Kalpika Ganesh: టాలీవుడ్‌లో మరో వివాదం - అభినవ్ గోమటంపై మండిపడుతున్న కల్పిక గణేష్!
టాలీవుడ్‌లో కల్పిక గణేష్, అభినవ్ గోమటంల మధ్య వివాదం నెలకొంది.
టాలీవుడ్‌లో మరో వివాదం రాజుకుంది. తనను ‘ఐటం’ అన్నాడంటూ సహాయ పాత్రల్లో కనిపించిన నటి కల్పిక గణేష్, సహ నటుడు అభినవ్ గోమటంపై మండి పడుతోంది. కల్పిక గణేశ్ ఇటీవలే ఓ కార్యక్రమంలో ఉత్తమ సహాయనటి అవార్డును అందుకుంది.
అయితే మరో ప్రముఖ టాలీవుడ్ నటుడు అభినవ్ గోమటం తనను ఐటెం అంటూ అవమానకరంగా వ్యాఖ్యానించాడని కల్పిక గణేష్ మండిపడుతోంది. అంతేకాకుండా అభినవ్ తనపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. తెలంగాణ ప్రభుత్వానికి కూడా కల్పిక ఈ విషయంపై ఫిర్యాదు చేసింది.
ట్విట్టర్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ట్యాగ్ చేస్తూ అభినవ్ పై చర్యలు తీసుకోవాలని కోరింది. దీంతోపాటు ఇండస్ట్రీకి చెందిన హీరోలను, హీరోయిన్లను, దర్శకులను కూడా తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో ట్యాగ్ చేసింది. అయితే మరోవైపు అభినవ్ గోమటం సారీ చెప్పేందుకు ససేమిరా అంటున్నాడు. కల్పిక గణేష్ ఉద్దేశపూర్వకంగానే తనను టార్గెట్ చేసిందని అభినవ్ ఆరోపిస్తున్నాడు.
@RaoKavitha @Telangana4C @cyber @dcpmadhapur_cyb @Cyberdost @StaySafeOnline @NSACyber pic.twitter.com/UPO056SoQv
— kalpika (@Iamkalpika) October 26, 2022
View this post on Instagram
View this post on Instagram