రోజూ ఒక గ్లాస్ దానిమ్మ జ్యూస్ తాగితే అదిరే బెనిఫిట్స్. దానిమ్మరసంలో ఉండే పాలీఫెనాల్, ఇన్ఫ్లమేటరీ పేగు వ్యాధి, ఇతర సమస్యలతో బాధపడుతున్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. దానిమ్మలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీర వాపును తగ్గించడంలో సహాయపడతాయి. యాంటీఆక్సిడెంట్లతో నిండిన దానిమ్మ రసం రక్తపోటును తగ్గిస్తుంది. గుండె ధమనులను కాపాడుతుంది. దానిమ్మలో మెగ్నీషియం, విటమిన్ కె, ఇథిలిన్ వంటివి రక్తపోటు, గ్లూకోజ్ స్థాయిలను కంట్రోల్లో ఉంచుతాయి. దానిమ్మ జ్యూస్ అల్జీమర్స్ వ్యాధికి సంబంధించిన లక్షణాలను తగ్గించే సామర్థ్యం కలిగి ఉంటుంది. ప్రొస్టెట్ క్యాన్సర్ లేదా నివారణలో దానిమ్మ సహజ చికిత్సకు ఉపయోగడుతుంది. దానిమ్మ జ్యూస్ క్రమం తప్పకుండా తీసుకుంటే సిస్టోలిక్ ఒత్తిడి తగ్గుతుంది. దానిమ్మలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇమ్యూనిటీనిపెంచుతుంది. ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది.