అన్వేషించండి

Ranabaali Leaks : రణబాలి వీడియో లీక్ - సీమ యాసలో విజయ్ దేవరకొండ డైలాగ్స్... ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే

Ranabaali Movie : విజయ్ దేవరకొండ పీరియాడికల్ యాక్షన్ డ్రామా రణబాలి షూటింగ్ సెట్ నుంచి ఓ వీడియో లీక్ అయ్యింది. ఇలాంటి లీక్స్ వల్ల సస్పెన్స్, థ్రిల్ మిస్ అవుతుందంటూ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

Vijay Deverakonda's Ranabaali Action Sequence Leaked : టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక జంటగా నటిస్తోన్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'రణబాలి'. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం రాయలసీమ ప్రాంతంలో జరుగుతోంది. తాజాగా ఈ మూవీ నుంచి ఓ యాక్షన్ సీక్వెన్స్ లీక్ అయ్యింది. 

రాయలసీమ యాసలో...

రీసెంట్‌గా ఏపీలోని అనంతపురం ప్రాంతంలో, అలాగే, కర్నూలులోని బనగానపల్లె మండలం కటికవానికుంట గ్రామంలో 'రణబాలి' (Ranabaali) షూటింగ్ జరిగింది. ఈ సందర్భంగా విజయ్‌పై ఓ యాక్షన్ సీక్వెన్స్‌పై షూట్ చేయగా ఆ వీడియో లీకైంది. ఇందులో రాయలసీమ యాసలో విజయ్ దేవరకొండ డైలాగ్స్ అదిరిపోయాయి. గుర్రంపై చేతిలో కొడవలితో పవర్ ఫుల్‌గా ఆయన చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. శత్రువులను ఊచకోత కోస్తూ... 'ము*** మోపి నా కొడకా.... ఏడున్నావ్ రా... నీ ఇంటికి వచ్చినా రా అప్పా సంపుదువ్ గానీ...' అంటూ రాయలసీమ యాస డైలాగ్స్ హైప్ క్రియేట్ చేస్తున్నాయి.

ఈ లీక్డ్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. విజయ్ దేవరకొండ లుక్స్, డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నా సీన్ లీక్ కావడంపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కీలక సీన్స్ ముందే బయటకు వస్తే సస్పెన్స్, థ్రిల్ మిస్ అవుతుందని కామెంట్స్ చేస్తున్నారు. మూవీ టీం ఇలాంటి వాటి పట్ల అలర్ట్‌గా ఉండాలని సూచిస్తున్నారు. మరోవైపు, ఈ వీడియో సదరు మూవీ టీమే కావాలని లీక్ చేస్తుందంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై టీం రియాక్ట్ కావాల్సి ఉంది.

Also Read : మన రామయ్య వచ్చేశాడు - శ్రీరాముడుగా రణబీర్ కపూర్ లుక్ చూశారా!

ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన లుక్స్ అదిరిపోయాయి. రణబాలిగా విజయ్ దేవరకొండ, అతని భార్య జయమ్మగా రష్మిక (Rashmika) నటిస్తున్నారు. రీసెంట్ వీరి వెడ్డింగ్ సందర్భంగా 'ఏందయ్యా సామీ' అంటూ సినిమాలో పెళ్లి వీడియో రిలీజ్ చేయగా ట్రెండ్ అవుతోంది. గంభీరమైన లుక్‌లో విజయ్, అమాయకంగా ఉన్నట్లు రష్మిక లుక్ అదిరిపోయింది.

విజయ్ దేవరకొండ, రష్మికలకు ఇది మూడో మూవీ. అంతకు ముందు వచ్చిన గీత గోవిందం, డియర్ కామ్రేడ్ మంచి సక్సెస్ అందుకున్నాయి. ఇక డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్‌తో విజయ్‌కు ఇది రెండో మూవీ. ఇదివరకు వీరి కాంబోలో వచ్చిన టాక్సీవాలా విజయం సాధించింది. బ్రిటిష్ కాలం నాటి పరిస్థితులు, ఆకలి చావులు, రాయలసీమలో తన వారిని కాపాడుకునేందుకు వారియర్ రణబాలి ఏం చేశాడు? అనేదే బ్యాక్ డ్రాప్‌గా మూవీ తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. 1854 - 1878 మధ్య కాలంలో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా రూపొందించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. వరల్డ్ వైడ్‌గా సెప్టెంబర్ 11న ఈ సినిమా రిలీజ్ కానుంది. 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Brahmanandam Brother Sri Vadan: అన్నయ్యను పట్టించుకోని బ్రహ్మానందం... తమ్ముడి పిలుపు కోసం శ్రీవదన్ ఆవేదన... వీడియో వైరల్
అన్నయ్యను పట్టించుకోని బ్రహ్మానందం... తమ్ముడి పిలుపు కోసం శ్రీవదన్ ఆవేదన... వీడియో వైరల్
Bigg Boss Agnipariksha 2: 'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?
'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?
Nandamuri Mokshagna: ప్రశాంత్ వర్మ కాదు... మరో దర్శకుడితో నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ
ప్రశాంత్ వర్మ కాదు... మరో దర్శకుడితో నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
Embed widget