Urvashi Rautela: ఊర్వశీ రౌతేలా బంపర్ ఆఫర్ - పోయిన తన గోల్డెన్ ఐఫోన్ కనిపెడితే...
తాజాగా ఇండియా, పాకిస్థాన్ మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్‌ను చూడడానికి వెళ్లి హీరోయిన్ ఊర్వశి రౌతేలా తన గోల్డెన్ ఐఫోన్‌ను పోగొట్టుకుంది. తాజాగా అది కనిపెట్టి తీసుకొచ్చినవారికి రివార్డ్‌ను ప్రకటించింది.
కొందరు సినీ సెలబ్రిటీలకు క్రికెట్ అంటే అభిమానం పీక్స్‌లో ఉంటుంది. అందుకే ఎక్కడ క్రికెట్ మ్యాచ్ జరిగినా నేరుగా చూడడానికి స్టేడియంకు వెళ్లిపోతుంటారు. బాలీవుడ్‌లో అలాంటి క్రికెట్ పిచ్చి ఉన్న సినీ సెలబ్రిటీల్లో ఊర్వశి రౌతేలా కూడా ఒకరు. తనకు ఇండియన్ మెన్ క్రికెట్ టీమ్‌తో మంచి ఫ్రెండ్‌షిప్ ఉండడంతో స్టేడియంలో ఇండియన్ టీమ్ ఎప్పుడు ఆడడానికి అడుగుపెట్టినా.. వారిని ప్రోత్సహించడానికి ఊర్వశి అక్కడే ఉంటుంది. ప్రస్తుతం వన్డే వరల్డ్ కప్ 2023 జరుగుతుండగా.. ఒక క్రికెట్ ఫ్యాన్‌గా మ్యాచ్‌ను నేరుగా చూడడానికి వెళ్లింది. ఊర్వశి. అదే సమయంలో తన గోల్డ్ ఐఫోన్ పోగొట్టుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన ఈ భామ.. అది రిటర్న్ తీసుకొచ్చి ఇచ్చిన వారికి రివార్డ్ ప్రకటించింది.
24 క్యారెట్ల గోల్డెన్ ఐఫోన్..
వన్డే వరల్డ్ కప్ 2023లో గత వారం ఇండియా వర్సెస్ పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ జరిగింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌ను చూడడానికి ఎంతోమంది క్రికెట్ లవర్స్ హాజరయ్యారు. అందులో ఊర్వశి రౌతేలా కూడా ఒకరు. అదే సమయంలో స్టేడియంలో తన కాస్ట్‌లీ ఐఫోన్‌ను పోగొట్టుకుంది. ‘‘అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో నా 24 క్యారెట్ల గోల్డ్ ఐఫోన్‌ను పోగొట్టుకున్నాను. ఎవరికైనా దొరికితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. దయజేసి సాయం చేయండి. నన్ను వీలైనంత త్వరగా కాంటాక్ట్ అవ్వండి’’ అని ఊర్వశి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో పాటు తను పోలిసులకు ఇచ్చిన కంప్లైంట్ కాపీని కూడా షేర్ చేసింది. అయితే రెండురోజులు అయినా తన ఫోన్ జాడ తెలియకపోవడంతో తన ఫోన్ తీసుకొచ్చి ఇచ్చిన వారికి రివార్డ్ ప్రకటించింది ఊర్వశి.
మామూలు ఫోన్‌ను ఉపయోగిస్తున్నా..
ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌ను నేరుగా వీక్షించడానికి చాలామంది స్టేడియంకు హాజరయ్యారు. అదే సమయంలో చాలామంది తమ వస్తువులు పోయాయని వాపోయారు. అలాగే ఊర్వశి కూడా తన గోల్డ్ ఐఫోన్‌ను పోగొట్టుకుంది. కానీ ఎలాగైనా దానిని తిరిగి దక్కించుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. ఐఫోన్ పోయిందని తను షేర్ చేసిన పోస్టులో అహ్మదాబాద్ పోలీసులను ట్యాగ్ చేయడంతో వారు స్పందించారు. ఫోన్‌కు సంబంధించిన వివరాలను అడిగి తెలుకున్నారు. ప్రస్తుతం ఊర్వశి.. మామూలు ఫోన్‌ను ఉపయోగిస్తున్నానని, తన గోల్డ్ ఐఫోన్ కోసం ఎదురుచూస్తున్నానని వాపోయింది.
రివార్డ్ ఇస్తాను..
ఐఫోన్ చివరి లొకేషన్ అహ్మదాబాద్‌లోని ఒక మాల్‌లో చూపించినట్టుగా ఊర్వశి తెలుసుకుంది. ఇదే విషయాన్ని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘‘రివార్డ్ ఇస్తాను. నా ఫోన్ చివరి లొకేషన్ ఒక మాల్‌లో చూపించింది’’ అని చెప్పుకొచ్చింది. రివార్డ్ ఇస్తానని చెప్పింది కానీ ఆ రివార్డ్ ఏంటి అని మాత్రం ఊర్వశి బయటపెట్టలేదు. తన గోల్డెన్ ఐఫోన్‌ను తిరిగి దక్కించుకోవడం కోసం ఊర్వశి చేస్తున్న ప్రయత్నాలు చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆరోజు స్టేడియంలో లక్షల మంది ఉన్నారని, ఆ సమయంలో ఐఫోన్‌ను ఎవరైనా దొంగిలించినా.. అది తిరిగి దొరికే ఛాన్స్ లేదని, దాని గురించి వదిలేయమని ఈ హీరోయిన్‌కు కొందరు సలహాలు కూడా ఇచ్చేస్తున్నారు.
Also Read: నేను ప్రభాస్‌తో చేయబోయే సినిమా అందులో భాగం కాదు - లోకేష్ కనగరాజ్
Join Us on Telegram: https://t.me/abpdesamofficial