అన్వేషించండి

Vithika Sheru: నా భర్త ఫెయిల్డ్ యాక్టర్ కాదు, ఏడేళ్ల నుంచి ఆ నిందలు పడుతూనే ఉన్నా - వరుణ్ సందేశ్ భార్య వితికా షేరు

Vithika Sheru: ‘నింద’తో మళ్లీ ప్రేక్షకుల అభిమానం సంపాదించుకోవాలి అనుకుంటున్నాడు వరుణ్ సందేశ్. ఈ మూవీ ప్రీ రిలీజ్‌లో పాల్గొన్న తన భార్య వితికా.. వరుణ్ గురించి గొప్పగా మాట్లాడింది.

Vithika Sheru About Varun Sandesh: కెరీర్ మొదట్లోనే హీరోగా బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకున్నాడు వరుణ్ సందేశ్. తర్వాత ఎన్నో ఫ్లాప్స్‌ను చూసి చాలాకాలం సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నాడు. ఇక ఇన్నాళ్లకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ అయ్యాడు. జూన్ 21న వరుణ్ సందేశ్ హీరోగా నటించిన ‘నింద’ మూవీ విడుదలకు సిద్ధమయ్యింది. తాజాగా మూవీ టీమ్ ఒక ప్రెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది. దీనికి హీరో నిఖిల్.. చీఫ్ గెస్ట్‌గా వచ్చాడు. ఈ ఈవెంట్‌లో వరుణ్ భార్య వితికా షేరు కూడా పాల్గొంది. ఇద్దరూ కలిసి తమ పర్సనల్ లైఫ్‌లోని కొన్ని సరదా విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.

నిందలు పడుతూనే ఉన్నాను..

వరుణ్ సందేశ్, వితికా షేరు కలిసి ‘నింద’ ఈవెంట్‌లో ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేశారు. పర్సనల్ లైఫ్‌లో నిందల గురించి మాట్లాడుతూ.. ‘‘మా అత్తయ్య వాళ్లు అమెరికాలో ఉంటారు కాబట్టి వాళ్లు ఫోన్ చేసిన ప్రతీసారి వితికా వంట చేయడం లేదని చెప్తుంటాడు. మొన్న ఒక వీడియోలో కూడా అదే చెప్పాడు. గత ఏడేళ్ల నుంచి ఆ నిందలు పడుతూనే ఉన్నాను’’ అని వితికా చెప్పింది. దీనికి వరుణ్ కూడా సమాధానమిచ్చాడు. ‘‘వితికాకు ఎప్పుడైనా బోర్ కొడితే మా అమ్మా, నాన్నకు ఫోన్ చేసి సందేశ్ తిట్టాడని చెప్తుంది. వాళ్లు ఫోన్ చేసి నన్ను తిడితే తనకొక ఆనందం’’ అని తమ మధ్య జరిగే సరదా విషయాన్ని బయటపెట్టాడు వరుణ్ సందేశ్.

సర్దుకొని వెళ్లిపోలేదు..

‘నింద’ ప్రెస్ మీట్‌లో వితికా షేరు మాట్లాడుతూ.. ‘‘నేను సందేశ్ కోసమే ఇక్కడికి వచ్చానని మీ అందరికీ తెలుసు. ఎప్పుడూ తన సినిమా ఫంక్షన్స్‌కు నేను రానని చెప్పేదాన్ని. చాలారోజుల తర్వాత మా ఆయన కోసం నేను ఇక్కడికి రావాలి అనిపించింది. ఈమధ్య తను ఎక్కడికి వెళ్లినా తన ఫెయిల్యూర్స్ గురించే మాట్లాడుతున్నారని సందేశ్ నాకు ఇంటికి వచ్చి చెప్తూ ఉన్నాడు. తను ఒక ఫెయిల్యూర్ యాక్టర్ అస్సలు కాదు. ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి గత 17 ఏళ్లుగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఎవరైతే అన్నీ సర్దుకొని వెళ్లిపోయి ఇంక సినిమాలు వద్దు అనుకుంటారో వారు ఫెయిల్డ్ యాక్టర్. ఏ యాక్టర్ అయినా సినిమా సక్సెస్ అవ్వాలనే కష్టపడతారు. అలాగే సందేశ్ కూడా. ఏదో ఒకరోజు ఆయన సక్సెస్ కొడతారు’’ అంటూ వరుణ్ సందేశ్ గురించి గొప్పగా మాట్లాడింది వితికా షేరు.

నిఖిలే గుర్తొచ్చాడు..

‘‘నింద కోసం దర్శకుడు రాజేష్ జగన్నాధం చాలా కష్టపడ్డారు. అప్పుడప్పుడు వరుణ్ నాకంటే ఆయనతోనే ఎక్కువగా ఉంటున్నారు అనిపించింది. అందరు యాక్టర్లు చాలా బాగా చేశారు. నేను ఆల్రెడీ సినిమా చూశాను కాబట్టే ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా నిఖిల్‌కు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మామూలుగా సందేశ్ ఎవరికైనా కాల్ చేసి పిలవాలి అంటే ఎందుకులే వాళ్ల టైమ్‌ను వృధాచేయడం అనుకుంటూ ఉంటాడు. కానీ ఈ సినిమాకు ఎవరో ఒకరిని పిలవాలి అనుకున్నప్పుడు ముందుగా గుర్తొచ్చిన పేరు నిఖిల్. ఇలాగే ఎప్పుడూ ఒకరి లైఫ్‌లో ఒకరు ఉండాలి అని కోరుకుంటున్నాను’’ అంటూ తన స్పీచ్‌ను ముగించింది వితికా.

Also Read: అలా చేయకపోతే వరుణ్ సందేశ్‌ను కొడతా, నా కొడుకు పేరు అదే - ‘నింద’ ప్రెస్ మీట్‌లో హీరో నిఖిల్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

IPL 2025 Mega Auction Date Announced | ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది | ABP Desamఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Telangana: కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
US Presidential Election: స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
Manda krishna on Pawan: మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
Thandel Release Date: అఫీషియల్‌గా 'తండేల్' రిలీజ్ డేట్‌ అనౌన్స్ చేసిన టీమ్... ప్రేమికుల రోజుకు ముందు వారంలో!
అఫీషియల్‌గా 'తండేల్' రిలీజ్ డేట్‌ అనౌన్స్ చేసిన టీమ్... ప్రేమికుల రోజుకు ముందు వారంలో!
Embed widget