీసుందర్ సంగీతం అందించగా... శ్రీకృష్ణ ఆలపించారు. సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య' సినిమాతో భారీ విజయం అందుకున్న దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) ఈ పాటను ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.
Here's #ManasuManasutho song from #TelusaManasa.
— Bobby (@dirbobby) February 14, 2023
▶️ https://t.co/iuxXvzyOKW
Best wishes to @vaibhavwriter, @GopiSundarOffl & the entire team. ❤️ #SriBalajiPictures @parvateesam_u @Jashvika2000 @ActorAliReza #RohiniHattangadi @tipsmusicsouth @beyondmediapres pic.twitter.com/JNkGRxNoCF
బెలూన్స్ అమ్ముకునే అబ్బాయిగా హీరో!
'తెలుసా మనసా' సినిమాలో ఒక పల్లెటూరిలో బెలూన్స్ (బుడగలు) అమ్ముకునే ఓ యువకుడు మల్లి బాబుగా హీరో పార్వతీశం కనిపించనున్నారు. ఆ ఊరిలో పని చేసే హెల్త్ అసిస్టెంట్ సుజాత పాత్ర హీరోయిన్ జశ్వికది. ఇద్దరి మనసుల్లోనూ ఒకరు అంటే మరొకరికి ప్రేమ ఉంటుంది. కానీ, ఎప్పుడూ వారిద్దరూ ఆ ప్రేమను వ్యక్తం చేసుకోరు. సుజాతకు ప్రపోజ్ చేయాలని పలు సందర్భాల్లో మల్లి బాబు ట్రై చేస్తాడు. అయితే, చెప్పలేకపోతాడు. ఓ సందర్భం తర్వాత అనూహ్యంగా మల్లి బాబు కలలు కూలిపోతాయి. సుజాతకు దూరం కావాల్సి వస్తుంది. మళ్ళీ వారిద్దరూ కలుసుకున్నారా? లేదా? అనేది సినిమా కథ.
Also Read : ఇండియాలో 'యాంట్ మ్యాన్ 3' అడ్వాన్స్ బుకింగ్స్ - 'అల' హిందీ రీమేక్‌తో కంపేర్ చేస్తే...
ఫస్ట్ లుక్‌లో బామ్మ కూడా!
'తెలుసా మనసా' ఫస్ట్ లుక్ చూస్తే... హీరో హీరోయిన్లతో పాటు ఓ బాబు, బామ్మ రోల్ చేసిన రోహిణి హట్టంగడి కూడా ఉంటారు. ఆమె మంచంపై కూర్చుని ఉంటారు. ఆ లుక్‌లో హీరో పార్వతీశం ఏదో ఆలోచిస్తూ ఉన్నారు. ఆయన ఎందుకు అలా దిగాలుగా కూర్చుని ఉన్నారు? అనేది సినిమా చూస్తే గానీ తెలియదు. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతుందని, త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తామని చిత్ర బృందం పేర్కొంది. కొత్త దర్శకుడు చక్కగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని తెలిపారు.
Also Read : నా భర్త ముందే లియోనార్డోతో ఆ బోల్డ్ సీన్స్‌లో నటించా: ‘టైటానిక్’ నటి కేట్ వ్యాఖ్యలు
మహేష్ అచంట, అలీ రెజా, లావణ్య, మాస్టర్ అద్వితేజ్, వెంకీ, శివ, శోభన్ తదితరులు ఈ సినిమాలో ఇతర తారాగణం. జాతీయ పురస్కారం అందుకున్న సంగీత దర్శకుడు గోపీ సుందర్ 'తెలుసా మనసా' చిత్రానికి స్వరాలు, నేపథ్య సంగీతం అందిస్తున్నారు. ఇంకా ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : ప్రసాద్ ఈదర, కూర్పు : పాపారావ్, పాటలు : వనమాలి, కాసర్ల శ్యామ్, శ్రేష్ట, గాయనీ గాయకులు : రాహుల్ సిప్లిగంజ్, శ్రీరామచంద్ర, రమ్య బెహ్ర, శ్రీకృష్ణ, మాళవిక, సుధాంశు, సహ నిర్మాత : గిరిధర్, సమర్పణ : నైనీష్య, సాత్విక్, నిర్మాతలు: వర్షా ముందాడ, మాధవి, కథ - కథనం - మాటలు - దర్శకత్వం : వైభవ్.
Pareshan Movie Review - 'పరేషాన్' సినిమా రివ్యూ : 'మసూద' తర్వాత తిరువీర్‌కు మరో హిట్!?
మహేష్ కోసం థమన్ కాపీ ట్యూన్ ఇచ్చాడా? 'గుంటూరు కారం' బీట్‌ను అక్కడి నుంచి లేపేశాడా?
ఎన్టీఆర్ మాస్టర్ ప్లాన్ - రెండు సినిమాల షూటింగ్స్ ఒకేసారి!
షూటింగ్ పూర్తి చేసుకున్న 'జైలర్' - రిలీజ్ ఎప్పుడంటే!
విజయ్ దేవరకొండపై సమంత ఎమోషనల్ కామెంట్స్ - రౌడీబాయ్ లవ్లీ రిప్లై
Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ
దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!
CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు
YS Viveka Case : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !