Vijay Deverakonda: బన్నీకి చేరువలో విజయ్ దేవరకొండ - మహేష్, ప్రభాస్‌లను దాటేసి కొత్త రికార్డ్
విజయ్ దేవరకొండ సినిమాలు విడుదలై రెండేళ్లు కావస్తున్నా.. క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఆ విషయంలో మహేష్, ప్రభాస్‌లనే మించిపోయాడు. అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.
![Vijay Deverakonda: బన్నీకి చేరువలో విజయ్ దేవరకొండ - మహేష్, ప్రభాస్‌లను దాటేసి కొత్త రికార్డ్ Vijay Deverakonda Becomes Fastest South Indian Actor To Cross 15 Million On Instagram Vijay Deverakonda: బన్నీకి చేరువలో విజయ్ దేవరకొండ - మహేష్, ప్రభాస్‌లను దాటేసి కొత్త రికార్డ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/15/50320d82d05e9ea899b0937358fd52dc_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Vijay Deverakonda | విజయ్ దేవరకొండ.. ఈ యువ హీరోకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో మీకు తెలిసిందే. ఇటీవల విజయ్ సినిమాలేవీ రిలీజ్ కాలేదు. సుమారు రెండేళ్లు గ్యా్ప్ తీసుకున్న రౌడీ హీరో.. పూరీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లైగర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అయితే, సినిమాలు విడుదల కాకున్నా.. విజయ్ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులను సైతం ఆశ్చర్యపోయేలా ఫాలోయింగ్ పెంచుకున్నాడు. ఇదే ఊపు కొనసాగితే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను సైతం దాటేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఇంతకీ ఏమిటా రికార్డ్ అనేగా మీ సందేహం?
ఇప్పుడు మన సౌత్ ఇండియా హీరోలకు దేశవ్యాప్తంగా మాంచి క్రేజ్ లభిస్తోంది. ప్రభాస్, అల్లు అర్జున్‌లకు ఇప్పటికే మాంచి పేరు వచ్చింది. RRR మూవీ విడుదలతో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌కు కూడా బాలీవుడ్‌లో మాంచి ఫాలోయింగ్ లభిస్తోంది. ఈ విషయంలో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్‌లు ఇంకా పుంజుకోవల్సి ఉంది. వీరి చిత్రాలు కూడా పాన్ ఇండియాగా రిలీజైతే.. టాలీవుడ్, బాలీవుడ్‌ను మించేస్తుంది. అయితే, ప్రస్తుతం ఎలాంటి పాన్ ఇమేజ్ లేకుండా సోషల్ మీడియాలో దూసుకెళ్తున్న ఏకైక హీరో విజయ్ దేవరకొండ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే.. ఈ రెండేళ్లలో సినిమాలు లేకపోయినా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్లను మాత్రం బాగా పెంచుకోగలిగాడు.
ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన ఫాస్టెస్ సౌత్ ఇండియన్ హీరోగా విజయ్ దేవరకొండకు గుర్తింపు వచ్చింది. ఇందుకు కారణం.. ఇన్‌స్టాలో అతడికి అకస్మాత్తుగా పెరిగిన ఫాలోవర్లే. మహేష్ బాబుకు ఇన్‌స్టాగ్రామ్‌లో 8.1 మిలియన్, ప్రభాస్‌కు 8.3 మిలియన్ ఫాలోవర్లు ఉన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్‌లో అందరి హీరోల కంటే ఎక్కువ ఫాలోవర్లు అల్లు అర్జున్‌కే ఉన్నారు. బుధవారం బన్నీ కూడా రికార్డు స్థాయిలో 18 మిలియన్ మంది ఫాలోవర్లకు చేరుకున్నాడు. ఈ సందర్భంగా బన్నీ ఫాలోవర్లకు ధన్యవాదాలు తెలిపాడు.
Also Read:'బీస్ట్' రివ్యూ: సినిమా ఎలా ఉందంటే?
View this post on Instagram
ఇక విజయ్ దేవర కొండ 15 మిలియన్ ఫాలోవర్లతో అల్లు అర్జున్ తర్వాతి స్థానంలో ఉన్నాడు. త్వరలో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతున్న ‘లైగర్’ తర్వాత ఫాలోవర్లు మరింత పెరిగే అవకాశాలున్నాయి. విజయ్ దేవర కొండకు ‘అర్జున్ రెడ్డి’ మంచి గుర్తింపు తెచ్చింది. ‘గీతా గోవిందం’ సినిమా కూడా మాంచి హిట్ ఇచ్చింది. ‘డియర్ కామ్రెడ్’ సినిమా తర్వాత విజయ్ అతిథి పాత్రలకే పరిమితమయ్యాడు. నిర్మాతగా కూడా మారాడు. ప్రస్తుతం విజయ్ ‘లైగర్’ మీదే ఆశలు పెట్టుకున్నాడు. మరి, ఇన్నాళ్ల విరామం తర్వాత వస్తున్న ఈ చిత్రం విజయ్‌కు విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలి.
Also Read: ఇంతకీ ఇల్లు ఎవరిది? శ్రీదేవిదా - శోభన్ బాబుదా!?
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)