VM19 Title Announcement: విష్ణు మంచు పాన్ ఇండియా సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్‌కు ముహూర్తం ఖరారు
Vishnu Manchu Latest Movie Title Update: గాలి నాగేశ్వరరావు పాత్రలో మంచు విష్ణు ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్‌కు ముహూర్తం ఖరారు చేశారు.
డైనమిక్ స్టార్, యువ కథానాయకుడు విష్ణు మంచు పాన్ ఇండియా మార్కెట్ మీద కన్నేశారు. (Vishnu Manchu As Gali Nageswara Rao) గాలి నాగేశ్వరరావు పాత్రలో ఆయన ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో ఆ సినిమాను విడుదల చేయనున్నారు. శుక్రవారం (జూన్ 10న) ఉదయం 09.32 గంటలకు టైటిల్ వెల్లడించనున్నారు. విష్ణు మంచి 19వ చిత్రమిది.
VM19 సినిమాలో స్వాతి పాత్రలో పాయల్ రాజ్‌పుత్, రేణుక పాత్రలో సన్నీ లియోన్ నటిస్తున్నారు. ఈ రోజు సన్నీ లియోన్ ''ఓయ్ గాలి నాగేశ్వరరావు, చాలా రోజుల నుంచి కనిపించడం లేదు'' అని ట్వీట్ చేశారు. దానిని కోట్ చేసిన పాయల్ 'ఇంకెన్ని రోజులు ఇలా పిలిపించుకుంటావ్' అని విష్ణు మంచును అడిగారు. రేపు ఉదయం చెబుతానని విష్ణు సమాధానం ఇచ్చారు.
ఈ సినిమా స్పెషాలిటీ ఏంటంటే... విష్ణు కుమార్తెలు అరియనా, వివియానా ఒక పాట పాడారు. ప్రభుదేవా ఒక కొరియోగ్రఫీ చేశారు.
Also Read: సాయి పల్లవి కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్, మాటలు రావడం లేదు - 'విరాట పర్వం' చూసిన సెలబ్రిటీల రివ్యూ
Ee okka roju wait chey Swathi
— Vishnu Manchu (@iVishnuManchu) June 9, 2022
Repu 9:32AM andariki chepeddam. 🫣 🫣 https://t.co/m4kslx458u pic.twitter.com/BhhbJSqobz
కలెక్షన్ కింగ్ డా. మంచు మోహన్ బాబు ఆశీస్సులతో అవ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఈ సినిమా రూపొందుతోంది. దర్శకుడు జి. నాగేశ్వరరరెడ్డి మూల కథ అందించగా... కోన వెంకట్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. క్రియేటివ్ ప్రొడ్యూసర్ కూడా ఆయనే. ఈషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. చోటా కె. నాయుడు ఛాయాగ్రహణం అందిస్తున్నారు.
Also Read: అరుదైన సినిమా, బాక్సు నిండుగా టిష్యూలు తీసుకు వెళ్ళండి - '777 చార్లీ' చూసిన సెలబ్రిటీలు ఏమన్నారంటే?
View this post on Instagram