అన్వేషించండి

Tollywood New Trend: రింగులు తిరుగుతున్న జుట్టు, ఇప్పుడిదే టాలీవుడ్‌లో నయా ట్రెండ్

టాలీవుడ్ లో ఇప్పుడు రింగుల జుట్టు ట్రెండ్ నడుస్తోంది. ఫ్యాన్స్ ను ఆకట్టుకోడానికి మన హీరోలు హెయిర్ స్టైల్ తో ప్రయోగాలు చేస్తున్నారు. యంగ్ హీరోలే కాదు.. స్టార్ హీరోలు సైతం ఇదే ఫాలో అవుతున్నారు.

సినిమాల్లో కథానాయకుడు అంటే మంచి ఫిజిక్ తో స్టైలిష్ గా ఉండాలి. అందం అభినయంతో పాటుగా పాత్రకి తగ్గట్టుగా పర్ఫెక్ట్ ఫిజిక్ ఉండాలి. దీనికి మంచి హెయిర్ స్టైల్ కూడా తోడైతే, స్క్రీన్ మీద మరింత ఆకర్షణీయంగా కనిపిస్తారు. మన తెలుగు హీరోల విషయానికొస్తే, ఒక్కొక్కరు ఒక్కో రకమైన హెయిర్ స్టైల్ ను మెయింటైన్ చేస్తూ.. ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించడానికి ప్రయత్నం చేస్తుంటారు. సినిమాలో తమ పాత్రకు తగినట్లుగా జుట్టుని పెంచుకొని, న్యూ లుక్ తో ఆడియన్స్ ను మెప్పిస్తుంటారు.

హిట్టు కోసం సరికొత్త హెయిర్ స్టైల్ లో హీరోలు

అందులోనూ ఇటీవల కాలంలో ప్రేక్షకుల అభిరుచి పూర్తిగా మారిపోయింది. కొత్త కంటెంట్, వైవిధ్యమైన పాత్రలతో వస్తేనే ఆదరిస్తున్నారు. బాక్సాఫీస్‌ దగ్గర కాసుల వర్షం కురవాలంటే, ప్రతి సినిమాలోనూ ఏదొక కొత్తదనం చూపించాల్సి వస్తోంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మన హీరోలందరూ సరికొత్త కథలతో పాటుగా లుక్ విషయంలోనూ ప్రయోగాలు చేస్తున్నారు. ప్రేక్షకులను అట్రాక్ట్ చేసేందుకు ట్రెండీ హెయిర్ స్టైల్ లో దర్శనమిస్తున్నారు.  

టాలీవుడ్ లో ప్రస్తుతం రింగుల జుట్టు ట్రెండ్ నడుస్తోందని చెప్పాలి. స్టార్ హీరోల దగ్గర నుంచి కుర్ర హీరోలు వరకూ, అందరూ కర్లీ హెయిర్ స్టైల్ తో ప్రయోగాలు చేస్తున్నారు. మాసీ లుక్ కోసం రింగులు తిరిగిన జుట్టుతో పాటుగా గుబురు గడ్డాన్ని పెంచుతున్నారు. మునుపెన్నడూ చూడని మేకోవర్ తో ఆకట్టుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో కేశాలంకరణలో వైవిద్యం చూపించిన తెలుగు హీరోలెవరో ఇప్పుడు చూద్దాం!

