News
News
వీడియోలు ఆటలు
X

Venkatesh's Saindhav : విశాఖలో వెంకీ మామ - పోర్టు ఏరియాలో ఫైటింగ్ షురూ!?

Saindhav Movie Update : వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియా సినిమా 'సైంధవ్'. సినిమా యూనిట్ ప్రస్తుతం విశాఖలో ఉంది. 

FOLLOW US: 
Share:

'రానా నాయుడు' వెబ్ సిరీస్ (Rana Naidu Web Series)తో ఓటీటీ వీక్షకులకు కొన్ని  రోజుల క్రితం విక్టరీ వెంకటేష్ (Venkatesh) పలకరించారు. ఫ్యామిలీ ఇమేజ్ పక్కన పెట్టి కొత్త క్యారెక్టర్ చేశారు. ఇప్పుడు ఆయన పాన్ ఇండియా సినిమా 'సైంధవ్' మీద ఫుల్ కాన్సంట్రేట్ చేశారు.

విశాఖలో వెంకీ మామ 'సైంధవ్' 
వెంకటేష్ కథానాయకుడిగా 'హిట్' ఫ్రాంచైజీ దర్శకుడు శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియా సినిమా 'సైంధవ్' (Saindhav Movie). ఉగాది తర్వాత రోజున రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశారు. ఇటీవల ఆ షెడ్యూల్ ముగిసింది. ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కించడంతో పాటు ఓ భారీ ఫైట్ కూడా తీశారు. 

హైదరాబాదులో ఫస్ట్ షెడ్యూల్ ముగించుకున్న 'సైంధవ్' చిత్ర బృందం... రెండు మూడు రోజులు విశ్రాంతి తీసుకుని విశాఖ వెళ్లారు. ఇప్పుడు ఏపీలో రెండో షెడ్యూల్ స్టార్ట్ చేశారు. పోర్టు ఏరియాలో ఫైట్ సీక్వెన్స్ తీయడానికి ప్లాన్ చేసినట్టు తెలిసింది. 'సైంధవ్' సినిమా ప్రారంభించినప్పుడు విడుదల చేసిన టీజర్ చూస్తే... పోర్ట్ నేపథ్యంలో కంటెయినర్స్ దగ్గర ఫైట్ ఉంటుందని అర్థం అవుతోంది. 

డిసెంబర్ 22న పాన్ ఇండియా రిలీజ్
నిహారికా ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వెంకట్ బోయినపల్లి భారీ స్థాయిలో 'సైంధవ్' సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో డిసెంబర్ 22న సినిమాను విడుదల చేయనున్నట్లు కొన్ని రోజుల క్రితం వెల్లడించారు.

Also Read : మొగుళ్ళు బాధలే 'సేవ్ ద టైగర్స్' - 'భార్యల నుంచి కాపాడుకుందాం' అంటున్న ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ

'సైంధవ్'లో రుహానీ శర్మ
'సైంధవ్' మాస్ అండ్ స్టైలిష్ యాక్షన్ ఫిల్మ్ అని అర్థం అవుతోంది. వెంకటేష్ 75వ చిత్రమిది. ఫస్ట్ లుక్ చూస్తే... ఆయన రగ్గడ్ లుక్, ఇంటెన్సిటీ బావున్నాయి. ఈ సినిమాలో రుహానీ శర్మకు కీలక పాత్ర దక్కింది. శైలేష్ కొలను తెరకెక్కించిన తొలి సినిమా 'హిట్ : ది ఫస్ట్ కేస్'లో ఆమె నటించారు. ఆ పాత్రకు మంచి పేరు వచ్చింది. రుహానీకి మరోసారి శైలేష్ అవకాశం ఇచ్చారు. ఈ 'సైంధవ్'లో ఆమెది కథానాయిక పాత్ర కాదని తెలిసింది. గ్లామర్ కంటే నటనకు ఎక్కువ ఆస్కారం ఉన్న పాత్ర అట!బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ కీలక పాత్ర చేస్తున్నారు. ఆయనకు తొలి తెలుగు చిత్రమిది. 

