నా కూతురు అల్లు అర్జున్‌కు పెద్ద ఫ్యాన్, ఆయనొస్తే నాకు చెప్పండి - మలయాళం హీరో టోవినో థామస్
మలయాళ అగ్ర హీరో టోవినో థామస్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ '2018' నిన్న తెలుగులో విడుదలైన మంచి రెస్పాన్స్ ని అందుకోగా.. తాజాగా మూవీ యూనిట్ సక్సెస్ మీట్ ని నిర్వహించారు.
'201'8లో కేరళ రాష్ట్రంలో ఏర్పడిన వరదల వల్ల అక్కడి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడ్డారో ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్టు చూపించారు. దీంతో ఈ సినిమాని చూసిన ఆడియన్స్ అంతా సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అటు బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల పరంగాను ఈ సినిమా దుమ్ము లేపుతోంది. ఇక ఈ సినిమాలో మలయాళ అగ్ర హీరో టోవినో థామస్, అపర్ణ బాలమురళి, కుంచకో బోబన్, ఇంద్రన్స్, వినీత్ శ్రీనివాసన్, ఆసిఫ్ అలీ, లాల్, నరేన్, తన్వి రామ్, శ్శివద, కలైయరసన్, అజు వర్గీస్, సిద్ధిక్, మరియు జాయ్ మాథ్యూ, సుధీష్ ముఖ్య పాత్రలు పోషించారు. జూడ్ ఆంటోనీ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఇక నిన్న తెలుగులో విడుదలైన ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ రావడంతో తాజాగా 2018 మూవీ యూనిట్ సక్సెస్ మీట్ని నిర్వహించింది.
ఇక ఈ సక్సెస్ మీట్ లో భాగంగా హీరో టోవినో థామస్ మాట్లాడుతూ.. "సుమారు 13 సంవత్సరాల క్రితం నేను ఫ్రెండ్స్ తో కలిసి కాలేజ్ ట్రిప్ కోసం హైదరాబాద్ వచ్చాను. నేను నటించిన కొన్ని మలయాళ సినిమాలు తెలుగు డబ్బింగ్ వర్షన్ లో 'ఆహా' వీడియోలో ఉన్నాయి. ఇక ఫస్ట్ టైం ఈ మూవీ ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చాను. ఈ సినిమాను ఎవరూ ఊహించిన విధంగా తెలుగు ఆడియో రిసీవ్ చేసుకున్నందుకు వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. 2018 సినిమాని ఆదరించిన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇప్పటినుంచి నా తర్వాతి సినిమాలన్నీ తెలుగులో కచ్చితంగా డబ్ అయ్యేలా చూస్తాను. ఎందుకంటే తెలుగు ప్రేక్షకులు చూపిస్తున్న ఇంత ప్రేమను ఎవరు వదులుకోవాలి అనుకోరు. అందుకే ఇకనుంచి నా మలయాళ సినిమాలన్నీ తెలుగులో డబ్ చేయమని నిర్మాతలను సైతం నేనే స్వయంగా రిక్వెస్ట్ చేస్తాను. ఈ సినిమాకి కేరళలోనే కాకుండా అన్ని చోట్ల నుంచి మంచి స్పందన వస్తోంది. తెలుగులో ఈ సినిమా రిజల్ట్ గురించి నిర్మాత బన్నీ వాసు మార్నింగ్ మాట్లాడినప్పుడు ఎంతో ఆనందం వేసింది.
Also Read : నిఖిల్ హీరోగా రామ్ చరణ్ సమర్పించు 'ది ఇండియా హౌస్' - తగలబడిన ఇంటి మిస్టరీ ఏమిటో?
ఇక మన ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది టాలెంటెడ్ యాక్టర్స్, టెక్నీషియన్స్, ప్రొడ్యూసర్స్ ఉన్నారు. వాళ్లంతా మన ఇండియన్ సినిమాని ప్రపంచమే గర్వించేలా చేస్తున్నారు. ఉదాహరణకు తెలుగులో 'బాహుబలి' సినిమా విడుదలైన తర్వాత పాన్ ఇండియా ట్రెండ్ వచ్చింది. అందుకు రాజమౌళి సార్ కి థాంక్స్ చెప్పుకోవాలి. ఇక ఇప్పుడు మళ్లీ 'ఆర్ ఆర్ ఆర్' తో ఇండియన్ సినిమాని గ్లోబల్ లెవెల్ కి తీసుకెళ్లారు రాజమౌళి గారు. ఆయన సినిమాని తీసిన విధానం కానీ, చూపించిన విధానం వరల్డ్ వైడ్ గా ఉన్న ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. ఇది కచ్చితంగా ప్రతి ఫిలిం మేకర్ కి ట్రూ ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ప్రపంచమే గర్వించదగ్గ సినిమాలను తెలుగు ఇండస్ట్రీ తీయగలదని నేను చాలా స్ట్రాంగ్ గా నమ్ముతున్నాను. ఎందుకంటే ఇప్పుడు తెలుగు సినిమా స్థాయి పెరిగింది. ముందు ముందు తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా అత్యున్నత స్థాయికి చేరుకుంటుంది. చాలామందికి సినిమాలు అనేవి ఎంటర్టైన్మెంట్ మాత్రమే. కానీ నాకు అలా కాదు. నాకు సినిమానే జీవితం. రానున్న రోజుల్లో ప్రేక్షకులు ఈ సినిమాని మరింత ఆదరిస్తారని కోరుకుంటున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు.
Also Read : ఎన్టీఆర్‌ను దేవుడిని ఎందుకు కొలుస్తున్నారు? ఆయనకు ఎందుకు అంత క్రేజ్?