Kingdom Trailer: యుద్ధం ఇప్పుడే మొదలైంది - విజయ్ దేవరకొండ మాస్ 'కింగ్‌డమ్' ట్రైలర్ వచ్చేసింది
Kingdom Trailer Out: విజయ్ దేవరకొండ మాస్ సంభవం వచ్చేసింది. ఆయన లేటెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'కింగ్‌డమ్' ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేసింది మూవీ టీం.

Vijay Deverakonda's Kingdom Movie Trailer Out: యంగ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా వస్తోన్న అవెయిటెడ్ మూవీ 'కింగ్‌డమ్'. ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న స్పై యాక్షన్ థ్రిల్లర్ ట్రైలర్‌ను మూవీ టీం రిలీజ్ చేసింది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్ ట్రెండింగ్‌లో నిలవగా... ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది.
ట్రైలర్ ఎలా ఉందంటే?
ఇదివరకు ఎన్నడూ లేని విధంగా ఓ డిఫరెంట్ రోల్, రగ్డ్ మాస్ లుక్‌లో విజయ్ దేవరకొండ అదరగొట్టారు. హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌లో పవర్ ఫుల్ డైలాగ్స్‌తో గూస్ బంప్స్ తెప్పించారు విజయ్. మూవీలో ఆయన గూఢచారిగా కనిపించనున్నారు. గ్యాంగ్ స్టర్ డ్రామాకు అన్నదమ్ముల సెంటిమెంట్ జోడించారు.
ఓ ఎమర్జెన్సీ ఆపరేషన్ కోసం అండర్ కవర్ స్పైగా విజయ్ దేవరకొండ మారడంతో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. 'నీ ఫ్యామిలీ, అమ్మ, నాన్న, అందరినీ వదిలేయాలి. నువ్వు అడుగుపెట్టబోయే ప్రపంచం, నువ్వు కలవబోయే మనుషులు, నువ్వు ఎదుర్కోబోయే పరిస్థితులు. చాలా రిస్కీ ఆపరేషన్ సూరి.' అంటూ చెప్పే డైలాగ్ భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. ఓ సాధారణ కానిస్టేబుల్ అండర్ కవర్ స్పైగా వెళ్లగా... ఆ గ్యాంగ్‌కు లీడర్ అతని అన్నే ఉంటాడని ట్రైలర్‌ను బట్టి అర్థమవుతోంది.
#KingdomTrailer - https://t.co/70qPfhfDyA
— Vijay Deverakonda (@TheDeverakonda) July 26, 2025
We built #Kingdom with fire in our hearts.
A @gowtam19 action drama
With An @anirudhofficial Score.
Today, I give you the trailer.
Let it hit you like it hit me.
Love,
Vijay. pic.twitter.com/mFMXwudqGn
విజయ్ దేవరకొండ ఓ సాధారణ కానిస్టేబుల్ నుంచి స్పై ఆఫీసర్‌గా ఎలా వెళ్లాడు. అతను ఎంతగానో ప్రేమించే అన్న క్రిమినల్, గ్యాంగ్ స్టర్, స్మగ్లర్‌గా ఎందుకు మారాడు? అన్న కోసం తమ్ముడు ఏం చేశాడు? అసలు ఆ ఎమర్జెన్సీ ఆపరేషన్ ఏంటి?, స్పైగా జైల్లో ఖైదీలా మగ్గుతూ సేకరించిన సమాచారం ఏంటి? అతని అన్నకు శత్రువులా ఎలా మారాడు? అసలు విజయ్ పోలీస్ కానిస్టేబులా? లేక ఆర్మీ ఆఫీసరా? అనేది తెలియాలంటే మూవీ రిలీజ్ వరకూ ఆగాల్సిందే. ట్రైలర్‌లో విజయ్ దేవరకొండ మాస్ లుక్ అదిరిపోయింది. యాక్షన్, ఫైట్ సీన్స్ వేరే లెవల్‌లో ఉన్నాయి. ఒక్క ట్రైలర్‌తోనే మూవీపై అంచనాలు పదింతలు పెంచేశారు.
ఈ మూవీకి 'మళ్లీ రావా', 'జెర్సీ' సినిమాల ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తుండగా... విజయ్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్నారు. విజయ్ అన్నయ్యగా సత్యదేవ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అనిరుథ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తుండగా... ఈ నెల 31న తెలుగుతో పాటు భారతీయ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు.
Also Read: నారా రోహిత్ 'సుందరకాండ' ఓటీటీ డీల్ ఫిక్స్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?






















