Varalaxmi Sarathkumar: నేను పెళ్లి చేసుకోవాలని అనుకోవడమే పెద్ద సర్‌ప్రైజ్ - వరలక్ష్మి శరత్‌కుమార్ ఆసక్తికర కామెంట్స్
Varalaxmi Sarathkumar: సినీ సెలబ్రిటీల్లో ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నవారి లిస్ట్‌లో వరలక్ష్మి శరత్‌కుమార్ కూడా చేరింది. ఇటీవల ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ఈ భామ.. పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Varalaxmi Sarathkumar About Her Marriage: తమిళంలో హీరోయిన్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది వరలక్ష్మి శరత్‌కుమార్. కానీ టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా నటించడంతోనే తన కెరీర్ కొత్త మలుపు తిరిగింది. అలా ప్రస్తుతం అటు క్యారెక్టర్ ఆర్టిస్టుగా, ఇటు హీరోయిన్‌గా బిజీ అయిపోయింది ఈ భామ. ఇక ఎప్పుడూ పెళ్లి అనేదే తన సెట్ అవ్వదు అని చెప్తూ ఉండే వరలక్ష్మి.. కొన్నిరోజుల క్రితం ప్రముఖ గ్యాలరిస్ట్ నికోలయ్ సచ్‌దేవ్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకొని అందరికీ షాకిచ్చింది. తన అప్‌కమింగ్ మూవీ ‘శబరి’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఈ విషయంపై వరలక్ష్మి స్పందించింది. పెళ్లి చేసుకోవాలని తను తీసుకున్న నిర్ణయం తనకే షాకింగ్‌గా ఉందని చెప్పుకొచ్చింది.
అందమైన సర్‌ప్రైజ్..
జీవితంలో తనకు గుర్తుండిపోయే సర్‌ప్రైజ్‌లు, షాకులు ఏంటి అని వరలక్ష్మి శరత్‌కుమార్‌కు ప్రశ్న ఎదురయ్యింది. ‘‘పెళ్లి చేసుకోవాలని నేను తీసుకున్న నిర్ణయమే నాకు చాలా సర్‌ప్రైజింగ్‌గా ఉంది. మామూలుగా అయితే నన్ను సర్‌ప్రైజ్ చేయడం అంత ఈజీ కాదు. ఏమైనా జరుగుతుంది అంటే నాకు ముందే తెలిసిపోతుంది. నిజంగానే సర్‌ప్రైజ్ అని చెప్పాలంటే తెలుగు సినిమాల్లో నా రీఎంట్రీ. ఇంత ప్రేమ, అభిమానం వస్తుందని నేను నిజంగా అనుకోలేదు. అది నాకొక అందమైన సర్‌ప్రైజ్’’ అని సమాధానమిచ్చింది వరలక్ష్మి శరత్‌కుమార్. ఇప్పటికే నికోలయ్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నా కూడా పెళ్లి ఎప్పుడు అనే విషయంపై తను క్లారిటీ ఇవ్వలేదు. దానిపై కూడా ఈ ప్రెస్ మీట్‌లో స్పందించింది.
పెళ్లి ఒక భాగం మాత్రమే..
పెళ్లి తేదీ ఎప్పుడో తనకు తెలిసిన తర్వాతే అందరికీ తెలుస్తుంది అని చెప్తూ నవ్వింది వరలక్ష్మి. ‘‘పెళ్లి చేసుకుంటాను కానీ ఎప్పుడు అని తెలియదు. నా జీవితంలో చాలావరకు నిర్ణయాలు వాటంతట అవే జరిగిపోతాయి. నేను కూడా ఏది ముందే అనుకోను. నేను ఎక్కువగా పనిపైనే దృష్టిపెడతాను. ఎంగేజ్‌మెంట్ జరిగిన తరువాతి రోజే నేను హైదరాబాద్‌కు షూటింగ్‌కు వచ్చేశాను. మళ్లీ పని మొదలుపెట్టాను. నేను అంతే. నా జీవితమే సినిమా. ఇక పెళ్లి విషయానికొస్తే ప్లాన్ చేస్తున్నాం, ఆర్గానిక్‌గా జరిగిపోతుంది. ఎలాగో జరిగినప్పుడు అందరికీ తెలుస్తుంది. కచ్చితంగా ఈ ఏడాదిలోనే జరుగుతుంది. నా జీవితం సినిమానే అందులో పెళ్లి ఒక భాగం మాత్రమే’’ అంటూ తనకు తన కెరీర్ ఎంత ముఖ్యమో బయటపెట్టింది వరలక్ష్మి శరత్‌కుమార్.
View this post on Instagram
అందరికీ షాక్..
సీనియర్ హీరో శరత్‌కుమార్ వారసురాలు వరలక్ష్మి పెళ్లి గురించి సినీ సర్కిల్లో ఎక్కడా ప్రస్తావన లేని సమయంలోనే తనకు కాబోయే భర్తగా గ్యాలరిస్ట్ నికోలయ్ సచ్‌దేవ్‌ను అందరికీ పరిచయం చేసి షాకిచ్చింది. ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో తనకు అసలు పెళ్లి ఇంట్రెస్ట్ లేదని ఓపెన్‌గా చెప్పిన ఈ భామ.. సడెన్‌గా ఒకరిని ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. మార్చి 1న నికోలయ్‌తో జరిగిన ఎంగేజ్‌మెంట్ ఫోటోలను చాలా సంతోషంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకుంది. ‘నా జీవితంలో కొత్త ప్రయాణం’ అంటూ నిశ్చితార్థం గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
Also Read: చనిపోయిన వ్యక్తి ఎలా తిరిగి వస్తాడు? వరలక్ష్మి శరత్ కుమార్ 'శబరి' ట్రైలర్ చూశారా?
Before You Go
Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు






















