(Source: ECI/ABP News/ABP Majha)
Tillu Square OTT Release Date: టిల్లన్న పాన్ ఇండియా సక్సెస్ కొడతాడా? ఓటీటీల్లో కామెడీ ఫిలిమ్స్ ట్రెండ్ మారుస్తాడా?
Tillu Square OTT Platform And Languages: 'టిల్లు స్క్వేర్'ను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ అనౌన్స్ చేసింది.
Tillu Square to have Pan India digital release on Netflix on April 26th: 'టిల్లు స్క్వేర్'తో స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ పాన్ ఇండియా సక్సెస్ కొడతాడా? ఈ సినిమా, ఇందులో కామెడీ మిగతా భాషల జనాలకు ఎక్కుతుందా? వంటి డిస్కషన్స్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే...
తెలుగుతో పాటు ఆ నాలుగు భాషల్లోనూ...
'టిల్లు స్క్వేర్' సినిమాను తెలుగులో తీశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ తెలుగు భాషలో విడుదల చేశారు. అయితే... ఇప్పుడీ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో డిజిటల్ రిలీజ్ చేస్తోంది నెట్‌ఫ్లిక్స్. ఈ నెల 26న 'టిల్లు స్క్వేర్'ను పాన్ ఇండియా ఓటీటీ రిలీజ్ డేట్ చేస్తున్నట్లు ప్రముఖ ఓటీటీ వేదిక పేర్కొంది. ''హిస్టరీ రిపీట్ అవ్వడం నార్మల్. అదే టిల్లు వస్తే హిస్టరీ, మిస్టరీ, కెమిస్ట్రీ అన్నీ రిపీట్ అవుతాయి. అట్లుంటది టిల్లుతోని'' అని హైప్ ఇచ్చింది.
ఓటీటీల్లో బోల్తా కొట్టిన కామెడీ ఫిల్మ్స్!
టిల్లు క్యారెక్టర్‌లో సిద్ధూ జొన్నలగడ్డ టిపికల్ కామెడీ టైమింగ్, ఆ డైలాగ్ డెలివరీ మన జనాలకు నచ్చాయి. టిల్లు కామెడీ వర్కవుట్ కావడం వెనుక డైలాగ్స్ కంటే సిద్ధూ చెప్పిన విధానం మేజర్ రోల్ ప్లే చేసింది. సేమ్ మేజిక్ రీ క్రియేట్ చెయ్యడంలో డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎంత వరకు సక్సెస్ అవుతారనే దానిపై మిగతా భాషల్లో ప్రేక్షకుల ఆదరణను డిసైడ్ చేస్తుంది.
కామెడీ సినిమాలకు ఓటీటీల్లో విపరీతమైన ఆదరణ దక్కిన దాఖలాలు కూడా లేవు. 'జాతి రత్నాలు' థియేటర్లలో బ్లాక్ బస్టర్. ఓటీటీలోకి వచ్చాక విమర్శలు వచ్చాయి. ఆ ఒక్కటే కాదు... రీసెంట్ 'ఓం భీమ్ బుష్' కూడా అంతే! థియేట్రికల్ రెస్పాన్స్ ఓటీటీలో రాలేదు. రీ క్రియేట్ చెయ్యలేదు. 'టిల్లు స్క్వేర్' గనుక ఓటీటీలో హిందీ, తమిళ, మలయాళ, కన్నడ జనాలను ఆకట్టుకునే నెక్స్ట్ నుంచి ఈ జానర్ సినిమాలకు డిజిటల్ రైట్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది.
Also Read: కాండ్రకోట మిస్టరీపై సినిమా - 'నింద' ఎవరిది? ఎవరిపై?
థియేటర్లలో దుమ్ము దులిపిన టిల్లు
'టిల్లు స్క్వేర్' థియేటర్లలో బ్లాక్ బస్టర్ అయ్యింది. కలెక్షన్స్ దుమ్ము దులిపింది. ఈ సినిమాకు తొలి పది రోజుల్లో 100 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇప్పటి వరకు 125 కోట్ల రూపాయలకు పైగా కలెక్ట్ చేసింది.
Also Read: 'మ్యాడ్ స్క్వేర్' ప్రారంభోత్సవానికి అతిథిగా 'టిల్లు స్క్వేర్' - సేమ్ సెంటిమెంట్ కంటిన్యూ చేస్తూ...
అనుపమ గ్లామర్ సూపర్ హిట్టు... యాక్టింగ్ కూడా!
'టిల్లు స్క్వేర్' సినిమాలో సిద్ధూ జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) సరసన యంగ్ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) యాక్ట్ చేశారు. సినిమా విడుదలకు ముందు ట్రైలర్లలో ఆమె గ్లామర్ షో గురించి విపరీతంగా డిస్కషన్ జరిగింది. ప్రచార చిత్రాల్లో అనుపమ చూపించిన గ్లామర్ కంటే సినిమాలో ఎక్కువ ఏమీ లేదు. అయితే... ఆవిడ క్యారెక్టర్, అందులో నటన ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేసింది.