అన్వేషించండి

The GOAT: 'ది గోట్'‌ ట్రైలర్‌ వచ్చేసింది - స్పైగా విజయ్‌,  డ్యుయెల్‌ రోల్లో యాక్షన్‌తో అదరగొట్టిన దళపతి! 

The GOAT Telugu Trailer: దళపతి విజయ్‌ మోస్ట్‌ అవైయిటెడ్‌ చిత్రం ది గోట్‌ (The GOAT) ట్రైలర్ తాజాగా విడుదలైంది. అవుట్‌ అండ్‌ అండ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ ట్రైలర్‌ అద్యాంతంగా ఆసక్తిగా సాగింది. 

The GOAT Official Telugu Trailer: కోలీవుడ్ స్టార్‌ హీరో దళపతి విజయ్‌ మోస్ట్‌ అవైయిటెడ్ చిత్రం 'ది గోట్‌'(ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). పాన్‌ ఇండియాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్‌ 5న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీం ప్రమోషన్స్ స్టార్‌ చేసింది. ఇప్పటికే మ్యూజికల్‌ ప్రమోషన్స్‌ పెద్ద ఎత్తున చేశారు. అలాగే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచార పోస్టర్స్‌, టీజర్‌కి విశేష స్పందన వచ్చింది. పాటలు కూడా బాగా ఆకట్టుకున్నాయి.

ఈ నేపథ్యంలో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో మూవీ తాజాగా ది గోట్‌ ట్రైలర్‌ రిలీజ్‌ చేసింది. ఇందులో విజయ్‌ డ్యుయెల్‌ రోల్లో కనిపించాడు. తండ్రికొడుకులుగా యాక్షన్‌ సన్నివేశాల్లో  అదరగొట్టారు. చూస్తుంటే విజయ్‌ ఇందులో స్పైగా కనిపిస్తున్నాడు. ఇక ఈ ట్రైలర్‌లోనే ప్రధాన పాత్రలను పరిచయం చేశారు. మొత్తం యాక్షన్‌తో సాగిన ట్రైలన్ ఆద్యాంత్యం ఆకట్టుకుంది. 

ట్రైలర్‌ ఎలా ఉందంటే

ప్రారంభం.. ఇప్పుడు అంటూ యాక్షన్‌ సీక్వెన్స్‌తో ట్రైలర్‌ మొదలైంది. ఇండియన్‌ రా ఎజెంట్‌కు విజయ్‌ లీడ్‌గా ఉంటారు. స్పైగా 68 ఇంటర్నేషనల్‌ ఆపరేషన్స్‌ని సక్సెస్‌ ఫుల్‌గా కంప్లీట్‌ చేసిన అనుభవం ఉన్న అతడిని కొత్త టీంకు లీడ్‌గా నిమిస్తున్నారంటూ విజయ్‌ రోల్‌ని పరిచయం చేస్తూ ట్రైలర్‌ సాగింది. ట్రైలర్ విజయ్ స్నేహితుడిగా జీన్స్‌ ఫేం ప్రశాంత్‌, ప్రముఖ కొరియోగ్రఫర్‌ ప్రశాంత్‌ కనిపించారు. సీరియస్‌ సాగుతున్న ట్రైలర్‌లో కాస్తా వినోదం జోడించారు. విజయ్‌తోనే అక్కడఅక్కడ ఫన్నీ డైలాగ్స్ చెప్పించారు. ఇక స్నేహా సీనియర్‌ విజయ్ భార్య పాత్రలో నటించిన తెలుస్తోంది.

పని పాట లేకుండా జులాయిగా తీరుగుతున్న తన భర్తకు ఇతర అమ్మాయిలతో సంబంధం ఉందేనేమో అని అనుమానిస్తుంది స్నేహా. అదే టైంలో విజయ్ ఇతర అమ్మాయిలతో సన్నిహితంగా ఉండటంతో పాటు హీరోయిన్ మీనాక్షితో లవ్‌ ట్రాక్‌ చూపించారు. ఇక తర్వాత స్పై ఆపరేషన్స్‌ అంటూ ట్రైలర్‌ను మళ్లీ సీరియస్‌ మోడ్‌లోకి తీసుకువెళ్లారు. సెకండాఫ్‌లో విజయ్‌ డ్యుయెల్‌ రోల్లో కనిపించాడు. తండ్రికొడుకులుగా ఇద్దరితో యాక్షన్ సీన్స్‌ చేయించాడు డైరెక్టర్. స్పై ఆపరేషన్‌లో భాగంగా రిస్క్‌లో ఉన్న తన తండ్రికి అండగా జూనియన్‌ విజయ్ ఉన్నట్టు ట్రైలర్‌లో చూపించారు.

ఇలా తండ్రికొడుకులుగా విజయ్‌ భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌లో చేస్తుంటారు. ఈక్రమంలో ఇద్దరు ఒకే బైక్‌పై వెళుతూ చేసిన యాక్షన్‌ సీన్ ట్రైలర్‌లో హైలెట్‌గా నిలిచింది. మొత్తానికి ఈ ట్రైలర్‌ ఫుల్‌ యాక్షన్‌తో ఆసక్తిగా సాగింది. ప్రస్తుతం ది గోట్‌ ట్రైలర్‌ మూవీపై అంచనాలు పెంచుతుంది. కాగా ఇందులో విజయ్‌ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించింది. ఇక ప్రభుదేవ, ప్రశాంత్‌, జయరామ్‌, స్నేహా, యోగిబాబు, వైభవ్, అజ్మల్‌ అమీర్‌, లైలా, ప్రేమి అమరేన్, వాసుదేవన్‌ వంటి నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. ఎజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై లిమిటెడ్పై కల్పాతి ఎస్ అఘోరమ్‌, కల్పాతి ఎస్‌ గణేష్‌,  కల్పాతి ఎస్‌ సురేష్‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్నారు. 

Also Read: ఒక్క వీడియోతో నెట్టింట సెన్సేషన్‌, కట్‌ చేస్తే ప్రభాస్‌-హను సినిమా హీరోయిన్‌ - ఇంతకి ఎవరీ ఇమాన్వీ!

టాప్ హెడ్ లైన్స్

Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
Jo Jo Movie: దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
Husharu Pittalu Review - 'హుషారు పిట్టలు' రివ్యూ: మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' రేంజ్‌లో... బోల్డ్ సినిమా ఎలా ఉందంటే?
'హుషారు పిట్టలు' రివ్యూ: మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' రేంజ్‌లో... బోల్డ్ సినిమా ఎలా ఉందంటే?
Varun Tej : మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో
మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget