అన్వేషించండి

Varalaxmi Sarathkumar: అందరి భార్యలు ఐశ్వర్య రాయ్‌లా ఉండరు, ముందు మీ ముఖాలు చూసుకోండి - అయ్యో, వరలక్ష్మికి కోపమొచ్చింది

Varalaxmi Sarathkumar: వరలక్ష్మి శరత్‌కుమార్ తన ఎంగేజ్‌మెంట్ ఫోటోలు షేర్ చేసినప్పటి నుండి తనకు కాబోయే భర్తపై ట్రోల్స్ మొదలయ్యాయి. తాజాగా వాటన్నింటిపై ఘాటుగా స్పందించింది వరలక్ష్మి.

Varalaxmi Sarathkumar Response To Trolls: సినీ సెలబ్రిటీల్లో ఎవరైనా పెళ్లి చేసుకుంటున్నారంటే చాలు.. చాలావరకు ప్రేక్షకుల అటెన్షన్ అంతా వారిపైనే ఉంటుంది. వారు ఎవరిని పెళ్లి చేసుకుంటున్నారు? వారి పర్సనల్ లైఫ్ ఏంటి? లాంటి విషయాలను ఎక్కువగా తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అలా ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకుల ఫోకస్ చాలావరకు వరలక్ష్మి శరత్‌కుమార్ పెళ్లిపైనే ఉంది. కొన్నాళ్ల క్రితం అసలు పెళ్లి అంటేనే ఇంట్రెస్ట్ లేదని చెప్పిన వరలక్ష్మి.. సడెన్‌గా నికోలయ్ సచ్‌దేవ్ అనే గ్యాలరిస్ట్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. ఇక తన ఎంగేజ్‌మెంట్‌పై, కాబోయే భర్తపై వస్తున్న ట్రోల్స్‌పై గట్టి కౌంటర్ ఇచ్చింది వరలక్ష్మి.

ఫీల్ అవ్వను..

నికోలయ్ సచ్‌దేవ్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకొని ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది వరలక్ష్మి శరత్‌కుమార్. అసలు అతను ఎవరు అని తెలుసుకోవడానికి నెటిజన్లు సెర్చింగ్ చేయడం మొదలుపెట్టారు. అదే సమయంలో నికోలయ్‌కు ఆల్రెడీ పెళ్లయ్యిందనే విషయం బయటికొచ్చింది. దీంతో అతడు చూడడానికి బాగాలేకపోయినా వరలక్ష్మి ఎందుకు పెళ్లి చేసుకుంటుంది? రెండో పెళ్లివాడిని చేసుకోవాల్సిన అవసరం ఏముంది? అంటూ తనపై ట్రోల్స్ మొదలయ్యాయి. తాజాగా వీటిపై సీరియస్‌గా స్పందించింది వరలక్ష్మి. ‘‘ముందు పెళ్లి అయితే అందులో ఏముంది? నిజమే చెప్తున్నారు కదా.. అందులో ఫీల్ అవ్వడానికి ఏముంది’’ అంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చింది.

సంబంధం లేదు..

‘‘వాటన్నింటికి నా సమాధానం ఏంటంటే మీ పని మీరు చూసుకోండి అని చెప్తాను అంతే. మీ జీవితంలో మీ భార్య, మీ భర్త గురించి ముందు చూసుకోండి. ఆ తర్వాత వచ్చి నాకు చెప్పండి. అందరి భార్యలు ఐశ్వర్య రాయ్ ఏం కాదు, అందరి భర్తలు బ్రాడ్ పిట్ ఏం కాదు. ముందు మీ ముఖాలు చూసుకోండి. ఆ తర్వాత నా దగ్గర రండి అని డైరెక్ట్‌గా చెప్పేస్తాను. మీరు ఏమనుకుంటున్నారు, ఏమనుకోవడం లేదు అనేది నాకు సంబంధమే లేదు. ఆ కామెంట్స్ చూడడానికి కూడా నాకు ఇంట్రెస్టే లేదు. నేను అసలు వాటిని పట్టించుకోను. మీ జీవితం మీది. నా జీవితం నాది. కొంతమంది డబ్బుల కోసం పెళ్లి చేసుకుంటుంది అన్నారు. అలా అంటే డబ్బులు నా దగ్గర కూడా ఉన్నాయి. వాళ్ల లైఫ్‌లో డిప్రెషన్‌లో ఉండి ఏదో రాసుకుంటారు. రాసుకోండి మీ ఇష్టం అని వదిలేశాను. మీకు పని లేదు. మాకు పని ఉంది’’ అంటూ ట్రోలర్స్‌పై సీరియస్ అయ్యింది వరలక్ష్మి శరత్‌కుమార్.