గత కొన్నేళ్ళుగా ప్రతి సినిమాలోనూ వెంకటేష్ దాదాపు ఒకే తరహా లుక్ మైంటైన్ చేస్తున్నారు. మధ్యలో సాల్ట్ అండ్ పెప్పర్ స్టైల్ లో కనిపించినా... చాలా రోజులుగా హెయిర్ స్టైల్ చేంజ్ చేయలేదు. 'సైంధవ్' కోసం ఆయన హెయిర్ స్టైల్ చేంజ్ చేసినట్టు ఈ లుక్ చూస్తుంటే తెలుస్తోంది.

విక్టరీ వెంకటేష్ కెరీర్‌లోనే ఇది భారీ బడ్జెట్ సినిమా కానుంది. ‘శ్యామ్ సింగ రాయ్’ తర్వాత నీహారిక ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న రెండో సినిమా ఇది. హిట్‌వర్స్ కాకుండా కొత్త కథతో శైలేష్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ : అవినాష్ కొల్లా, సినిమాటోగ్రఫీ : ఎస్. మణికందన్, ఎడిటింగ్: గ్యారీ బీహెచ్, సంగీత దర్శకుడు : సంతోష్ నారాయణన్.

Also Read దేవుడి దయ వల్ల బావున్నా, గాయాలు కాలేదు - స్పందించిన సంజయ్ దత్

Published at : 13 Apr 2023 02:19 PM (IST) Tags: Venkatesh VIZAG Ruhani Sharma Sailesh kolanu Saindhav Movie Saindhav Movie

సంబంధిత కథనాలు

Navya Swamy: అందుకే సీరియల్స్ మానేశా, రవి నా కంటే ముందే ప్రయత్నించాడు: నటి నవ్య స్వామి

Navya Swamy: అందుకే సీరియల్స్ మానేశా, రవి నా కంటే ముందే ప్రయత్నించాడు: నటి నవ్య స్వామి

Rangabali Teaser: ‘మన ఊర్లో మనల్ని ఎవడ్రా ఆపేది’ - నాగశౌర్య ‘రంగబలి’ టీజర్ అదిరిపోయిందిగా

Rangabali Teaser: ‘మన ఊర్లో మనల్ని ఎవడ్రా ఆపేది’ - నాగశౌర్య ‘రంగబలి’ టీజర్ అదిరిపోయిందిగా

మెగా ఫ్యామిలీలో పెళ్లి భాజాలు, బాలయ్య మూవీ టైటిల్ వచ్చేసింది - ఇంకా మరెన్నో సినీ విశేషాలు మీ కోసం

మెగా ఫ్యామిలీలో పెళ్లి భాజాలు, బాలయ్య మూవీ టైటిల్ వచ్చేసింది - ఇంకా మరెన్నో సినీ విశేషాలు మీ కోసం

Dhoomam Telugu Trailer : ధూమం - నా పేరు ముఖేష్ యాడ్ అందరూ చూసేలా చేస్తే?

Dhoomam Telugu Trailer : ధూమం - నా పేరు ముఖేష్ యాడ్ అందరూ చూసేలా చేస్తే?

Tamanna: చేతిలో మందు గ్లాస్, బీచ్‌లో డ్యాన్స్ - బాల్యాన్ని గుర్తు తెచ్చుకున్న తమన్నా, వీడియో వైరల్

Tamanna: చేతిలో మందు గ్లాస్, బీచ్‌లో డ్యాన్స్ - బాల్యాన్ని గుర్తు తెచ్చుకున్న తమన్నా, వీడియో వైరల్

టాప్ స్టోరీస్

Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం

Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం

Kottu Satyanarayana: మనం చేసిన యాగం వల్లే కేంద్రం మనకి నిధులిచ్చింది - మంత్రి కొట్టు వ్యాఖ్యలు

Kottu Satyanarayana: మనం చేసిన యాగం వల్లే కేంద్రం మనకి నిధులిచ్చింది - మంత్రి కొట్టు వ్యాఖ్యలు

YS Viveka Case : వివేకా కేసులో సీబీఐ అప్ డేట్ - అవినాష్ రెడ్డి A-8 నిందితుడని కోర్టులో కౌంటర్ !

YS Viveka  Case : వివేకా కేసులో సీబీఐ అప్ డేట్ -  అవినాష్ రెడ్డి A-8 నిందితుడని కోర్టులో కౌంటర్  !

KTR: యువత స్కిల్ సంపాదించాలి, ఉద్యోగం దానికదే వస్తుంది - కేటీఆర్

KTR: యువత స్కిల్ సంపాదించాలి, ఉద్యోగం దానికదే వస్తుంది - కేటీఆర్