Thug Life OTT: ఓటీటీ రిలీజ్ మీద క్లారిటీ ఇచ్చిన కమల్... 'థగ్ లైఫ్'ను ఇంట్లో చూడాలంటే అప్పటివరకు వెయిట్ చేయక తప్పదు
Thug Life OTT Release And Platform: భారీ బడ్జెట్ సినిమాలో అయినా సరే ఇటీవల నాలుగు వారాలలో ఓటీటీలోకి వస్తున్నాయి. కానీ కమల్ హాసన్ తమ 'థగ్ లైఫ్' సినిమా రాదని క్లారిటీ ఇచ్చారు. ఆయన ఏమన్నారంటే?

Kamal Haasan on Thug Life OTT Release: లోక నాయకుడు కమల్ హాసన్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'థగ్ లైఫ్'. ఈ సినిమాలో ఆయన హీరో మాత్రమే కాదు... నిర్మాత కూడా! కమల్ ప్రొడక్షన్ హౌస్ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్, దర్శకుడు మణిరత్నానికి చెందిన మద్రాస్ టాకీస్, ఉదయనిధి స్టాలిన్‌కు రెడ్ఫి జెయింట్ ఫిలింస్ మీద సినిమా రూపొందింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ గురించి కమల్ హాసన్ క్లారిటీ ఇచ్చారు.
థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాలకు...
జూన్ 5న థియేటర్లలో 'థగ్ లైఫ్' విడుదల అవుతోంది. మరి, ఓటీటీలోకి ఎప్పుడు వస్తుంది? అంటే... ఆగస్టు వరకు వెయిట్ చేయాలి. థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల తర్వాత మాత్రమే తమ సినిమా ఓటీటీలోకి వస్తుందని కమల్ హాసన్ స్పష్టం చేశారు. దాంతో హిందీలోనూ ఈ సినిమాకు వైడ్ రిలీజ్ రానుంది.
'థగ్ లైఫ్' ఓటీటీ హక్కులను ఇంటర్నేషనల్ ప్లాట్‌ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. తమిళం తో పాటు తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషలలో స్ట్రీమింగ్ చేయడానికి రెడీ అవుతోంది.
ట్రైలర్‌లో కథ రివీల్ చేసిన మణిరత్నం
'థగ్ లైఫ్' ట్రైలర్ చూస్తే కథ మీద ప్రేక్షకులు అందరికీ ఒక క్లారిటీ వస్తుంది. ఇందులో గ్యాంగ్‌స్టర్ శక్తివేల్ రంగరాయన్ పాత్రలో కమల్ హాసన్ నటించారు. ఆయనను ఒక్కసారి పోలీసులు రౌండప్ చేసినప్పుడు... షూటౌట్‌లో ఒక చిన్న పిల్లాడు కాపాడతాడు. అతడని దగ్గరకు తీసుకుని పెంచి పెద్ద చేస్తాడు కమల్. ఆ పాత్రను శింబు చేశారు. తన సామ్రాజ్యానికి శింబు వారసుడు అనేంతలా కమల్ అతడికి ప్రాధాన్యత ఇస్తారు. అయితే కొన్నాళ్ళకు ఇద్దరి మధ్య శత్రుత్వం ఏర్పడుతుంది. ఒకరినొకరు చంపాలనే ఇంత కసిగా కొట్టుకోవడం మొదలుపెడతారు.
View this post on Instagram
కమల్, శింబు మధ్య గొడవకు కారణం ఏమిటి? వాళ్ళిద్దరి మధ్య శత్రుత్వం ఏర్పడడానికి కారణం ఎవరు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. మణిరత్నం దర్శకత్వంలో స్పార్క్ ఇంకా తగ్గలేదని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ మరక స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది.
'థగ్ లైఫ్' సినిమా ట్రైలర్ విడుదల తర్వాత కమల్ హాసన్, అభిరామి మధ్య లిప్ లాక్... కమల్ - త్రిష మధ్య రొమాంటిక్ సీన్స్ గురించి ఎక్కువ డిస్కషన్ జరిగింది. 70 ఏళ్ల వయసున్న కమల్ తనకంటే వయసులో 30 ఏళ్లు చిన్నవాళ్ళు అయిన హీరోయిన్లతో రొమాంటిక్ సీన్లు చేయడం ఏమిటని సోషల్ మీడియాలో సెటైర్లు పడ్డాయి. తెలుగు హీరోలు ఇటువంటి రొమాంటిక్ సీన్లు చేస్తే తమిళ ప్రేక్షకులు ట్రోలింగ్ చేశారని, ఇప్పుడు కమల్ హాసన్ చేస్తున్నది ఏమిటని ప్రశ్నించారు. మొత్తం మీద ఈ సినిమాకు విపరీతమైన ప్రచారం లభించింది.
తెలుగులో 'థగ్ లైఫ్' సినిమాను నితిన్ తండ్రి, ప్రముఖ నిర్మాత కమ్ డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డి విడుదల చేస్తున్నారు. శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ ఎత్తున పంపిణీ చేస్తున్నారు.





