'పుష్ప' - అల్లు అర్జున్

స్టైలింగ్ విషయంలో ఏమాత్రం తగ్గేదేలే అనే యాటిట్యూడ్‌ తో సాగిపోయే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌.. క్యారక్టర్ కి తగ్గట్టు మేకోవర్‌ అవడంలో ఎందరికో ఇన్‌స్పిరేషన్‌ గా నిలిచాడు. 'పుష్ప' సినిమాలో పుష్పరాజ్ అనే ఊర మాస్ పాత్ర కోసం బన్నీ తనని తాను మార్చుకున్న విధానం ప్రశంసనీయం. రింగు రింగుల జుట్టు, గుబురు గడ్డం, మాసిన చొక్కా, మెడలో తాయత్తుతో మాస్ లుక్ తో అందరినీ ఆశ్చర్య పరిచాడు. నిజంగా శేషాచలం అడవుల్లో కూలీగా జీవనం సాగించే యువకుడు ఇలానే ఉంటాడా అని అనుకునే విధంగా మారిపోయాడు. ప్రస్తుతం సెట్స్ మీదున్న 'పుష్ప: ది రూల్' చిత్రంలోనూ బన్నీ రింగుల జుట్టుతోనే కనిపించనున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. 

'దసరా' - నాని

నేచురల్ స్టార్ నాని కెరీర్ ప్రారంభం నుంచీ దాదాపు ఒకేరకమైన హెయిర్ స్టైల్ తో కనిపిస్తూ వచ్చాడు. కథల్లో వైవిద్యం చూపించినా, హెయిర్ స్టైల్ మాత్రం ఒకేలా మైంటైన్ చేసాడు. కానీ 'దసరా' సినిమాలో రింగులు తిరిగిన చింపిరి జుట్టు, మాసిన గడ్డం, చెవికి పోగుతో రగ్డ్ లుక్ లో కనిపించాడు. ఇప్పటివరకూ పక్కింటి అబ్బాయి తరహా రోల్స్ తో అలరించిన నాని.. తొలిసారిగా ధరణి అనే రా అండ్ రస్టిక్ క్యారక్టర్ తో ఆకట్టుకున్నాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెలంగాణా సింగరేణి బొగ్గు గనుల బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ రూరల్ మాస్ డ్రామా నానికి మంచి విజయాన్ని అందించింది. 

'ఏజెంట్' - అఖిల్ అక్కినేని

'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాతో సక్సెస్ అందుకున్న యూత్ కింగ్ అఖిల్ అక్కినేని.. 'ఏజెంట్' మూవీ కోసం కంప్లీట్ మేకోవర్ అయ్యాడు. హార్డ్ వర్కౌట్స్ తో సిక్స్ ప్యాక్ బాడీని సిద్ధం చేసి అందరినీ అవాక్కయ్యేలా చేసాడు. అంతేకాదు పొడవాటి ఉంగరాల జుట్టుతో స్టైలిష్ గా కనిపించాడు. హాలీవుడ్ హీరోలకు ఏమాత్రం తీసిపోని స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకున్నాడు. అయితే సరికొత్త హెయిర్ స్టైల్ అఖిల్ కు హిట్ అందించలేకపోయింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. 

'డీజే టిల్లు' - సిద్ధు జొన్నలగడ్డ

నాని, అఖిల్ ల కంటే ముందు యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ కూడా రింగుల జుట్టుతో దర్శనమిచ్చాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యాన‌ర్‌ లో వచ్చిన 'డీజే టిల్లు' సినిమా కోసం సిద్ధు పూర్తిగా తన హెయిర్ స్టైల్ ను మార్చేశాడు. ఇందులో అతని స్టైలింగ్, 'అట్లుంటది మనతోని' అనే యాటిట్యూడ్ యూత్ ని బాగా ఆకట్టుకున్నాయి. అందుకే ఈ చిత్రాన్ని పెద్ద హిట్ చేసారు. ప్రస్తుతం దీనికి సీక్వెల్ గా తెరకెక్కుతున్న 'టిల్లు స్క్వేర్' సినిమాలోనూ యువ హీరో కర్లీ హెయిర్ తోనే కనిపించనున్నాడు. 

