Vicky Kaushal: ‘తోబా తోబా’ డ్యాన్స్‌తో అదరగొట్టిన మహిళ, ఆ కష్టమైన స్టెప్పును ఈజీగా వేసేసింది - హీరో విక్కీ కౌశల్ ఫిదా!
Vicky Kaushal: ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండింగ్ పాట తోబా తోబా. ఇన్ స్టా, ఫేస్ బుక్, యూట్యూబ్ అన్నిట్లో ఇదే పాట. దీనిపైన రీల్స్. అయితే, ఇప్పుడు ఒక రీల్ కి హీరో విక్కీ కౌశల్ ఫిదా అయ్యాడు.
Vicky Kaushal goes ‘wow’ at viral content creator's moves on Tauba Tauba : సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది ట్రెండింగ్ అవుతదో తెలీదు. ఎప్పుడు ఎవరు ఫేమస్ అవుతారో అర్థం కాదు. ఇక ఈ మధ్యకాలంలో వస్తున్న పాటలు కూడా ఇన్ స్టా రీల్స్ కి తగ్గట్లుగా వస్తున్నాయనే చెప్పాలి. ప్రతి పాటలో ఒక హుక్ స్టెప్ కంపల్సరీ అయిపోయింది. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో పాపులర్ అయిన పాట తోబా తోబా. విక్కీ కౌశల్ నటించిన ‘బ్యాడ్ న్యూజ్’ (Bad Newz) సినిమాలోని ఈ పాట విపరీతంగా ట్రెండ్ అవుతుంది. ఇన్ స్టా తెరిస్తే చాలు దీని మీదే రీల్స్. ఇక ఇప్పుడు ఒక మహిళ చేసిన వీడియో వీక్కీ కౌశల్ దృష్టిని ఆకర్షించింది. ఆయన్ను ఫిదా చేసింది. దీంతో విక్కీ ‘‘వావ్..’’ అంటూ ఆ వీడియోపై కామెంట్ చేయడంతో ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతుంది.
రూపాలీ సింగ్ అనే మహిళ రీల్స్ చేస్తుంటారు. అద్భుతంగా డ్యాన్స్ చేస్తూ పాపులారిటీ సంపాదించారు. తాజా ట్రెండ్‌ను ఫాలో అవుతూ ఆమె కూడా ‘‘తోబా తోబా’’ పాటకి డ్యాన్స్ చేసింది. సినిమాలో ఆ పాటకు విక్కీ కౌశల్ వేసిన కష్టమైన స్టెప్‌ను ఆమె ఎంతో ఈజీగా వేసేసింది. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా వైరల్ అవుతోంది. దీంతో ఆ వీడియో హీరో విక్కీ కౌశల్‌కు కూడా చేరింది. దీంతో విక్కీ ‘‘వావ్’’ అంటూ కామెంట్ పెట్టారు. నెటిజన్లు సైతం సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా.. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతుంది. ఆ మహిళ మాత్రమే కాదు.. తన కొడుకులు ఇద్దరూ కూడా ఆమెతో కలిసి డ్యాన్స్ చేశారు. ఆ ఇద్దరు కూడా ఇరగదీశారు అంటూ కామెంట్లు పెట్టి ఆ వీడియోని తెగ వైరల్ చేస్తున్నారు.
View this post on Instagram
ఇక ఈ ‘‘తోబా తోబా’’ పాటను పాపులర్ పంజాబి పాప్ సింగర్ కరన్ అజుల్హానే రాసి, కంపోజ్ చేసి పాడారు. చాలా తక్కువ టైంలో ఎన్నో కోట్ల మంది ఈ పాటకు ఫ్యాన్స్ అయిపోయారు. ఇక ఈ పాటకి బాస్కో మార్టిస్ కొరియోగ్రఫి చేశారు. ఈ పాటకి విక్కీ, తృప్తి ధిమ్రీ ఇద్దరు కాలు కదిపారు.
'బ్యాడ్ న్యూస్' సినిమాకి ఆనంద్ తివారీ డైరెక్టర్. 2018లో ఆనంద్, విక్కీ కాంబినేషన్ లో వచ్చిన సినిమా 'లవ్ పర్ స్క్వేర్ ఫూట్' అప్పట్లో బాగానే కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఇప్పుడు అదే మ్యాజిక్ రిపీట్ అయ్యింది. ఈ సినిమాకి అమ్రిత్ పాల్ సింగ్ బిందార్, అపూర్వ మెహత, కరణ్ జోహార్ ప్రొడ్యూసర్లు. ఈ సినిమాలో ఆమీ వ్రిక్, నేహా దుపియా ప్రధాన పాత్రలు పోషించారు. రేర్ కామెడీ సినిమా జోనర్ లో, నిజ జీవితం ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. సినిమాలో కవలలకు అమ్మ ఒకటే, ఇద్దరు తండ్రులు అనే కాన్సెప్ట్ తో తెరకెక్కించారు.
Also Read: ఈ వారం థియేటర్ - ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే!