అన్వేషించండి

Triptii Dimri : బాయ్ ఫ్రెండ్​తో రెస్టారెంట్లో 'యానిమల్' బ్యూటీ... ఫోటోలు తీయొద్దంటూ రిక్వెస్ట్

Triptii Dimri Love Life : 'యానిమల్' హీరోయిన్ త్రిప్తి దిమ్రి తాజాగా తన రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ తో కలిసి కనిపించింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది.

Triptii Dimri with Rumored Boyfriend : ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో ఎక్కువగా పేరు వినిపిస్తున్న హీరోయిన్లలో త్రిప్తి దిమ్రి కూడా ఒకరు. 'యానిమల్' హిట్ తర్వాత ఈ బ్యూటీ కెరీర్ పూర్తిగా మారిపోయింది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు రిలేషన్ షిప్ లో ఉందంటూ గత కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా త్రిప్తి దిమ్రి తన బాయ్ ఫ్రెండ్ తో హాలిడే ఎంజాయ్ చేస్తూ కెమెరా కంటికి చిక్కింది. 

బాయ్ ఫ్రెండ్ తో సండే వెకేషన్ 

త్రిప్తి దిమ్రి ఆదివారం ముంబైలో తన ప్రియుడు సామ్ మర్చంట్ తో కలిసి సండే వెకేషన్ లో కనిపించింది. ఆ టైంలో ఫోటోగ్రాఫర్లు అక్కడే ఉండడంతో ఆమె ఒక్కతే కొంతవరకు ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. కానీ ఆ తర్వాత తమ ఫోటోలు తీయొద్దు అంటూ మర్యాదపూర్వకంగా ఆమె కెమెరామెన్లను కోరడం ప్రస్తుతం వైరల్ అవుతున్న ఆ వీడియోలో కనిపిస్తోంది. డిసెంబర్ 15న త్రిప్తి దిమ్రి ముంబైలోని ఒక కేఫ్ బయట బాయ్ ఫ్రెండ్ సామ్ తో కలిసి కనిపించింది. ఇక వైరల్ అవుతున్న ఈ వీడియోలో త్రిప్తి దిమ్రి వైడ్ డెనిమ్ ప్యాంట్, బ్లాక్ ఓవర్ సైజ్డ్ టీషర్ట్ ధరించి కనిపించింది. అలాగే ఆమె రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ సామ్ కూడా వైట్ టీ షర్ట్, బ్లాక్ ప్యాంట్ లో కూల్ గా కనిపించారు. అయితే ఫోటోలకు కేవలం తృప్తి మాత్రమే ఫోజులిచ్చింది. ఇద్దరూ కలిసి ఫోటోలు దిగడానికి మాత్రం నిరాకరించినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి ఈ జంట లో- ప్రొఫైల్ మెయింటైన్ చేయడానికి ఇష్టపడుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇక ఆ తర్వాత రెస్టారెంట్ నుంచి త్రిప్తి దిమ్రి - సామ్ మర్చంట్ కలిసి బయటకు వెళ్లారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Varinder Chawla (@varindertchawla)

అనుష్క బ్రదర్ తో రిలేషన్ 

తృప్తి బాయ్ ఫ్రెండ్ తో బయట కనిపించడం ఇదే మొదటిసారి కాదు. రీసెంట్ గా ముంబైలోని బ్రయాన్స్ ఆడమ్స్ కాన్సెప్ట్ లో ఇద్దరూ కలిసి కనిపించారు. అంతే కాదు వీరిద్దరూ కలిసి పలుమార్లు బయట కనిపించినప్పటికీ ఇప్పటిదాకా వాళ్ళ రిలేషన్ గురించి ఎక్కడా మాట్లాడలేదు. అయితే గతంలో అనుష్క శర్మ బ్రదర్ కర్నేష్ శర్మతో ఈ బ్యూటీ డేటింగ్ చేసినట్టుగా వార్తలు వినిపించాయి.  కానీ 2022లో తృప్తీ - కర్ని విడిపోయారని ప్రచారం జరిగింది. 

తృప్తి ఖాతాలో అరడజను సినిమాలు... 

త్రిప్తి దిమ్రి ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ బిజీగా గడిపేస్తోంది. చివరగా త్రిప్తి దిమ్రి 'భూల్ భూలయ్య-3' సినిమాలో ఆమె కార్తీక్ ఆర్యన్ సరసన కనిపించింది. ఈ మూవీలో విద్యాబాలన్, మాధురి దీక్షిత్ కూడా కీలకపాత్రలు పోషించారు. 2024 దీపావళి సందర్భంగా ఈ మూవీ రిలీజై, మంచి కలెక్షన్లు రాబట్టింది. తర్వాత ఆమె సిద్ధాంత్ చతుర్వేదితో కలిసి 'ధడక్ 2'లో కనిపించనుంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రానున్న 'యానిమల్ పార్క్' సీక్వెల్‌లో తన పాత్రలో మరోసారి మెరవనుంది త్రిప్తి దిమ్రి. ఆమె లైనప్‌లో 'ఆషికీ 2' కూడా ఉంది.

Read Also :  Manchu Manoj Political Entry: రాజకీయాల్లోకి మంచు మనోజ్ దంపతులు! జనసేనలో చేరే అవకాశం!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Assembly Sessions: ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్- స్పీకర్ అనుమతి కోరిన బీఆర్‌ఎస్- హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్- స్పీకర్ అనుమతి కోరిన బీఆర్‌ఎస్- హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
Manchu Manoj Political Entry: రాజకీయాల్లోకి మంచు మనోజ్ దంపతులు! జనసేనలో చేరే అవకాశం!
రాజకీయాల్లోకి మంచు మనోజ్ దంపతులు! జనసేనలో చేరే అవకాశం!
Andhra Pradesh News: జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
Ilaiyaraaja : సిగ్గుచేటు.. ఆలయంలో ఇళయరాజాకు ఘోర అవమానం- వీడియో వైరల్
సిగ్గుచేటు.. ఆలయంలో ఇళయరాజాకు ఘోర అవమానం- వీడియో వైరల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇళయరాజాకు ఘోర అవమానం!నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly Sessions: ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్- స్పీకర్ అనుమతి కోరిన బీఆర్‌ఎస్- హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్- స్పీకర్ అనుమతి కోరిన బీఆర్‌ఎస్- హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
Manchu Manoj Political Entry: రాజకీయాల్లోకి మంచు మనోజ్ దంపతులు! జనసేనలో చేరే అవకాశం!
రాజకీయాల్లోకి మంచు మనోజ్ దంపతులు! జనసేనలో చేరే అవకాశం!
Andhra Pradesh News: జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
Ilaiyaraaja : సిగ్గుచేటు.. ఆలయంలో ఇళయరాజాకు ఘోర అవమానం- వీడియో వైరల్
సిగ్గుచేటు.. ఆలయంలో ఇళయరాజాకు ఘోర అవమానం- వీడియో వైరల్
Kannappa : పాశుపతాస్త్ర ప్రదాత ! విజయుడిని గెలిపించిన ఆటవిక కిరాత... 'కన్నప్ప' నుంచి మోహన్ లాల్ ఫస్ట్ లుక్
పాశుపతాస్త్ర ప్రదాత ! విజయుడిని గెలిపించిన ఆటవిక కిరాత... 'కన్నప్ప' నుంచి మోహన్ లాల్ ఫస్ట్ లుక్
Revanth Reddy: తెలంగాణలో భూమి లేని నిరుపేదలు అంటే ఎవరు? అర్హులను ప్రభుత్వం ఎలా ఎంపిక చేస్తుంది?
తెలంగాణలో భూమి లేని నిరుపేదలు అంటే ఎవరు? అర్హులను ప్రభుత్వం ఎలా ఎంపిక చేస్తుంది?
RC 17 Update : మెగా ఫ్యాన్స్​కు గుడ్ న్యూస్... చెర్రీ - సుకుమార్ సినిమా గురించి అదిరిపోయే అప్డేట్
మెగా ఫ్యాన్స్​కు గుడ్ న్యూస్... చెర్రీ - సుకుమార్ సినిమా గురించి అదిరిపోయే అప్డేట్
Zakir Hussain Died: ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌ అస్తమయం
ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌ అస్తమయం
Embed widget