అన్వేషించండి

Vishnu Manchu: నటుడిగా నా విజిటింగ్ కార్డు కన్నప్ప... ప్రభాస్ వల్లే ఓపెనింగ్స్ - విష్ణు మంచు

Kannappa Thanks Meet: తన విజిటింగ్ కార్డ్ కన్నప్ప అని విష్ణు మంచు తెలిపారు. ప్రభాస్ ఉండడం వల్లే సినిమాకు ఓపెనింగ్స్ వచ్చాయి అనేది 100% నిజం అన్నారు. థాంక్స్ మీట్‌లో ఆయన సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

'కన్నప్ప' సినిమాలో లోపాలు ఉన్నప్పటికీ... చివరి గంట సేపు తెరపై భావోద్వేగంతో ప్రేక్షకులు కనెక్ట్ కావడంతో భారీ విజయాన్ని తమకు కట్టబెట్టారని విష్ణు మంచు పేర్కొన్నారు. 'కన్నప్ప'కు ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణ, బాక్సాఫీస్ దగ్గర వస్తున్న వసూళ్ల పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. సినిమా విడుదలైన మర్నాడు నిర్వహించిన విలేకరుల సమావేశంలో విష్ణు మంచు సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
 
నటుడిగా నా విజిటింగ్ కార్డు 'కన్నప్ప'!
Kannappa is my visiting card as an actor, says Vishnu Manchu at Thank You Meet: నటుడిగా తన విజిటింగ్ కార్డు 'కన్నప్ప' అని విష్ణు మంచు అన్నారు. 'ఢీ'లో బాగా చేశానని అందరూ చెప్పారని, రాము (రామ్ గోపాల్ వర్మ) గారి దర్శకత్వంలో చేసిన 'అనుక్షణం'లో తన పెర్ఫార్మెన్స్ తనకు ఇష్టమని, అయితే 'కన్నప్ప' విడుదలైన తర్వాత ప్రతి ఒక్కరూ ఈ సినిమా గురించి మాట్లాడుతున్నారని విష్ణు వివరించారు. కింగ్ అక్కినేని నాగార్జున నుంచి 'దేనికైనా రెడీ' విడుదల అయ్యాక తనకు ఫోన్ వచ్చిందని, మళ్లీ ఇన్నేళ్ళకు ఆయన నుంచి 'కన్నప్ప' విడుదల తర్వాత ఫోన్ వచ్చిందని తెలిపారు.

నాగార్జున నుంచి అభినందనలు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అలాగే విక్టరీ వెంకటేష్ సహా యువ హీరోలు నందమూరి కళ్యాణ్ రామ్, నితిన్, ‌‌దర్శకుడు శ్రీనువైట్ల, ప్రముఖ హాస్యనటుడు వెన్నెల కిషోర్ నుంచి మెసేజ్ వచ్చినట్లు విష్ణు తెలిపారు.

ప్రభాస్ వల్లే ఓపెనింగ్స్ వచ్చాయన్న‌ విష్ణు!
'కన్నప్ప' సినిమాలో ప్రభాస్ ఉండడం వల్లే చాలా మంది థియేటర్లకు వచ్చారని, పరమ శివుని భక్తుని కథ తెలుసుకున్నారని, తన బ్రదర్ ప్రభాస్ వల్ల ఓపెనింగ్స్ వచ్చాయని అంగీకరించడానికి తనకు ఎటువంటి ఈగో లేదని విష్ణు తెలిపారు.

Also Readరజనీకాంత్ 'కూలీ'కి ఐమాక్స్ స్క్రీన్స్ లేకుండా చేస్తున్న‌ YRF... అక్కడ ఎన్టీఆర్ సినిమాకు అడ్వాంటేజ్!?

ప్రభాస్ వల్ల ఓపెనింగ్స్ వచ్చాయన్న విష్ణు... వెండితెరపై ప్రభాస్ వచ్చినప్పటి నుంచి సినిమా మారిందని వస్తున్న మాటలను మాత్రం అంగీకరించలేదు. ప్రభాస్ ఎంట్రీ నుంచి కాదని, ఇంతకు ముందు తండ్రిగా నటించిన శరత్ కుమార్ - తనకు మధ్య సన్నివేశం నుంచి సినిమా మారిందని విష్ణు తెలిపారు. మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ లభించాయని, 15 లక్షల టికెట్లు అమ్ముడు అయినట్లు మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ తమకు తెలిపిందని చెప్పారు.

Also Readపాన్ ఇండియా బాక్సాఫీస్ మీద టాలీవుడ్ దండయాత్ర - 2025 సెకండాఫ్‌లో ప్రతి నెల రెండు భారీ సినిమాలు... స్టార్ హీరోల సినిమా రిలీజ్ డేట్స్ లిస్ట్ ఇదిగో


ఓటీటీ నుంచి అడిగిన అమౌంట్ వస్తుందా?
'కన్నప్ప' విడుదలకు ముందు ఓటీటీ సంస్థ తమకు ఆఫర్ చేసిన అమౌంట్ నచ్చలేదని విష్ణు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మొదటి రోజు వచ్చే ఓపెనింగ్స్ బట్టి డబ్బులు ఇస్తామని‌ అన్నారని కూడా ఆయన తెలిపారు. ఇప్పుడు ఓటీటీ సంస్థకు చెక్ రెడీ చేసుకోమని ఫోన్ చేసినట్లు చెప్పారు.

టాప్ హెడ్ లైన్స్

Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
Eshwar Sai Madhuri Rathod Songs : మాధురి రాథోడ్ హిట్ సాంగ్స్ విత్ ఈశ్వర్ సాయి - రాతిరి రాతిరి రాతిరిలో, సీటీ చీర... ఫోక్ డ్యాన్సర్స్ ట్రెండింగ్ పాటలివే
మాధురి రాథోడ్ హిట్ సాంగ్స్ విత్ ఈశ్వర్ సాయి - రాతిరి రాతిరి రాతిరిలో, సీటీ చీర... ఫోక్ డ్యాన్సర్స్ ట్రెండింగ్ పాటలివే
Brahmanandam Brother Video: అన్నయ్యకు ఇల్లు కట్టించాడు... ఆడబిడ్డల పెళ్లిళ్లు చేశాడు... బ్రహ్మానందం గొప్పతనం చెప్పిన శ్రీవదన్
అన్నయ్యకు ఇల్లు కట్టించాడు... ఆడబిడ్డల పెళ్లిళ్లు చేశాడు... బ్రహ్మానందం గొప్పతనం చెప్పిన శ్రీవదన్
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Embed widget