Vijay Deverakonda Rashmika: మళ్ళీ జంటగా దొరికేసిన విజయ్ దేవరకొండ - రష్మిక... ముంబై ఎయిర్ పోర్ట్ నుంచి సేమ్ కారులో!
లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ రష్మిక మరొకసారి జంటగా దొరికేశారు. ముంబై ఎయిర్ పోర్ట్ అందుకు కారణం అయ్యింది. అసలు వివరాల్లోకి వెళితే...

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) ప్రేమలో ఉన్నారనేది ఓపెన్ సీక్రెట్ అని టాలీవుడ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినపడతాయి. తాను ప్రేమలో ఉన్నామని వాళ్ళిద్దరూ ఎప్పుడూ అంగీకరించలేదు. అలాగని ఖండించనూ లేదు. విదేశాలకు విహార యాత్రలకు కలిసి వెళ్లడం... ఇద్దరి ఫోటోల్లో వెనుక లొకేషన్ సేమ్ ఉండడం... వాటిని నెటిజనులు పాయింట్ అవుట్ చేయడం తరచూ సోషల్ మీడియాలో జరిగే వ్యవహారం. అయితే ఇప్పుడు సేమ్ లొకేషన్ కాదు... ఇద్దరు సేమ్ కారులో దొరికారు.
ముంబై ఎయిర్ పోర్ట్ నుంచి ఒకే కారులో...
హైదరాబాద్ సిటీలో 'కుబేర' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్, ఆ తర్వాత ప్రమోషన్స్ పూర్తి చేసుకున్న రష్మిక ముంబై వెళ్లారు. ఆమెతో పాటు విజయ్ దేవరకొండ కూడా ముంబై వెళ్లారు. ఫ్లైట్ దిగిన తర్వాత ఎయిర్ పోర్ట్ బయటకు వచ్చి ఇద్దరూ ఒకే కారులో కలిసి వెళ్లారు. విజువల్స్ కెమెరా కంటిలో రికార్డు అయ్యాయి. ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇటీవల కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ నుంచి ఏం కాపీ చేస్తారని అడిగితే 'ఎవ్రీథింగ్' (అంటే నా సర్వస్వం) అని రష్మిక చెప్పింది. విజయ్ దేవరకొండ కూడా రష్మిక గురించి ఎప్పుడు అడిగినా ముసిముసి నవ్వుల నవ్వుతూ మంచి విషయాలు చెప్తారు. వీళ్ళిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని టాలీవుడ్ టాక్.
View this post on Instagram
బ్యాక్ టు బ్యాక్ సక్సెస్‌లు... ఫుల్ జోష్!
బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రస్తుతం రష్మిక హవా నడుస్తోంది. ఆవిడ నటించిన సినిమాలు భారీ విజయాలు సాధిస్తున్నాయి. 'యానిమల్', 'పుష్ప 2 ది రూల్', 'ఛావా'... మూడు సినిమాలు వెయ్యి కోట్ల రూపాయల కంటే ఎక్కువ వసూలు చేశాయి. ఇటీవల 'కుబేర' ముంబై ప్రెస్‌మీట్‌లో 1000 కోట్ల తాను లేనని రష్మిక మాత్రం మూడు వేల కోట్ల క్లబ్బులో నాగార్జున సరదాగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆవిడ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇక విజయ్ దేవరకొండ జూలై 25న 'కింగ్డమ్' విడుదల కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ సినిమా భారీ సక్సెస్ సాధిస్తుందని ఆయన ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.
Also Read: పవన్ సినిమాలకు సోలో రిలీజ్ దక్కకుండా చేస్తున్నారా? ఛాంబర్ ఎందుకు సైలెంట్‌గా ఉంటోంది?





















