![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Varun Tej: నాగబాబు క్యాజువల్‌గా చెప్పారు... చరణ్, ఎన్టీఆర్‌ను కామెంట్ చేయలేదు!
Varun Tej On Nagababu Comments: 'ఆపరేషన్ వాలెంటైన్' ప్రీ రిలీజ్‌లో నాగబాబు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎన్టీఆర్‌ను కామెంట్ చేశారని పోస్టులు వచ్చారు. వాటిపై వరుణ్ తేజ్ స్పందించారు.
![Varun Tej: నాగబాబు క్యాజువల్‌గా చెప్పారు... చరణ్, ఎన్టీఆర్‌ను కామెంట్ చేయలేదు! Varun Tej clarifies Nagababu viral comments in Operation Valentine pre release on height Varun Tej: నాగబాబు క్యాజువల్‌గా చెప్పారు... చరణ్, ఎన్టీఆర్‌ను కామెంట్ చేయలేదు!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/27/74bcb2148d2e71781ba8c2c1786232b01709036722184313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
తెలుగులో ఆరడుగుల అందగాళ్ళు కొందరు ఉన్నారు. వారిలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) ఒకరు. ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'ఆపరేషన్ వాలెంటైన్' (Operation Valentine Movie). మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అందులో చిరు సోదరుడు, వరుణ్ తేజ్ తండ్రి నాగబాబు చేసిన ఓ వ్యాఖ్య సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా పది సెకన్ల క్లిప్ కట్ చేసి... యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR)ను కామెంట్ చేశారని, ఆయన మీద సెటైర్లు వేశారని పోస్టులు చేస్తున్నారు. ఇంతకీ, నాగబాబు ఏం అన్నారు? అనే విషయంలోకి వెళితే?
ఐదు అడుగుల పోలీస్ అంటే కామెడీగా ఉంటుంది!
''కొన్నిసార్లు కొన్ని కొన్ని క్యారెక్టర్లు క్యారీ చేయాలంటే... 5.3 అడుగులు ఉన్న వాడు నేను స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ అంటే కామెడీగా ఉంటుంది. నువ్వు కాదులేరా బాబు అనిపిస్తుంది'' - ఇదీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నాగబాబు వీడియో క్లిప్. నిజానికి, ఆ తర్వాత ఆయన ఏం చెప్పారంటే... ''ఒక ఆరు అడుగులు ఉన్న వాడు పెర్ఫార్మన్స్ చేస్తే ఏదో ఉందని చెబుతారు. వరుణ్ బాబుకు అంత మంచి పర్సనాలిటీ రావడం అతని అదృష్టం'' అని!
Also Read: అందంతో కాదు, నటనతో... వెండితెరపై రాజకీయం రంగరించిన హీరోయిన్లు
Naga Babu Satires On Jr. Ntr's Baadshah Police Character pic.twitter.com/6P0YvaK0Zn
— Perfect Wala (@Perfectwala17) February 26, 2024
ఆరు అడుగులు ఉన్న వ్యక్తి పోలీస్ / ఎయిర్ ఫోర్స్ వంటి రోల్స్ చేస్తే చూడటానికి బావుంటుందనేది నాగబాబు ఉద్దేశం. అయితే... 'బాద్ షా'లో ఎన్టీఆర్ పోలీస్ రోల్ చేశారని, ఆయన మీద నాగబాబు సెటైర్ వేశారని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. దాంతో సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ మొదలైంది. హిందీ సినిమా 'జంజీర్'లో రామ్ చరణ్ మీద నాగబాబు సెటైర్స్ వేశారని ఇంకొకరు పోస్ట్ చేశారు. దాంతో మెగా, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య రగడ మొదలైంది.
Also Read: 'చారి 111' ప్రెస్ మీట్ కి 'వెన్నెల' కిశోర్ అందుకే రాలేదు!
Nagababu Satires on #ramCharan's ZANJEER:pic.twitter.com/b4ydEwaYfn
— Devarafied Feline (@kittenreturns) February 26, 2024
Operation Valentine release date: 'ఆపరేషన్ వాలెంటైన్' మార్చి 1న విడుదల కానున్న సందర్భంగా ప్రింట్ అండ్ వెబ్ మీడియాకు వరుణ్ తేజ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ హీరో, ఈ హీరో అని కాకుండా 'మీ నాన్నగారు హైట్ గురించి చేసిన వ్యాఖ్యలు ఒక హీరోని ఉద్దేశించినవి అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు' అని ఆయన దృష్టికి తీసుకు వెళ్లగా... ''నా హైట్ 6.3 అడుగులు. అందుకని, 5.3 అడుగులు అన్నారు తప్ప నాన్నకు వేరే ఉద్దేశాలు లేవు. సోషల్ మీడియాలో జస్ట్ కొన్ని సెకన్స్ క్లిప్స్ తీసుకుని వైరల్ చేస్తున్నారు. ఆ ముందు వెనుక ఏం అన్నారనేది పట్టించుకోవడం లేదు'' అని వివరించారు. సో... ఫ్యాన్స్ సోషల్ మీడియాలో యుద్ధాలు ఆపేస్తే మంచిది.
కమర్షియల్ నేపథ్యంలో పోలీస్ కథ చేసే ఉద్దేశం ఉందా?
'ఆపరేషన్ వాలెంటైన్'లో వరుణ్ తేజ్ ఎయిర్ ఫోర్స్ పైలట్ రోల్ చేశారు. ఇప్పటి వరకు ఆయన పోలీస్ క్యారెక్టర్ చేయలేదు. ఒకవేళ కమర్షియల్ స్పేస్, ఆ జానర్‌లో పోలీస్ బ్యాక్‌డ్రాప్ కథ చేసే ఉద్దేశం ఉందా? అని ప్రశ్నిస్తే... ''కొన్ని కథలు వచ్చాయి. కానీ, అన్నీ కుదరలేదు. ఇటీవల పోలీస్ పరేడ్ కి వెళ్ళా. అక్కడ ఒక ఆఫీసర్ 'మీరు సినిమాల్లో చూపించినట్టు పోలీసులు ఉండరు' అని క్లాస్ పీకారు. 'సార్, నేను ఇప్పటి వరకు పోలీస్ రోల్ చేయలేదు. చేస్తే మీరు కోరుకునే విధంగా చేస్తా' అని చెప్పా. భవిష్యత్తులో రియలిస్ట్ బ్యాక్‌డ్రాప్ పోలీస్ కథ వస్తుందేమో చూడాలి'' అని వరుణ్ తేజ్ సమాధానం ఇచ్చారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)