ఈ ఐదు ఆహార పదార్థాలు గుండెకు విషం లాంటివి అనారోగ్యకరమైన కొవ్వులు, సోడియం అధికంగా ఉన్న సాసేజ్ లు, బేకన్ ఫుడ్స్ గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. చక్కెర పానీయాలు తాగితే బరువు పెరగడంతోపాటు గుండెజబ్బులు, టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంది. వేయించిన, ప్రాసెస్ చేసిన ఫుడ్స్ లో కనిపించే ట్రాన్స్ ఫ్యాట్స్ చెడు కొలెస్ట్రాల్ ను పెంచుతాయి. మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే అధిక రక్తపోటు, గుండెజబ్బులు, స్ట్రోక్ లకు కారణం అవుతుంది. వైట్ బ్రెడ్, పేస్ట్రీలు, చక్కెర స్నాక్స్ వంటి ఆహారాలు శుద్ధి చేసిన కార్బొహైడ్రెట్స్ ను కలిగి ఉంటాయి. వీటిని ఎక్కువగా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయి పెరగడంతోపాటు గుండె జబ్బులకు ప్రమాదం పెంచుతాయి.