Kartikeya 8: యువి క్రియేషన్స్‌లో కార్తికేయ సినిమా, స్పీడుగా షూటింగులో
యువి క్రియేషన్స్‌లో యంగ్ హీరో కార్తికేయ ఓ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ప్రభాస్ సన్నిహితులకు చెందిన యువి క్రియేషన్స్ (UV Creations) సంస్థ ఒకవైపు భారీ బడ్జెట్ సినిమాలు తీస్తూనే... మరోవైపు ప్రతిభావంతులైన యువ హీరోలతో చక్కటి చిత్రాలు నిర్మిస్తోంది. 'ఆర్ఎక్స్ 100'తో కథానాయకుడిగా... 'గ్యాంగ్ లీడర్', 'వలిమై' చిత్రాలతో ప్రతినాయకుడిగా పేరు తెచ్చుకున్న కార్తికేయ గుమ్మకొండ (Kartikeya Gummakonda) తో ఓ సినిమా చేస్తోంది.
కార్తికేయ, యువి క్రియేషన్స్ కలయికలో రూపొందుతోన్న సినిమాలో ఐశ్వర్య మీనన్ కథానాయిక (Iswarya Menon). ప్రశాంత్ రెడ్డి (Prashanth Reddy Chandrapu) దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకుడిగా అతడికి తొలి చిత్రమిది. శుక్రవారం ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా "ప్రస్తుతం సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. సినిమా చివరి దశకు వచ్చింది" అని చిత్ర బృందం వెల్లడించింది. "ప్రతిష్టాత్మక యువి క్రియేషన్స్ సంస్థతో అసోసియేట్ కావడం చాలా సంతోషంగా ఉంది" అని హీరో కార్తికేయ ట్వీట్ చేశారు.
Also Read: సెర్బియాకు 50 మందిని తీసుకెళ్లిన అల్లు అర్జున్ - గ్రాండ్ బర్త్ డే పార్టీ
Super proud & excited to be associated with the
— Kartikeya (@ActorKartikeya) April 8, 2022
Prestigious @UV_Creations banner 😇
Directed by @Dir_Prashant, #Kartikeya8 Title revealing soon 🏎️✨️ pic.twitter.com/SqKI2IOOyR
కార్తికేయ 8వ చిత్రమిది (Kartikeya 8). ఇందులో తనికెళ్ల భరణి (Tanikella Bharani), రవిశంకర్, శరత్ లోహితస్వ ఇతర తారాగణం. ఈ చిత్రానికి ఆర్ట్: గాంధీ నడికుడికర్, ఎడిటర్: సత్య జి, మాటలు: మధు శ్రీనివాస్, సినిమాటోగ్రఫీ: ఆర్.డి.రాజశేఖర్.
Also Read: అకిరా నందన్ పవర్ ఫుల్ పంచ్ - హీరో మాత్రం అవ్వడంటున్న రేణు దేశాయ్
Δείτε αυτή τη δημοσίευση στο Instagram.