'సెల్ఫిష్' - ఆశిష్ రెడ్డి

దిల్ రాజు ఫ్యామిలీ హీరో ఆశిష్ రెడ్డి కూడా ఇప్పుడు డీజే టిల్లు బాటలోనే నడుస్తున్నాడు. ప్రస్తుతం నటిస్తున్న 'సెల్ఫిష్' సినిమా కోసం పక్కా హైదరాబాద్ కుర్రాడిగా మారుతున్న ఆశిష్.. రింగులు తిరిగిన జుట్టుతో కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజైన సాంగ్ లో అతని లుక్ ఆకట్టుకుంది. 'రౌడీ బాయ్స్' తర్వాత యువ హీరో నటిస్తోన్న రెండో సినిమా ఇది. దీనికి విశాల్ కాశి దర్శకత్వం వహిస్తున్నాడు.

'లైగర్' - విజయ్ దేవరకొండ

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేసిన మూవీ 'లైగర్'. ఇందులో VD సాలా క్రాస్ బ్రీడ్ అంటూ రింగులు తిరిగిన పొడవాటి హెయిర్ స్టైల్ తో కనిపించాడు. సిక్స్ ప్యాక్ బాడీతో సెమీ న్యూడ్ గా నిలబడ్డప్పటికీ, ఈ సినిమా విజయ్ కు హిట్ ఇవ్వలేకపోయింది. 

బోయపాటి సినిమా - రామ్ పోతినేని

ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా రూపొందితున్న సంగతి తెలిసిందే. ఇందులో రాపో ఒత్తుగా ఉండే ఉంగరాల జుట్టు, గడ్డంతో కనిపించనున్నాడు. ఆ మధ్య వదిలిన ఫస్ట్ లుక్ లో ఎనర్జిటిక్ రామ్ ఒక దున్నపోతుని పట్టుకొని ఉన్న స్టిల్, ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. అయితే సినిమా అంతా ఇదే హెయిర్ స్టైల్ ని మెయింటైన్ చేస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. 

రింగుల జుట్టుతో సుమ కొడుకు

పాపులర్ యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల కొడుకు రోషన్ హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. 'క్షణం' ఫేమ్ రవికాంత్ పేరేపు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ న్యూ ఏజ్ రోమ్-కామ్‌‌‌‌‌‌‌‌ లో రోషన్ రింగుల జుట్టుతో కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్ లో డీజే బాయ్ గా ఆకట్టుకున్నాడు. ఇలా టాలీవుడ్ లో పలువురు హీరోలు రింగుల జుట్టుతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వారిలో కొందరికి సక్సెస్ దక్కితే, మరికొందరిని పరాజయం పలకరించింది. మరి రానున్న రోజుల్లో ఎంతమంది హీరోలు కర్లీ హెయిర్ తో వస్తారో చూడాలి.

