దేశంలోనే అతి పొడవైన బ్రిడ్జి గురించి మీకు తెలుసా?



బ్రహ్మపుత్ర నదిపై ఉన్న ఈ బ్రిడ్జి పొడవు 9.15 కి.మీ



ఇది అసోంలోని తిన్‌సుకియా జిల్లాలో ఉంది.



అసోం - అరుణాచల్ ప్రదేశ్‌లను కలుపుతుంది.



దీనివల్ల రెండు రాష్ట్రాల మధ్య జర్నీ 6 గంటల నుంచి గంటకు తగ్గింది.



రోజుకి యావరేజ్‌గా రూ.10 లక్షల విలువైన ఫ్యుయల్ ఆదా చేయొచ్చు.



ఈ బ్రిడ్జి పేరు ఢోలా - సాదియా బ్రిడ్జి లేదా డాక్టర్ భూపెన్ హజారికా సేతు.



ఇది పౌరులకే కాక, ఆర్మీ తన ఆయుధ సంపత్తిని ఈశాన్యానికి తరలించడానికి ఉపయోగపడుతుంది.



భారీ యుద్ధ సామగ్రి తరలింపు, బలగాల మోహరింపు బ్రిడ్జి మీదుగా సులువు అవుతుంది.



ఇంజినీరింగ్ అద్భుతంగా భావించే వంతెనను తెలుగు నేలకు చెందిన నవయుగ కంపెనీ నిర్మించింది.



2017లో ప్రధాని మోదీ చేతుల మీదుగా బ్రిడ్జిని ప్రారంభించారు.