అన్వేషించండి

Thotapalli Madhu: వాణి విశ్వనాథ్‌, నేను పెళ్లి చేసుకోడానికి ఆ గుడికి వెళ్లాం - సినిమాల్లో పనిచేసే ఆడవారితో అదే సమస్య - నటుడు తోటపల్లి మధు

Thotapalli Madhu: ఒక్క ఇంటర్వ్యూతోనే సెన్సేషన్ క్రియేట్ చేశారు తోటపల్లి మధు. అందులో తనకు ఇండస్ట్రీలో ఉన్న లవ్ స్టోరీల గురించి చెప్తూ వాణి విశ్వనాథ్‌ను పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నట్టు బయటపెట్టారు.

Thotapalli Madhu About Vani Viswanath: టాలీవుడ్ సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన తోటపల్లి మధు.. తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూ.. టాలీవుడ్‌లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. సినీ పరిశ్రమలోని సీనియర్లు అందరి గురించి మర్యాద లేకుండా మాట్లాడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అంతే కాకుండా ఈ ఇంటర్వ్యూలో తనకు ఉన్న లవ్ ఎఫైర్స్ గురించి కూడా బయటపెట్టారు. తన పర్సనల్ విషయాల గురించి, కెరీర్ మొదట్లో తను పడిన కష్టాల గురించి కూడా చెప్పుకొచ్చారు తోటపల్లి మధు. ఒక సీనియర్ నటి పేరును ప్రస్తావిస్తూ మధు చేసిన వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తున్నాయి.

పెళ్లి జరగలేదు..

‘ఘరానా మొగుడు’ ఫేమ్ వాణి విశ్వనాథ్‌తో తనకు ప్రేమాయణం నడిచిందని షాకింగ్ విషయాలు బయటపెట్టారు తోటపల్లి మధు. ‘‘భలే దంపతులు.. సినిమా సమయంలో నేను, వాణి విశ్వనాథ్ పెళ్లి చేసుకుందామని అనుకున్నాం. పెళ్లి చేసేసుకోవాలని కేరళలోని గురువాయుర్‌కు కూడా వెళ్లాం. ఆరోజు సూర్య గ్రహణం అని గుడి తెరవలేదు. అందుకే వెనక్కి వచ్చేశాం, చేసుకోలేదు. అప్పటికే సంవత్సరం పాటు కలిసి తిరిగాం. మొదట్లో అంతా బాగానే ఉంది. కానీ ఈ సినిమాలో పనిచేసే ఆడవారి దగ్గర సమస్య ఏంటంటే వారిని తృప్తిపరిచేలాగా డబ్బులు సంపాదించాలి, మాటలు చెప్పాలి. అలా రెండు, మూడు సార్లు జరిగింది. పెళ్లి వరకు వెళ్లి.. అయిపోయింది అనుకున్నా కూడా అవ్వలేదు’’ అని చెప్పుకొచ్చారు తోటపల్లి మధు.

ఇండస్ట్రీతో సంబంధం లేదు..

తోటపల్లి మధుకు క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలో గుర్తింపు ఉన్నా కూడా తన పిల్లలను కూడా వీటన్నింటికి దూరంగా పెంచానని, అబ్బాయిని అమెరికాలో చదివించానని తెలిపారు. తన కొడుకును సినీ పరిశ్రమకు దూరంగా పెంచినందుకు తనను చాలామంది మెచ్చుకున్నారని గుర్తుచేసుకున్నారు. ఇప్పటికీ కూడా తన ఇంట్లో ఇండస్ట్రీకి సంబంధించిన ఒక్క షీల్డ్ కూడా ఉండదని బయటపెట్టారు. ఇక కాలేజీ రోజుల నుండే నాటకాలపై ఆసక్తితో ఉండేదని, ప్రిన్సిపల్‌తో సహా ప్రతీ ఒక్కరు తాను సినిమాల్లోకి వెళ్తానని ఫిక్స్ అయ్యి ఉండేవారని అన్నారు. సినిమాలపై ఇష్టంతో చెన్నైకు వచ్చిన మధుకు మొదట్లో ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయో గుర్తుచేసుకున్నారు.

అరటి తొక్కలు తిన్నాను..

‘‘మద్రాస్‌కు వెళ్లి బాలచందర్‌ను కలిశాను. అలా ఆఫీసులకు వెళ్లడం, రావడం జరుగుతూ ఉండేది. అప్పుడప్పుడు అక్కడ భోజనం పెట్టేవాళ్లు. అప్పట్లో పాండీ బజార్‌లోనే నా రూమ్. రెండు రోజులకు ఒకసారి లేదా రోజుకు ఒకసారి మాత్రమే భోజనం చేసేవాడిని. దాదాపు రెండేళ్లు అలా గడిపాను. ఒక్కొక్కసారి అసలు తినడానికి ఏం లేకపోతే కిరాణా కొట్టు దగ్గర పడేసిన అరటి తొక్కలను ఎవరూ చూడకుండా తీసుకొని, వాటిని కడుక్కొని తినేవాడిని’’ అంటూ అప్పటి కష్టాలను గుర్తుచేసుకున్నారు తోటపల్లి మధు. మొత్తానికి ఒక ఇంటర్వ్యూతో సెన్సేషన్ క్రియేట్ చేశారు ఈ సీనియర్ నటుడు.

Also Read: కింగ్ చుట్టూ ఏపీ రాజకీయాలు - నాగార్జున మద్దతు ఆ పార్టీకేనా? ఆ వార్తల్లో నిజమెంతా?

టాప్ హెడ్ లైన్స్

Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Priyanka Chopra: సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Ajith Kumar Shankar : అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?
అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?

వీడియోలు

Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Job Notifications Politics: ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
Fact Check: విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
West Bengal Politics : బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
Priyanka Chopra: సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
Embed widget