Read Also: అప్పుడు వినేవారు కాదు, ఇప్పుడు వింటున్నారు - సోదరుల విడాకులపై సల్మాన్ ఫన్నీ కామెంట్స్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఏసీబీ ఆఫీసు వద్ద హైడ్రామా, తీవ్ర అసంతృప్తితో అక్కడి నుంచి వెనుదిరిగిన కేటీఆర్
ఏసీబీ ఆఫీసు వద్ద హైడ్రామా, తీవ్ర అసంతృప్తితో అక్కడి నుంచి వెనుదిరిగిన కేటీఆర్
First HMPV Case In India: భారత్‌లో తొలి HMPV Virus కేసు! బెంగళూరులో 8 నెలల చిన్నారికి పాజిటివ్
భారత్‌లో తొలి HMPV Virus కేసు! బెంగళూరులో 8 నెలల చిన్నారికి పాజిటివ్
YSRCP vs Nara Lokesh: వైసీపీ ఏం పీకిందని నారా లోకేష్ సూటిప్రశ్న! దీటుగా బదులిస్తూ వైసీపీ స్ట్రాంగ్ కౌంటర్
వైసీపీ ఏం పీకిందని నారా లోకేష్ సూటిప్రశ్న! దీటుగా బదులిస్తూ వైసీపీ స్ట్రాంగ్ కౌంటర్
Maadhavi Latha: నాపై కక్ష కట్టి ఇలాంటి మాటలు... బోరున ఏడుస్తూ వీడియో పోస్ట్ చేసిన మాధవీలత
నాపై కక్ష కట్టి ఇలాంటి మాటలు... బోరున ఏడుస్తూ వీడియో పోస్ట్ చేసిన మాధవీలత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Police Notices to Allu Arjun | అల్లు అర్జున్ కు నోటీసులు ఇచ్చిన పోలీసులు | ABP DesamDaaku Maharaaj Trailer Decode | బాలకృష్ణతో కలిసి బాబీ ఆడిస్తున్న మాస్ తాండవం | ABP DesamUnstoppable With NBK Ram Charan | అన్ స్టాపబుల్ లో రచ్చ రచ్చ చేసిన బాలయ్య, రామ్ చరణ్ | ABP DesamIndia out form WTC Final Race | ఆసీస్ దెబ్బతో WTC నుంచి భారత్ ఔట్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఏసీబీ ఆఫీసు వద్ద హైడ్రామా, తీవ్ర అసంతృప్తితో అక్కడి నుంచి వెనుదిరిగిన కేటీఆర్
ఏసీబీ ఆఫీసు వద్ద హైడ్రామా, తీవ్ర అసంతృప్తితో అక్కడి నుంచి వెనుదిరిగిన కేటీఆర్
First HMPV Case In India: భారత్‌లో తొలి HMPV Virus కేసు! బెంగళూరులో 8 నెలల చిన్నారికి పాజిటివ్
భారత్‌లో తొలి HMPV Virus కేసు! బెంగళూరులో 8 నెలల చిన్నారికి పాజిటివ్
YSRCP vs Nara Lokesh: వైసీపీ ఏం పీకిందని నారా లోకేష్ సూటిప్రశ్న! దీటుగా బదులిస్తూ వైసీపీ స్ట్రాంగ్ కౌంటర్
వైసీపీ ఏం పీకిందని నారా లోకేష్ సూటిప్రశ్న! దీటుగా బదులిస్తూ వైసీపీ స్ట్రాంగ్ కౌంటర్
Maadhavi Latha: నాపై కక్ష కట్టి ఇలాంటి మాటలు... బోరున ఏడుస్తూ వీడియో పోస్ట్ చేసిన మాధవీలత
నాపై కక్ష కట్టి ఇలాంటి మాటలు... బోరున ఏడుస్తూ వీడియో పోస్ట్ చేసిన మాధవీలత
CM Revanth Reddy: తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం విజన్‌ 2050 ప్రణాళిక అమలు చేస్తాం: రేవంత్ రెడ్డి
తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం విజన్‌ 2050 ప్రణాళిక అమలు చేస్తాం: రేవంత్ రెడ్డి
Tirupati Road Accident: తిరుపతి జిల్లాలో రోడ్డు ప్రమాదం, అంబులెన్స్ ఢీకొని శ్రీవారి భక్తులు మృతి
తిరుపతి జిల్లాలో రోడ్డు ప్రమాదం, అంబులెన్స్ ఢీకొని శ్రీవారి భక్తులు మృతి
Macherla Turaka Kishore Arrested: పినెల్లి ప్రధాన అనుచరుడు తురకా కిశోర్ అరెస్ట్, మాచర్లలో పలు దాడుల కేసుల్లో నిందితుడు
పినెల్లి ప్రధాన అనుచరుడు తురకా కిశోర్ అరెస్ట్, మాచర్లలో పలు దాడుల కేసుల్లో నిందితుడు
Special Trains: సంక్రాంతికి ఊరెళ్లే వారికి గుడ్ న్యూస్ - 52 అదనపు రైళ్లు ప్రకటించిన ద.మ రైల్వే, పూర్తి వివరాలివే!
సంక్రాంతికి ఊరెళ్లే వారికి గుడ్ న్యూస్ - 52 అదనపు రైళ్లు ప్రకటించిన ద.మ రైల్వే, పూర్తి వివరాలివే!
Embed widget