Payal Rajput: ‘వెంకటలచ్చిమి’గా పాయల్... గ్లామరస్ లేడీతో పాన్ ఇండియా ప్రేమలో పడుతుందట
Payal Rajput New Movie: ఆర్ఎక్స్ 100 సినిమాతో సంచలనానికి కేంద్ర బిందువుగా మారిన బ్యూటీ పాయల్ రాజ్‌ఫుత్. ఇటీవల ‘మంగళవారం’తో వచ్చిన ఈ భామ మరో పాన్ ఇండియా ట్రీట్‌కు సిద్ధమైంది.

Venkatalachimi Pan India Movie: పాయల్ రాజ్‌పుత్ పేరు తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె నటించిన ‘ఆర్ఎక్స్ 100’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులందరూ ఆమె ప్రేమలో పడిపోయారు. ఆ సినిమా తర్వాత కూడా ఆమె కొన్ని సినిమాలలో నటించారు. రీసెంట్‌గా ఆమె నటించిన ‘మంగళవారం’ చిత్రం ఎటువంటి టాక్‌ని సొంతం చేసుకుందో, అందులో పాయల్ పోషించిన పాత్రకు ఎలాంటి పేరు వచ్చిందో అందరికీ తెలిసిన విషయమే. ఇక ఆ సినిమా తర్వాత ఇప్పుడామె పాన్ ఇండియాను టార్గెట్ చేస్తుంది. పాన్ ఇండియా ప్రేక్షకులను ప్రేమలో పడేసేందుకు ఆమె ‘వెంకటలచ్చిమి’గా రాబోతోంది. ఈ ‘వెంకటలచ్చిమి’ విశేషాలలోకి వెళితే..
పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput) ప్రధాన పాత్రలో నటిస్తూ.. డైరెక్టర్ ముని దర్శకత్వంలో తెరకెక్కబోతున్న చిత్రం ‘వెంకటలచ్చిమి’. సినిమా టికెట్ ఎంటర్‌టైన్‌మెంట్స్, అర్జున్ ఆర్ట్స్ బ్యానర్లపై రాజా, ఎన్ఎస్ చౌదరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 6 భాషల్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోతోన్న ఈ ‘వెంకటలచ్చిమి’ చిత్రాన్ని శుక్రవారం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభించారు. ట్రైబల్ గర్ల్ యాక్షన్ రివైంజ్ స్టోరీగా ఈ సినిమా ఉండబోతుంది. ఇందులో పాయల్ రాజ్‌పుత్ పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది, మరోసారి ఆమె పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సినిమాతో పాన్ ఇండియా ప్రేక్షకులకు థ్రిల్ ఇవ్వబోతుందని మేకర్స్ చెబుతున్నారు.
ఈ సినిమా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దర్శకుడు ముని చిత్ర విశేషాలను మీడియాకు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘వెంకటలచ్చిమి’గా కథ అనుకున్నప్పుడే పాయల్ రాజ్‌పుత్‌ని హీరోయిన్‌గా సెలక్ట్ చేసుకున్నాం. పాన్ ఇండియా సినిమాగా తెలుగుతో పాటు హిందీ, పంజాబీ, కన్నడ, మలయాళం, తమిళం భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. ట్రైబల్ గర్ల్ యాక్షన్ రివైంజ్ స్టోరీతో కూడిన ఈ రివేంజ్ డ్రామా ఇండియన్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించడం ఖాయం. ఎందుకంటే, ఈ తరహా సినిమా ఇప్పటి వరకు రాలేదు. అందుకే కాన్ఫిడెంట్‌గా పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కిస్తున్నామని అన్నారు.
హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ మాట్లాడుతూ.. ‘మంగళవారం’ తర్వాత ఎన్నో కథలు నా దగ్గరకు వచ్చాయి. కానీ ఏదీ నచ్చలేదు. కొన్ని రోజులు గ్యాప్ తీసుకుందామని అనుకున్నాను. కానీ ఈ లోపు డైరెక్టర్ ముని ‘వెంకటలచ్చిమి’ కథ నా దగ్గరకు తీసుకువచ్చారు. కథ వినగానే చాలా నచ్చేసింది. ఇలాంటి కథ కోసమే నేను ఇన్నాళ్లు వెయిట్ చేశానేమో అని అనిపించింది. నిజంగా చెబుతున్నాను.. ఈ సినిమా తర్వాత నా పేరు ‘వెంకటలచ్చిమి’గా స్థిరపడిపోతుందేమో అన్నంతగా బలమైన సబ్జెక్టు ఇది. నా కెరీర్‌ని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లే పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా నిలిచిపోతుందనే నమ్మకముందని తెలిపారు.





















