By: ABP Desam | Updated at : 07 May 2022 10:24 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
సర్కారు వారి పాట ప్రీ-రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతున్న సుకుమార్ (Image Credits: Screen Grab/Shreyas Media)
మ మ మహేషు సాంగ్‌ని తను ఇప్పటికే చూశానని, ఇలాంటి మహేష్ బాబును ఇప్పటివరకు చూడలేదని ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ అన్నారు. మహేష్ బాబు హీరోగా నటించిన ‘సర్కారు వారి పాట’ ప్రీ-రిలీజ్ ఫంక్షన్‌లో సుకుమార్ పాల్గొని మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో సుకుమార్ మాటలివే...‘సర్కారు వారి పాట ట్రైలర్ చూసినప్పటి నుంచి సినిమా కోసం నేను కూడా ఎదురు చూస్తున్నాను. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ నిర్మాతలు నాకు బాగా కావాల్సిన వారు. వారందరికీ ఆల్‌ది బెస్ట్. బుజ్జి (పరశురామ్) నాకు చాలా కాలం నుంచి తెలుసు. తను అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పటి నుంచి తనను చూస్తున్నాను. ఇప్పుడు ఉన్న బెస్ట్ డైలాగ్ రైటర్స్ కొద్ది మందిలో తను కూడా ఒకరు. గీత గోవిందం తరహాలో సెన్సిబుల్‌గా కథను చెప్పే ఆర్ట్ తన దగ్గర ఉంది. తను మాస్ సినిమా చేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా అలా ఉంటుంది. బుజ్జికి ఆల్ ది బెస్ట్.’
‘మహేష్ బాబు నాకు 1-నేనొక్కడినే సమయంలో చాలా సపోర్ట్ చేశారు. ఆయన సెట్లో డైరెక్టర్ మహారాజులా ఫీల్ అవుతారు. అంత బాగా చూసుకుంటారు. డైరెక్షన్ చేసేటప్పుడు ఆయన మళ్లీ మరో టేక్ అంటే చాలా ముద్దుగా ఉంటుంది. నా జీవితంలో ఆ సినిమా చేసిన రోజులు మళ్లీ మర్చిపోలేను. మహేష్ బాబును ఇంత జోవియల్‌గా చూడటం చాలా ఆనందంగా ఉంది.’
‘మైత్రీ మూవీ మేకర్స్ విజయ పరంపరలో ఈ సినిమా ఒక మైలురాయి కావాలని కోరుకుంటున్నాను. థమన్ స్వరపరిచిన కళావతి, మహేష్ సాంగ్స్ నాకు ఎంతో నచ్చాయి. మిగతా టెక్నీషియన్స్ అందరికీ కంగ్రాట్స్.’ అంటూ సుకుమార్ తన స్పీచ్ ముగించారు.
Samudram Chittabbai: చక్కని విలేజ్ ప్రేమ కథ ‘సముద్రం చిట్టబ్బాయి’, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
Thank You Teaser: నాగ చైతన్య ‘థాంక్యూ’ టీజర్, లైఫ్‌లో ఇక కాంప్రమైజ్ అయ్యేదే లేదంటున్న చైతు!
Karan Johar New Movie: రూట్ మార్చిన బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ - 'ఆర్ఆర్ఆర్', 'కెజియఫ్ 2' విజయాలే కారణమా?
Prashanth Neel Met Kamal Haasan: కమల్ హాసన్‌కు NTR 31 కథ చెప్పిన ప్రశాంత్ నీల్ - లోక నాయకుడు ఏం చెబుతాడో?
1947 August 16 Movie First Look: స్వాతంత్య్రం వచ్చిన మర్నాడు ఏం జరిగింది? - ఏఆర్ మురుగదాస్ నిర్మిస్తున్న చిత్రమిది
Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి
Bandi Sanjay Sensational Comments: తెలంగాణలో మసీదులన్నీ తవ్వాలి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
Income Earners: నెలకు రూ.25వేలు జీతమా! కంగ్రాట్స్ - ఇండియా టాప్-10లో ఉన్నట్టే!
MLC Suspend YSRCP : ఎమ్మెల్సీ అనంతబాబు సస్పెండ్ - కీలక నిర్ణయం తీసుకున్న వైఎస్ఆర్సీపీ !