షూటింగ్స్‌కు వస్తాడు..

నికోలయ్ సచ్‌దేవ్‌లో తనకు ఏం ఇష్టమో కూడా బయటపెట్టింది వరలక్ష్మి. ‘‘తను నా జీవితాన్ని చాలా గౌరవిస్తాడు. సినిమాలు చేయడం ఆపేసి ఇంట్లో కూర్చో, సినిమాలు చేయొద్దు, నువ్వు నటివి అని ఎప్పుడూ చెప్పలేదు. చెప్పాలంటే నన్ను చూసి చాలా గర్వపడతారు. ఆయన షూటింగ్‌కు వస్తే అన్నీ కొత్తగా సంతోషంగా చూస్తారు. ఆయన మొదటి ప్రాధాన్యత నాకే ఇస్తారు. తను నాకు సపోర్ట్ చేస్తారు. నేను తనకు సపోర్ట్ చేస్తాను’’ అంటూ నికోలయ్.. తనతో పాటు అప్పుడప్పుడు షూటింగ్స్‌కు కూడా వస్తారని రివీల్ చేసింది వరలక్ష్మి శరత్‌కుమార్. నికోలయ్.. ఒక గ్యాలరిస్ట్ అని, పెద్ద పెద్ద ఆర్టిస్టుల పెయింటింగ్‌ను కొనడం, అమ్మడమే తన పని అని క్లారిటీ ఇచ్చింది.

Also Read: శోభితాతో నాగచైతన్య పెళ్లి రూమర్స్ - సమంతపై ఎఫెక్ట్?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kalvakuntla Kavitha: ఎలా ట్రెండింగ్‌లో ఉండాలో కవితకు బాగా తెలుసా? - ఇప్పుడంతా ఆమె గురించే చర్చ
ఎలా ట్రెండింగ్‌లో ఉండాలో కవితకు బాగా తెలుసా? - ఇప్పుడంతా ఆమె గురించే చర్చ
2019 Group 2 Issue: గ్రూప్-2 2019 ర్యాంకర్లకు భారీ ఊరట.. సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేసిన డివిజన్ బెంచ్
గ్రూప్-2 2019 ర్యాంకర్లకు భారీ ఊరట.. సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేసిన డివిజన్ బెంచ్
Hyderabad News: మాల ధారణపై హైదరాబాద్‌ పోలీసుల ఆంక్షల వివాదం- డీజీపీ ఆఫీస్‌ ముట్టడికి స్వాముల యత్నం- స్వల్ప ఉద్రిక్తత
మాల ధారణపై హైదరాబాద్‌ పోలీసుల ఆంక్షల వివాదం- డీజీపీ ఆఫీస్‌ ముట్టడికి స్వాముల యత్నం- స్వల్ప ఉద్రిక్తత
Psych Siddhartha Blue Yellow Song : టీజర్‌లో బూతులు... సాంగ్‌లో కలర్స్ - 'సైక్ సిద్దార్థ' వెరైటీ కలర్ ఫుల్ సాంగ్ లిరిక్స్
టీజర్‌లో బూతులు... సాంగ్‌లో కలర్స్ - 'సైక్ సిద్దార్థ' వెరైటీ కలర్ ఫుల్ సాంగ్ లిరిక్స్
Advertisement

