అన్వేషించండి

Vishwak Sen: విశ్వక్‌ సేన్‌ మరో సాహసం - కమల్‌ హాసన్‌, రాజేంద్రప్రసాద్‌ తరహాలో ప్రమోగం, మరి వారిలా మెప్పించగలడా?

Vishwak Sen: తాజాగా మీడియాతో మాట్లాడిన విశ్వక్‌ సేన్ 'గామి' తర్వాత తాను 'లైలా' అనే మూవీ చేస్తున్నానని చెప్పాడు. అంతేకాదు ఈ సినిమాకు అతడే స్వయంగా కథ, స్క్రిన్‌ ప్లే రాసుకున్నాడట..

Vishwak Sen Appear in Lady Getup Soon: మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్‌ క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మాస్‌ అండ్‌ బోల్డ్‌ క్యారెక్టర్స్‌కి కేరాఫ్‌ అడ్రస్‌. మొన్నటి వరకు మాస్‌ రోల్స్‌తో అలరించిన విశ్వక్‌ తాజాగా రూటు మార్చాడు. పాత్రలతో ప్రయోగాలు చేస్తున్నాడు.  ఈసారి 'గామి'లో సరికొత్తగా అలరించబోతున్నాడు. తన మాస్‌ ఇమేజ్‌ని పక్కన పెట్టి అఘోరగా కొత్త అవతారం ఎత్తాడు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం మార్చి 8న థియేటర్లో రిలీజ్‌ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న విశ్వక్‌ సేన్‌ తన నెక్ట్స్‌ మూవీపై లీక్‌ ఇచ్చాడు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అతడు 'గామి' తర్వాత తాను 'లైలా' అనే మూవీ చేస్తున్నానని చెప్పాడు. అంతేకాదు ఈ సినిమాకు అతడే స్వయంగా కథ, స్క్రిన్‌ ప్లే రాసుకున్నాడట.. డైరెక్షన్‌ కూడా తానే చేయాలనుకున్నానని చెప్పి సర్‌ప్రైజ్‌ చేశాడు. ఈ మేరకు విశ్వక్‌ మాట్లాడుతూ.. "నెక్ట్స్‌ నేను లైలా మూవీ చేస్తున్నారు. ఈ సినిమానే స్వయంగా నేనే కథ రాసుకున్నాను. మూవీ స్క్రీన్‌ప్లే, దర్శకత్వం కూడా నేనే చేయాలనుకున్నా. కానీ కొత్త దర్శకుడు డైరెక్ట్‌ చేస్తున్నారు. అతడు దిల్‌సుఖ్‌నగర్‌ చెందినవాడని, ఈ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయం కాబోతున్నాడు" అని చెప్పాడు. అనంతరం మరో షాకింగ్‌ విషయం చెప్పాడు. ఇందులో తాను లేడీ గెటప్‌ చేస్తున్నట్టు కూడా రివీల్‌ చేశాడు.  కనిపించబోతున్నాను. 

ఈసారి లేడీ గెటప్‌లో

సెకండ్ హాఫ్ లో తాను ఎక్కువ సేపు లేడీ గెటప్ లో ఉంటాను అనే విషయాన్ని వెల్లడించాడు. ఇదంతా చూస్తుంటే విశ్వక్‌ మరోసారి పాత్రతో ప్రయోగం చేస్తున్నాడనిపిస్తుంది. గతంలో ఇలాంటి రోల్లో కమల్ హాసన్, రాజేంద్ర ప్రసాద్, శివ కార్తికేయన్, మంచు మనోజ్ వంటి స్టార్‌ హీరోలు లేడీ గెటప్‌ల్లో నవ్వించారు. 'భామనే సత్యభామనే' మూవీలో కమల్ హాసన్... 'మేడం' మూవీలో రాజేంద్ర ప్రసాద్.. 'రెమో' మూవీలో శివ కార్తికేయన్.. పాండవులు పాండవులు తుమ్మెదలో మంచు మనోజ్‌లు వంటి హీరోలు మాత్రమే ఫుల్‌ లెన్త్‌లో లేడీ గెటప్‌లో కనిపించి ఆడియన్స్‌ని మెప్పించారు.

ఇలాంటి పాత్ర అంటే సాహసమే..

ఈ మధ్యకాలంలో అలాంటి ప్రయోగాలు ఏ హీరో అయితే  చేయలేదు. ఇప్పటి జనరేషన్ లో లేడీ గెటప్ పాత్ర చేయడమనేది సాహసమైన నిర్ణయమనే చెప్పాలి. అదీ కూడా  ఓ యంగ్ హీరో చేయడమంటే గమనార్హం.  కానీ ఇప్పుడు విశ్వక్‌ మాత్రం వారి బాటలో వేళుతూ సాహసం చేయబోతున్నాడు. దీంతో ఇప్పుడిది ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచింది. మరి కమల్‌ హాసన్‌, రాజేంద్రప్రసాద్‌ వంటి లెజెండరీ నటుల తరహాలో విశ్వక్‌ మెప్పిస్తాడా? బొల్తా పడతాడో చూడాలి. ఇక విశ్వక్సేన్ గామీ విషయానికి వస్తే విద్యాధర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చాందినీ చౌదరి, దయానంద రెడ్డి, మయాంక్ పరాక్, అభినయ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget