
Vijay Sethupathi: కొన్నేళ్ల వరకు అలాంటి పాత్రలు చేయను, మానసిక ఒత్తిడి పెరిగిపోతోంది - విజయ్ సేతుపతి
Vijay Sethupathi Movies: హీరోగా మాత్రమే కాకుండా విలన్‌గా కూడా విజయ్ సేతుపతికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కానీ కొన్నేళ్ల వరకు విలన్ పాత్రలు చేయనంటూ షాకింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు ఈ నటుడు.

Vijay Sethupathi: కేవలం హీరోలుగా మాత్రమే కాకుండా విలన్స్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా తమ వందశాతం ఇస్తూ.. ప్రేక్షకులను అలరించే నటీనటులు కొంతమంది మాత్రమే ఉంటారు. ఇక ఈతరంలో అలాంటి నటులు ఎవరు అంటే కేవలం కొందరి పేర్లు మాత్రమే వినిపిస్తుంటాయి. అందులో కచ్చితంగా ఉండే పేరు విజయ్ సేతుపతి. ముందుగా బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్టుగా తన కెరీర్‌ను ప్రారంభించిన విజయ్ సేతుపతి.. మెల్లగా హీరోగా అవకాశాలు దక్కించుకున్నాడు. తన నటనకు ఫిదా అయిపోయిన దర్శక నిర్మాతలు మెల్లగా తనకు విలన్స్ రోల్స్ కూడా ఆఫర్ చేయడం మొదలుపెట్టారు. అయితే కొన్నాళ్ల వరకు ఇక విలన్‌గా చేయను అంటూ షాకింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు సేతుపతి. అంతే కాకుండా దాని వెనుక ఉన్న కారణాన్ని కూడా బయటపెట్టాడు.
హీరో అడగడం వల్లే..
కేవలం హీరోగా మాత్రమే కాదు.. ఏ పాత్ర ఇచ్చినా విజయ్ సేతుపతి.. తన నటనతో మిగతా యాక్టర్లను డామినేట్ చేస్తాడు. అయితే విలన్ పాత్రలు చేయడంలో తనకు అదే చిక్కులు తెచ్చిపెడుతోందని ఈ నటుడు బయటపెట్టాడు. ఇటీవల గోవాలో జరిగిన 54వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో పాల్గొన్న విజయ్ సేతుపతి.. తాను ఇకపై విలన్ రోల్స్ చేయనని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. విలన్ పాత్రలు చేయడం వల్ల తనకు ఒత్తిడి ఎక్కువవుతుందని అన్నాడు. హీరోనే స్వయంగా తనను అడగడం వల్ల విలన్ పాత్ర చేయడానికి ఒప్పుకోవాల్సి వచ్చిందని బయటపెట్టాడు. కానీ ఆ హీరో ఎవరు అని మాత్రం చెప్పలేదు.
కొన్నేళ్ల వరకు ఇంతే..
‘‘వారంతా నాపై ఒక విధమైన మానసిక ఒత్తిడిని తీసుకొస్తున్నారు. అది ఎదుర్కోవడం నాకు ఇష్టం లేదు. నేను విలన్ పాత్రలు పోషిస్తున్నప్పుడు నాకేమీ చెడుగా అనిపించలేడం లేదు కానీ అదే సమయంలో నాకంటూ చాలా పరిమితులు ఉంటున్నాయి. హీరోకు మించి చేయకూడదు అంటూ నన్ను చాలా కంట్రోల్ చేస్తున్నారు. పైగా కొన్ని ఎడిటింగ్‌లో కూడా పోతున్నాయి’’ అని విజయ్ సేతుపతి ముక్కుసూటిగా నిజాన్ని బయటపెట్టాడు. ‘‘ అలాంటి పాత్రలు చేయాలా వద్దా అని నాలో నాకు అయోమయం, ఆందోళన మొదలయ్యింది. అందుకే కనీసం కొన్నేళ్ల వరకు విలన్‌లాగా చేయకూడదని నిర్ణయించుకున్నాను. నేను విలన్‌లాగా చేయను అనగానే కనీసం స్క్రిప్ట్ అయినా వినమని అంటున్నారు. అక్కడే సమస్య మొదలవుతుంది’’ అని తన నిర్ణయాన్ని చెప్పేశాడు.
జాగ్రత్తగా ఉండాలి..
ఒక పాత్రను చేసే ముందు విజయ్ సేతుపతి.. దానికోసం ఎలా సిద్దమవుతాడు అనే విషయాన్ని కూడా ప్రేక్షకులతో షేర్ చేసుకున్నాడు. ‘‘మనం ఎవరితో మాట్లాడుతున్నాం, ఎవరితో ఇంటరాక్ట్ అవుతున్నాం అనేదానిపై ఆధారపడి ఉంటుంది. మనకు ఎంత జ్ఞానం ఉన్నా.. నలుగురితో కలిసినప్పుడు అది బయటపడుతుంది. నేను సినిమాల్లో ప్రయత్నాలు మొదలుపెట్టినప్పుడు నా చుట్టూ చాలామంది మేధావులు ఉండేవారు. కానీ ఎవరితో ఇంటరాక్ట్ అవుతున్నామనే విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కొందరు తమ నిర్ణయాలను మీ మెదడులోకి ఎక్కిస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. నాకు డైరెక్టర్స్‌పై కాదు.. సినిమాలపై ఆసక్తి ఉంది’’ అంటూ తన అభిమానులకు సలహాలు కూడా ఇచ్చాడు విజయ్ సేతుపతి.
Also Read: కోర్టులో మన్సూర్ అలీ ఖాన్‌కు ఎదురుదెబ్బ - ముందస్తు బెయిల్ తిరస్కరణ
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

