అన్వేషించండి

Family Star Second Song: విజయ్‌, మృణాల్ పెళ్లి సందడిగా 'కళ్యాణి వచ్చా వచ్చా' - ఫ్యామిలీ స్టార్‌ సెకండ్‌ సింగిల్‌ చూశారా?

Watch Kalyani Vaccha Vacchaa song from Family Star: విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్'లో రెండో సాంగ్ 'కల్యాణి వచ్చా వచ్చా' పాట విడుదలైంది. హీరోహీరోయిన్ల పెళ్లి సందడిగా సాగిన ఈపాట బాగా ఆకట్టుకుంటుంది. 

Vijay Devarakonda Family Star Second Single Out: 'రౌడీ' హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఫ్యామిలీ స్టార్' (Famil Star Movie). ఇందులో 'సీతా రామం' ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్. తనకు తొలి వంద కోట్ల సినిమా, 'గీత గోవిందం' వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన పరశురామ్ పెట్ల దర్శకత్వంలో రెండోసారి విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న చిత్రమిది. దీంతో ది ఫ్యామిలీ స్టార్‌పై మూవీ అంచాలు నెలకొన్నాయి. మరోవైపు ఈ మూవీ నుంచి వస్తున్న అప్‌డేట్స్‌, ప్రచార పోస్టర్స్‌, సాంగ్స్‌, టీజర్‌ మరింత హైప్‌ క్రియేట్‌ చేశాయి.

ఏప్రిల్‌ 5న మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్‌ను వేగవంతం చేసిన మూవీ టీం నేడు ఫ్యామిలీ స్టార్‌ సెకండ్‌ సింగిల్‌ పేరుతో రెండో పాటను వదిలింది మూవీ టీం. కల్యాణి వచ్చా వచ్చా పంచ కల్యాణి తెచ్చా తెచ్చా..సింగారీ చెయ్యందించా అంటూ సాగే ఈ పాట అంటూ పెళ్లి సందడిని రెట్టింపు చేసేలా సాగిందీ పాట. చూస్తుంటే ఫ్యామిలీ స్టార్‌లో ఈ పాట కలర్ ఫుల్ గా ఉండబోతోందని అర్థమవుతుంది.   వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సందర్భంగా వచ్చే ఈ పాటకు అనంత శ్రీరామ్ క్యాచీ లిరిక్స్ అందించగా. మంగ్లి, కార్తీక్ ఎనర్జిటిక్ గా పాడారు. గోపీ సుందర్ కొరియోగ్రఫి అందించిన ఈ పాటలో విజయ్, మృణాల్ మేకోవర్, అప్పీయరెన్స్, కెమిస్ట్రీ బాగా ఆకట్టుకుంది. 

Family Star 2nd single Kalyani Vaccha Vaccha song Release: విజయ్ దేవరకొండ, పరశురామ్ కలయికలోని 'గీత గోవిందం'కు సూపర్ హిట్ ఆల్బమ్ అందించిన గోపీసుందర్ ఈ సినిమాకు సైతం సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాత 'దిల్' రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలో రూపొందుతున్న 54వ చిత్రమిది. హీరో విజయ్ దేవరకొండకు 13వ సినిమా. 'దిల్' రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఆల్రెడీ 'నందనాన...' సాంగ్ విడుదల చేయగా... సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు కళ్యాణి వచ్చా వచ్చా అంటూ ఫ్యామిలీ స్టార్‌ పెళ్లి సందడి చూపించి ఆడియన్స్‌ మరింత ఆకట్టుకున్నారు. ఈ పాటకు యూట్యూబ్‌లో మంచి రెస్పాన్స్‌ వస్తుంది. విడుదలైన కొద్ది క్షణాల్లోనే ఈ సాంగ్‌ సర్‌ప్రైజింగ్‌ వ్యూస్‌ వచ్చాయి. 

Also Read: ట్విస్ట్‌ ఇచ్చిన ఫరియా - నరేష్‌ పెళ్లి తంటాలు, నవ్విస్తున్న 'ఆ ఒక్కటి అడక్కు' టీజర్‌

ఏప్రిల్ 5న రిలీజ్

"ఫ్యామిలీ స్టార్" సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 5న 'ఫ్యామిలీ స్టార్' తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. తొలుత ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే... నాలుగైదు సినిమాలు ఉండటంతో వాయిదా వేశారు. దానివల్ల మంచి జరిగింది. ఎన్టీఆర్ 'దేవర' వాయిదా పడటంతో ఏప్రిల్ 5న వస్తోంది. 'ఫ్యామిలీ స్టార్'లో 'మజిలీ', 'రామారావు ఆన్ డ్యూటీ', 'మైఖేల్' సినిమాల ఫేమ్ దివ్యాంశ కౌశిక్ మరో కథానాయికగా నటిస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Sowcar Janaki Career : 400కు పైగా సినిమాలు... పర్సనల్ లైఫ్‌లో అవమానాలు - షావుకారు జానకి సినీ కెరీర్, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలుసా?
400కు పైగా సినిమాలు... పర్సనల్ లైఫ్‌లో అవమానాలు - షావుకారు జానకి సినీ కెరీర్, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలుసా?
Sowcar Janaki : సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత - సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి
సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత - సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి
Revenge Thriller OTT : తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
పిల్లాడిలా పేరెంట్స్‌తో మధ్య పడుకున్న విజయదేవరకొండ.. ఫోటో తీసిన Rashmika Mandanna
పిల్లాడిలా పేరెంట్స్‌తో మధ్య పడుకున్న విజయదేవరకొండ.. ఫోటో తీసిన Rashmika Mandanna

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Arpitha Mohithe: తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Embed widget