వీడియోలు

Gambhir Comments on Head Coach Position | గంభీర్ సెన్సేషనల్ స్టేట్‌మెంట్
World Test Championship Points Table | టెస్టు ఛాంపియన్‌షిప్ లో భారత్ స్థానం ఇదే
Reason for Team India Failure | భారత్ ఓటమికి కారణాలు ఇవే !
Rohit Sharma First Place in ICC ODI Rankings | అగ్రస్థానంలో
South Africa whitewashed India | రెండో టెస్ట్ ఓడిపోయిన టీమ్ ఇండియా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kalvakuntla Kavitha: ఎలా ట్రెండింగ్‌లో ఉండాలో కవితకు బాగా తెలుసా? - ఇప్పుడంతా ఆమె గురించే చర్చ
ఎలా ట్రెండింగ్‌లో ఉండాలో కవితకు బాగా తెలుసా? - ఇప్పుడంతా ఆమె గురించే చర్చ
2019 Group 2 Issue: గ్రూప్-2 2019 ర్యాంకర్లకు భారీ ఊరట.. సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేసిన డివిజన్ బెంచ్
గ్రూప్-2 2019 ర్యాంకర్లకు భారీ ఊరట.. సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేసిన డివిజన్ బెంచ్
Hyderabad News: మాల ధారణపై హైదరాబాద్‌ పోలీసుల ఆంక్షల వివాదం- డీజీపీ ఆఫీస్‌ ముట్టడికి స్వాముల యత్నం- స్వల్ప ఉద్రిక్తత
మాల ధారణపై హైదరాబాద్‌ పోలీసుల ఆంక్షల వివాదం- డీజీపీ ఆఫీస్‌ ముట్టడికి స్వాముల యత్నం- స్వల్ప ఉద్రిక్తత
Psych Siddhartha Blue Yellow Song : టీజర్‌లో బూతులు... సాంగ్‌లో కలర్స్ - 'సైక్ సిద్దార్థ' వెరైటీ కలర్ ఫుల్ సాంగ్ లిరిక్స్
టీజర్‌లో బూతులు... సాంగ్‌లో కలర్స్ - 'సైక్ సిద్దార్థ' వెరైటీ కలర్ ఫుల్ సాంగ్ లిరిక్స్
Hema Malini : బాలీవుడ్ హీ మ్యాన్ ధర్మేంద్ర మరణం - భార్య హేమా మాలిని ఎమోషనల్ పోస్ట్
బాలీవుడ్ హీ మ్యాన్ ధర్మేంద్ర మరణం - భార్య హేమా మాలిని ఎమోషనల్ పోస్ట్
AIతో ఆకలి తీర్చే సరికొత్త పరికరం! మంగుళూరు కుర్రాడి సంచలనం, మీ కోసం ఫుడ్ ఆర్డర్ చేసే టూల్
ఆకలేస్తే ఫుడ్ ఆర్డర్ పెడుతుంది! స్టెతస్కోప్ హెల్ప్‌తో అదిరిపోయే ఏఐ టూల్ క్రియేట్ చేసిన మంగుళూరు యువకుడు
Rahul Sipligunj Harinya Reddy : ఘనంగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ వివాహం - కొత్త జంటకు వెల్లువలా విషెష్
ఘనంగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ వివాహం - కొత్త జంటకు వెల్లువలా విషెష్
Who Is Peter Haag: ఎవరీ పీటర్ హాగ్? పెళ్లైన 15 ఏళ్ళకు విడాకులు... హీరోయిన్ సెలీనా జైట్లీ భర్త బ్యాగ్రౌండ్ తెలుసా?
ఎవరీ పీటర్ హాగ్? పెళ్లైన 15 ఏళ్ళకు విడాకులు... హీరోయిన్ సెలీనా జైట్లీ భర్త బ్యాగ్రౌండ్ తెలుసా?
Embed widget