News
News
వీడియోలు ఆటలు
X

Tollywood: మాస్ మంత్రం జపిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోలు - వర్కవుట్ అవుతుందా?

టాలీవుడ్ యువ హీరోలందరూ ఇప్పుడు మాస్ మంత్రం జపిస్తున్నారు. ప్రతి ఒక్కరూ మాస్ హీరో అనిపించుకోడానికి తాపత్రయ పడుతున్నారు. అఖిల్, నాగచైతన్య దగ్గర నుంచి నాని, నితిన్ వరకూ అందరూ అదే బాటలో పయనిస్తున్నారు.

FOLLOW US: 
Share:

త రెండేళ్లుగా మాస్ అండ్ యాక్షన్ సినిమాలు పాన్ ఇండియా బాక్సాఫీసు వద్ద సత్తా చాటుతున్నాయి. అందుకే మన టాలీవుడ్ హీరోలు అందరూ మాస్ మంత్రం జపిస్తున్నారు. ఇప్పటికే అగ్ర కథానాయకులంతా మాస్ సినిమాలు చేస్తుండగా.. ఇప్పుడు యంగ్ హీరోలు సైతం అదే బాటలో వెళ్తున్నారు. ఏ హీరోకైనా స్టార్ డమ్, పెద్ద మార్కెట్ క్రియేట్ చేసేది మాస్, కమర్షియల్ చిత్రాలే కాబట్టి.. ప్రతీ ఒక్కరూ మాస్ హీరో అనిపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

‘దసరా’తో నాని

నేచురల్ స్టార్ నాని ఇప్పటి వరకూ పక్కింటి అబ్బాయి తరహా రోల్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు 'దసరా' సినిమాతో మాస్ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా తన కెరీర్ లోనే తొలిసారిగా ఊర మాస్ అవతార్ లోకి మారిపోయాడు. తెలంగాణా బొగ్గు గనుల నేపథ్యానికి తగ్గట్టుగా.. డీ గ్లామరైజ్డ్ గెటప్ ట్రై చేశాడు. రా అండ్ రస్టిక్ లుక్ లో అదరగొట్టాడు. ఇది నానీకి ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. మార్చి 30న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది.

‘ఏజెంట్‌’గా అఖిల్

యూత్ కింగ్ అఖిల్ అక్కినేని కూడా మాస్ హీరో అనిపించుకోడానికి తీవ్రంగా కష్టపడుతున్నారు. డెబ్యూ మూవీతోనే మాస్ దృష్టిలో పడాలని చూసిన అక్కినేని హ్యాండ్సమ్ హీరో.. ఇప్పుడు 'ఏజెంట్' మూవీతో మరోసారి మాస్ కావాలంటున్నాడు. దీని కోసం హార్డ్ వర్క్ అవుట్స్ చేసి కండలు తిరిగిన సిక్స్ ప్యాక్ బాడీని రెడీ చేశాడు. అందులోనూ ఇది పాన్ ఇండియా చిత్రం కావటంతో.. రెట్టింపు ఎఫెర్ట్స్ పెడుతున్నాడు. ‘ఏజెంట్’ సినిమా ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.

‘కస్టడీ’లో నాగ చైతన్య

మరో అక్కినేని హీరో యువ సామ్రాట్ నాగచైతన్య కెరీర్ ప్రారంభం నుంచీ మాస్, కమర్షియల్ హీరోగా పేరు తెచ్చుకోవాలని చూస్తున్నప్పటికీ.. సాఫ్ట్ రోల్స్ మాత్రమే అతనికి హిట్లు అందించాయి. అయితే ఇప్పుడు మళ్లీ పక్కా కమర్షియల్ కంటెంట్ తో వస్తున్నాడు చైతూ. 'కస్టడీ' సినిమాతో తన నుంచి అక్కినేని ఫ్యాన్స్ ఆశించే అన్ని అంశాలను చూపించడానికి రెడీ అయ్యాడు. ఇది చైతన్యకి తమిళ్ డెబ్యూ. ఇటీవల రిలీజైన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సమ్మర్ కానుకగా మే 12న ఈ బైలింగ్వల్ మూవీ థియేటర్లోకి రానుంది.

బోయపాటి స్కూల్లో రామ్

ఎనర్జిటిక్ హీరో, ఉస్తాద్ రామ్ పోతినేని మాస్ హీరో అనిపించుకోవాలని ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాడు. ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో తన మాస్ ఏంటో చూపించిన రాపో.. ప్రస్తుతం నటిస్తున్న సినిమాతో పాన్ ఇండియా వైడ్ సత్తా చాటాలని భావిస్తున్నాడు. దీని కోసం ఊర మాస్ కు కేరాఫ్ అడ్రస్ అయిన డైరక్టర్ బోయపాటి శ్రీనును  నమ్ముకున్నారు.

‘లైగర్’ దెబ్బను లెక్క చేయని VD

'లైగర్' తో పాన్ ఇండియా బాక్సాఫీసు వద్ద బొక్కబోర్లా పడ్డ రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. మళ్లీ మాస్ బాట పడుతున్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ కమర్షియల్ సబ్జెక్ట్ చేయటానికి సన్నద్ధం అవుతున్నాడు.

మాస్ కా దాస్ ‘ధమ్కీ’

ట్యాగ్ లోనే మాస్ ని పెట్టుకున్న మాస్ కా దాస్ విశ్వక్ సేన్.. ఇప్పుడు 'దాస్ కా ధమ్కీ' చిత్రంతో ఆడియన్స్ ను పలకరించబోతున్నాడు. ఉగాది సందర్భంగా మార్చి 22న రిలీజ్ కానుంది.

‘మీటర్’ రైజ్ అవుతుందా?

యువ హీరో కిరణ్ అబ్బవరం సైతం ఇప్పుడు మా మా మాస్ అంటున్నాడు. 'మీటర్' సినిమాతో తన మార్కెట్ ని నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లాలని ప్లాన్ చేసుకున్నాడు. ఇటీవల రిలీజైన టీజర్ ను బట్టి కిరణ్ కూడా మాస్ మంత్రం జపిస్తున్నాడని స్పష్టం అవుతుంది.

నితిన్ మళ్లీ అదే బాట

'మాచర్ల నియోజక వర్గం' చిత్రంతో దెబ్బ తిన్నప్పటికీ, యూత్ స్టార్ నితిన్ మాస్ ని మాత్రం వదలడం లేదు. వక్కంతం వంశీ సినిమాతో తనలోని మాస్ హీరోని పూర్తిగా బయటికి తీయడానికి కృషి చేస్తున్నాడు.

నిఖిల్ ‘పాన్’ మంత్రం

యువ హీరో నిఖిల్ సైతం మాస్, కమర్షియల్ మూవీ చేయాలని చూస్తున్నాడు. 'కార్తికేయ 2' చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో వచ్చిన గుర్తింపును క్యాష్ చేసుకోవడానికి ప్లాన్స్ వేస్తున్నాడు. 

ఇలా టాలీవుడ్ కుర్ర హీరోలందరూ మాస్, యాక్షన్ మిక్స్ చేసిన చిత్రాలతో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నారు. మరి వీరిలో ఎవరెవరు మాస్ హీరోలుగా రాణిస్తారో చూడాలి.

Published at : 21 Mar 2023 07:42 PM (IST) Tags: Tollywood Akhil cinema news Kiran Abbavaram Nithin Nikhil young heroes RAPO VD Nani NagaChaithanya Viswak sen

సంబంధిత కథనాలు

Cannes 2023: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సత్తా చాటిన 'శాకుంతలం', ఏకంగా నాలుగు కేటగిరీల్లో అవార్డులు

Cannes 2023: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సత్తా చాటిన 'శాకుంతలం', ఏకంగా నాలుగు కేటగిరీల్లో అవార్డులు

Keerthy Suresh Dating: ఆ అసత్య వార్తలతో మనఃశాంతి కరువవుతోంది - కీర్తి సురేష్‌ తండ్రి ఆవేదన!

Keerthy Suresh Dating: ఆ అసత్య వార్తలతో మనఃశాంతి కరువవుతోంది - కీర్తి సురేష్‌ తండ్రి ఆవేదన!

చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్

చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్

గీతా ఆర్ట్స్‌లో అక్కినేని, శర్వానంద్‌కు యాక్సిడెంట్ - నేటి టాప్ 5 సినీ విశేషాలివే!

గీతా ఆర్ట్స్‌లో అక్కినేని, శర్వానంద్‌కు యాక్సిడెంట్ - నేటి టాప్ 5 సినీ విశేషాలివే!

NTR In Rest Mode : 'దేవర'కు ఇంకో వారం విశ్రాంతి - ఎన్టీఆర్ మళ్ళీ సెట్స్‌కు వచ్చేది ఎప్పుడంటే?

NTR In Rest Mode : 'దేవర'కు ఇంకో వారం విశ్రాంతి - ఎన్టీఆర్ మళ్ళీ సెట్స్‌కు వచ్చేది ఎప్పుడంటే?

టాప్ స్టోరీస్

Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం

Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం

IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!

IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!

Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్‌ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!

Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్‌ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!

NTR కి నిజమైన రాజకీయ, పరిపాలన వారసుడు సీఎం కేసిఆర్ : మంత్రి ఎర్రబెల్లి

NTR కి నిజమైన రాజకీయ, పరిపాలన వారసుడు సీఎం కేసిఆర్ : మంత్రి ఎర్రబెల్లి